Greeku Veerudu: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review


హీరో నాగార్జున నటించిన  ‘గ్రీకువీరుడు’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తరువాత నాగార్జున ప్రేమకథలో నటించడం ఈ సినిమాకు ప్రధాన విశేషం. నాగార్జునకు కొత్త గుర్తింపు తెచ్చిన ‘సంతోషం’ సినిమాకు దర్శకత్వం వహించిన దశరథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

చిత్రకథ : 
చందూ (నాగార్జున) బంధాలకు అనుబంధాలకు విలువ ఇవ్వని మనిషి. ఒకసారి అనుకోకుండా పరువు నష్టం కేసులో చిక్కుకోవడంతో  ఆస్తి కోసం ఇండియాలో ఉన్న తాతయ్య వద్దకు వస్తాడు. ఈ క్రమంలో సంధ్య (నయనతార)పరిచయం అవుతుంది. తాతయ్య కుటుంబంతో అనుబంధం పెంచుకున్న చందూ వారికి సంధ్యను తన భార్యగా పరిచయం చేస్తాడు.
అనుబంధాలకు విలువ ఇవ్వని చందూ ప్రేమ గొప్పతనాన్ని ఎలా తెలుసుకుంటాడు. సంధ్యను నిజమైన భార్యగా ఎలా చేసుకుంటాడు అనే విషయాలతో చిత్రకథ సాగుతుంది.


advertisements


నటీనటుల ప్రతిభ :
నాగార్జున ఈ సినిమాలో చాలా యంగ్ గా, కొత్త లుక్ తో కనిపిస్తాడు. ప్రేమకథా చిత్రాల్లో నటించడం నాగార్జునకు కొట్టిన పిండి. ఈ వయస్సులో కూడా ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించడం నాగార్జునకు మాత్రమే సాధ్యం అని ఈ చిత్రంతో అనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లలోనూ నాగార్జున రాణించాడు. నయనతార సినిమా చాలా గ్లామర్ గా కనిపించింది. పాత్రకు తగ్గ నటనతో మెప్పించింది. ఎంఎస్ నారాయణ, బ్రహ్మనందం ల కామెడీ కూడా బాగుంది. చెవటివాడిగా జయప్రకాష్ రెడ్డి మెప్పించాడు. కోవై సరళ మళ్లీ తన టాలెంట్ చూపించింది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ఫోటోగ్రఫీ చాలా సాధారణంగా ఉంది. నాగార్జున సినిమాలతో పోలిస్తే ఫోటోగ్రఫీ ఆకట్టుకోదు. సంగీతం విషయానికి ఎస్.ఎస్.థమన్ కు తక్కువ మార్కులు పడతాయి. గుర్తుంచుకునే పాటలు లేవు. మాటలు బాగున్నాయి. హస్య సంభాషణలతో పాటు సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి.
దర్శకత్వం విషయానికి వస్తే సాధారణ ప్రేమకథను కుటుంబ విలువలు, హస్యం మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా బాగానే స్లోగా సాగడం ఈ సినిమాకు మైనస్ గా అనిపిస్తుంది.

హైలెట్స్ : 
నాగార్జున, నయనతార, సెంటిమెంట్-కామెడీ సీన్లు
డ్రాబ్యాక్స్ :
స్లోగా సాగే నేరేషన్, పెద్దగా ఆకట్టుకోని కథ

విశ్లేషణ :
నాగార్జున-దశరథ్ ల కలయికలో వచ్చిన ‘సంతోషం’ సినిమా అప్పట్లో మంచి హిట్ కావడమే కాకుండా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రేమకథా చిత్రాలను కుటుంబమంతా కలిసి చూసేటట్లు తీయవచ్చని నిరూపించింది. ఇప్పుడు ‘గ్రీకువీరుడు’ సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. అయితే ‘సంతోషం’ సినిమా మాదిరిగా మనల్ని ఆకట్టుకోదు. సినిమా స్లోగా సాగడమే ఇందుకు కారణం. అయితే ‘గ్రీకువీరుడు’లో కూడా సెంటిమెంట్ సీన్లు, కామెడీ సీన్లు కూడా అక్కడక్కడ మెప్పిస్తాయి.
సూపర్ హిట్ అనిపించకపోయినా కుటుంబమంతా కలిసి చూసే సినిమా తీయడంలో దశరథ్ సక్సెస్ అయ్యాడు.

చివరగా :
‘గ్రీకువీరుడు’ బోరుకొట్టడు

More Articles on Greeku Veerudu || Greeku Veerudu Wallpapers || Greeku Veerudu Videos


మరింత సమాచారం తెలుసుకోండి: