సప్తగిరి ఎమోషనల్ డైలాగ్స్, కొన్ని కామెడీ సీన్స్సప్తగిరి ఎమోషనల్ డైలాగ్స్, కొన్ని కామెడీ సీన్స్హీరోయిన్, డైరెక్షన్, రొటీన్ క్లైమాక్స్

హెడ్ కానిస్టేబుల్ శివ ప్రసాద్ కొడుకు అయిన సప్తగిరి పోలీస్ క్వార్టర్స్ లో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నటుడవ్వాలని కోరికతో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తుంటాడు. క్వార్టర్స్ లో సరదాగా ఉండే సప్తగిరి తన తండ్రి మాత్రం అతన్నో ఐపిఎస్ రేంజ్ ఆఫీసర్ గా చూడాలని అనుకుంటాడు. కాని తండ్రి మాటను లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతాడు. సిటీలో ఎన్నో దారుణాలకు పాలుపడుతున్న మాణిక్యం ను ఎన్ కౌంటర్ ఆర్డర్ తీసుకున్న సిఐ పోసాని పథకం ప్రకారం శివ ప్రసాద్ ను హత్య చేయించి అది ఎంకౌంటర్ లో మాణిక్యం మనుషులు చేసిన పనిగా అందరిని నమ్మిస్తారు. శివ ప్రసాద్ సిన్సియారిటీ తెలిసిన ఎస్.పి శియాజి షిండే కొడుకు సప్తగిరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక అక్కడ నుండి తండ్రి చావుకు కారణం అయిన వారిని సప్తగిరి ఎలా మట్టుపెట్టాడు అన్నది అసలు కథ.  

సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే ముందు డైరక్టర్ అరుణ్ పవార్.. సప్తగిరి హీరోగా చూపించే ప్రయత్నం కొంతమేరకు బాగున్నా సినిమా ఇంకా గ్రిప్పింగ్ గా తీసి ఉండాల్సింది. ఇక ఈ కథలో సప్తగిరి సహకారం కూడా ఉంది. ఎన్ని చేతులు కలిసినా సినిమా మాత్ర అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సాంగ్స్ మాములుగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ ఇన్నాళ్లు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన సప్తగిరి హీరోగా పర్వలేదు అనిపించాడు. అయితే హీరోగా ఉన్నా తన కమెడియన్ వేశాలు ఎక్కడికి పోలేదు. ప్రయత్నం కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అయితే ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ బాగానే ఉన్నా ఓ హీరోకి ఉండాల్సిన స్త్రెంగ్థ్ సప్తగిరిలో మిస్ అయ్యింది. ఇక హీరోయిన్ రోషిని ఏదో ఉండాలి అన్నట్టు ఉంది. సినిమాలో ఆమె పాత్ర చాలా బలహీనాంగా ఉంది. హీరో తండ్రి పాత్ర వేసిన శివ ప్రసాద్ బాగా నటించాడు. యాజూజువల్ గా పోసాని తన మార్క్ నటనతో ఆకట్టుకోగా హేమ కూడా విలనిజం ప్రదర్శించింది. శియాజి షిండే పాత్ర చాలా చిన్నదే అయినా ఇంప్రెషన్ కొట్టేశాడు. జబర్దస్త్ టీం ను బాగానే వాడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సప్తగిరి పక్కన షకలక శంకర్ సినిమాకు బాగ హెల్ప్ అయ్యాడు. 
కమెడియన్ గా చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా టర్న్ తీసుకున్నాడు సప్తగిరి. అయితే తన యాక్టింగ్ స్టామినా ఇది అని చెప్పేందుకే ఈ సినిమాలో హీరో వేశం వేశాడని అర్ధమవుతుంది. పరశురామ, దుర్యోధనగా సప్తగిరి చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ వినిపిస్తాయి. లెంగ్తీ డైలాగ్ కూడా బాగా చెప్పాడు. కాని ఆ ఒక్కటే సరిపోదు కదా సినిమాకు.. సినిమాలో కామెడీ సప్తగిరి చేస్తాడు. కాని అది వేరే హీరోల సినిమాల్లో సప్తగిరి చేసే కామెడీలానే ఉంది.  


తాను ఒక హీరో అని బలంగా ముద్ర వేసే సీన్ ఏది లేదు. కాస్త ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అరుణ్ పవార్ సప్తగిరిని ఇంకా వాడుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ కేవలం సాంగ్స్ కోసమే అన్నట్టు ఉంది. కథ కథనాలు కూడా రొటీన్ గానే సాగించారు. హైలెటెడ్ సీన్స్ అంటూ ఏది లేకుండా ఉంటుంది.


ఇక క్లైమాక్స్ అందరు ఊహించినట్టుగానే తండ్రి చావుకు కారణమైన వారిని చంపేస్తాడు హీరో. పోలీస్ కాను కాను అంటూనే తండ్రి చనిపోయాక ఆ జాబ్లో చేరిన హీరో పోలీస్ పడే కష్టాలని బాగా చూపించాడు. అయితే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఏదో సప్తగిరి కోసం ఒక్కసారి చూసేయొచ్చు తప్ప అంతగా మ్యాటర్ ఉన్న సినిమా అయితే కాదు.
Sapthagiri,Roshini Prakash,Arun Pawar,Dr. K. Ravi Kirane,Vijay Bulganinహీరోగా కూడా కమెడియన్ వేశాలతో వచ్చిన సప్తగిరి 'ఎక్స్ ప్రెస్'..!

మరింత సమాచారం తెలుసుకోండి: