Mahankali: English Full Review

సుమారు 3 సంవత్సరాల తరువాత హీరో రాజశేఖర్ ‘మహాంకాళి’ సినిమాతో ప్రేక్షకుల ముందువచ్చాడు. తనకు కలిసి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రను రాజశేఖర్ ఈ సినిమాలో పోషించడం, జీవిత దర్శకత్వం వహించడం ఈ సినిమా ప్రత్యేకతలు. మరి ఈ ‘మహాంకాళి’ ఎలా ఉందో చూదాం...!     చిత్రకథ :   పోలీస్ ఆధికారి మహాంకాళి (రాజశేఖర్) చాలా సిన్సియర్, పైగా ఆవేశపరుడు. క్రైమ్ రేట్ తగ్గాలంటే క్రిమినల్స్ ను అంతం చేయడమే మార్గమని అతను భావిస్తుంటాడు. అయితే ఒకసారి అమాయకులను చంపాడనే ఆరోపణలతో తన ఉద్యోగాన్ని పొగొట్టుకుంటాడు. మహాంకాళి ఆ ఆరోపణలు ఎందుకు ఎదుర్కొన్నాడు... మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలా దక్కించుకున్నాడు... క్రిమినల్స్ ను ఎలా అంతం చేశాడు.... అనే అంశాలు చిత్రం చూసి తెలుసుకోవాలి. నటీనటుల ప్రతిభ :     తనకు అలవాటైన పోలీస్ ఆఫీసర్ పాత్రను రాజశేఖర్ ఈ సినిమాలో పోషించాడు. అతనికి ఇలాంటి పాత్రలతో మెప్పించడం కూడా అలవాటు. అయితే ఈసారి అతనికి కాలం కలిసిరాలేదు. అవే డైలాగులు, అదే యాక్షన్ తో ‘మహాంకాళి’ బోర్ కొట్టిస్తాడు. మధురిమ ‘హీరోయిన్’ పాత్రకు పెద్దగా గుర్తింపు లేదు. మిగిలిన పాత్రధారుల నటన పరమ రోటీన్ గా సాగింది. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ, మ్యూజిక్ చాలా సాధారణంగా ఉన్నాయి. మాటలు అంతకంటే సాధారణంగా ఉన్నాయి. ఈ సినిమాలో కథనం చాలా వేగంగా సాగుతుంది. సీన్లు ఒక దాని వెంట వస్తుంటాయి. కానీ అవన్నీ సాధారణంగా ఉంటాయి. ఆకట్టుకునే విధంగా ఉండవు. సాధారణ కథకు, పస లేని కథనం, రొటిన్ యాక్షన్ తోడయ్యి సినిమా బోర్ కొట్టిస్తూ సాగుతుంది. విశ్లేషణ :     హిందీలో విడుదలయ్యిన ‘రిస్క్’ సినిమాను తెలుగులో ‘మహాంకాళి’ పేరుతో రూపొందించారు. ఎక్కడైనా, ఎవ్వరైనా విజయవంతమైన సినిమా ను రీమేక్ చేయడానికి సిద్దపడతారు. అయితే హిందీలో విజయవంతం కానీ ‘రిస్క్’ ను తెలుగులో రూపొందించడం ఇక్కడ విశేషం. పోలీస్ ఆఫీసర్ పాత్ర రాజశేఖర్ కు సరిపోతుందని, ఆ కారణంతో తెలుగులో హిట్టవుతుందనే అభిప్రాయంతో ఈ ‘మహాంకాళి’ సినిమాను రూపొందించి ఉంటారు. అయితే కథ, కథనాలు గొప్పగా లేకపోయిన ‘మహాంకాళి’ సినిమాను రాజశేఖర్ రక్షించలేకపోయాడు. చివరగా :   ‘మహాంకాళి’ The Punisher. సినిమా చూసేవారిని పనిష్మెంట్ కు గురి చేసి తన ట్యాగ్ లైన్ సరైనదే అని ‘మహాంకాళి’ నిరూపించుకున్నాడు.

More Articles on Mahankali || Mahankali Wallpapers || Mahankali Videos

 

మరింత సమాచారం తెలుసుకోండి: