Shadow: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review



తెలుగులో అగ్రహీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తాజాగా ‘షాడో’గా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. మోహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదల అయ్యింది. మరి ‘షాడో’ ఎలా ఉందో చూద్దాం..!

చిత్రకథ :  రఘురామ్ [నాగబాబు] క్రైమ్ రిపోర్టర్. ముంబయిలో మాఫియా వ్యవహారంపై ఒక ఫైల్ తయారు చేస్తాడు. అయితే మాఫియా గ్యాంగ్ చేతిలో హత్యకు గురవుతాడు. తండ్రి హత్యను కళ్లారా చూసిన  రాజారామ్ [వెంకటేష్] హంతకులపై పగ పెంచుకుంటాడు. పెద్దయిన రాజారామ్ హంతకులను వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఇదే నేరస్తులను పోలీస్ అధికారి ప్రతాప్ [శ్రీకాంత్] కూడా అన్వేషిస్తుంటాడు. మరి రాజారామ్-ప్రతాప్ ల మధ్య బంధం ఏమిటి..?, తండ్రిని చంపిన వారిపై రాజారామ్ ఏవిధంగా పగ తీర్చుకుంటాడు..? అనే అంశాలను వెండితెర మీద చూడాలి.

advertisements


నటీనటుల ప్రతిభ :  ఈ సినిమాలో వెంకటేష్ విబిన్న కోణాలు ఉన్న పాత్రను పోషించాడు. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకునే అవేశపరుడిగా, తల్లి-చెల్లిల కోసం తపన పడే వ్యక్తిగా వెంకటేష్ నటించాడు. అలాగే గతం మరిచిపోయి, చిన్న పిల్లాడిగానూ ఈ సినిమాలో వెంకటేష్ నటించాడు. తనదైన హస్య సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించడం వెంకటేష్ ప్రత్యేకత. అయితే ఈ సినిమాలో కామెడీ సీన్లు ఉన్న వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకోలేడు. ఈ విషయంలో మనం దర్శకుడ్నే తప్పు పట్టాలి. తాప్సీ పాత్రకు పెద్దగా ప్రాధన్యం లేదు. శ్రీకాంత్ పాత్ర సహాయనటుడు పాత్ర లా ఉంది. ఎంఎస్ నారాయణను  కామెడీకి ఉపయోగించుకోవాలని ట్రై చేశారు. కానీ, పండలేదు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.
 
సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రపీ బావుంది. ప్రతీ సీన్ చక్కగా కనిపిస్తుంది. పాటలు వినసోంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం అందించడంలో తనకు ఉన్న పట్టును థమన్ మరోసారి చూపించాడు. చిత్రంలో మాటలు సాధారణంగా ఉన్నాయి. దర్శకుడు పగ, సెంటిమెంట్ వంటి సాధరణ కథను చాలా స్టైల్ గా చూపించాలని చూశాడు. కామెడీని కూడా చొప్పించాలని కృషి చేశాడు. అయితే కామెడీ పండకపోవడం, స్ర్కీన్ ప్లే సాధారణంగా ఉండటంతో చూసేవారికి నిరాశ కలిగిస్తుంది.

విశ్లేషణ :   ‘శక్తి’ తో పూర్తిగా నిరాశపరిచిన తరవాత మోహర్ రమేష్ కుఇక దర్శకుడిగా అవకాశాలు రావని అంతా భావించారు. అయితే అనూహ్యంగా వెంకటేష్ వంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు రమేష్. కథతో వెంకటేష్ ని ఇంప్రెస్ చేసిఉంటాడని, హిట్ కొట్టాలనే కసితో ఈ ‘షాడో’ రూపొందించిఉంటాడని మళ్లీ మోహర్ రమేష్ పై అంచనాలు వెలువడ్డాయి. అయితే తనపై అలాంటి అశలు పెట్టుకోవద్దని ఈ షాడో తో మనకు చెప్పాడు. ఇంత సుదీర్ఘ కాలం హీరోగా రాణించిన వెంకటేష్ నిర్ణయాలపైనే అనుమానం కలిగేలా చేశాడు.

షాడో సినిమాను స్టైల్ గా తీయాలనే కాకుండా, కామెడీతో నింపాలని కూడా రమేష్ ట్రై చేశాడు. అయితే కామెడీ తీయడం అతనికి చేతకాలేదు. పాత కథ, సాధారణ స్ర్కీన్ ప్లే తో వెంకటేష్ వంటి స్టార్ ఉన్నా మోహర్ రమేష్ హిట్ కొట్టలేక పోయాడు.

చివరగా :   మోహర్ రమేష్ మారలేదు.

Shadow: Cast & Crew

Shadow: Shadow Voice Review || షాడో: వాయిస్ రివ్యూ

More Articles on Shadow || Shadow Wallpapers || Shadow Videos

మరింత సమాచారం తెలుసుకోండి: