Gouravam: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

చిత్రకథ :     ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త కుమారుడు అల్లు అర్జున్ (అల్లు శిరీష్). సొంతగ్రామంలో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరికీ సంబంధించిన పనులకోసం అతన్ని పంపిస్తారు. కానీ అర్జున్ తన స్నేహితుడు శంకర్ ను చూసేందుకు అతని గ్రామం వెళతారు. అక్కడ స్నేహితుడు, ప్రేమించిన యువతితో ఊరు వదిలి పారిపోయినట్లు, ఊరికి వస్తే ప్రమాదమని రావడం లేదని తెలుసుకుంటాడు. దానికి కారణమైన అంటరానితనం రూపుమాపి, స్నేహితుడ్ని గ్రామానికి రప్పించాడా..? ఫ్యాక్టరీ ఏర్పాటు ఏమైంది..? అన్నది వెండితెరమీద చూడాల్సిందే..!

advertisements


నటీనటుల ప్రతిభ :     హీరో అల్లుశిరీష్ పాత్రలో జీవించడం మాట అటుంచి నటించడం కూడా సరిగా చేయలేక పోయారు. హీరోయిన్ యామి గౌతమ్ తనకిచ్చిన పాత్రకు కాస్త నటనలో న్యాయం చేసినా ఆమె పాత్ర ను అర్థం లేకుండా పెట్టారు. ఇతర ప్రముఖుల్లో ప్రకాష్ రాజ్, నాజర్ లు ఉన్నా వారు కనిపించింది రెండు మూడు సార్లే, వారి పాత్రలు సినిమాలో అంత ప్రాధాన్యం లేనివే. మరో ప్రముఖ పాత్రలో హీరో స్నేహితుడు శంకర్ తండ్రిగా ఎల్.బి. శ్రీరాం ఒక్కరు నటనతో అందరిని కంటనీరు పెట్టించి తన పాత్రకు జీవం పోసారు. సాంకేతిక వర్గం పనితీరు : నీతిని చెప్పాలనుకున్నారు, ఆక్రమంలో పాత్రలను నడిపించలేక బోల్తా కొట్టారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన స్టోరికి సంబందించిన  సన్నివేశాలను పదే పదే చూపించినవే చూపించి బోర్ కొట్టించారు. ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, మాటలు వంటివి అన్నీ డాక్యుమెంటరినీ తలపించాయి. చివరగా :   అల్లు అరవింద్,బన్నీ,మామ చిరంజీవి, బావ రామ్ చరణ్ వంటి వారు తెచ్చిపెట్టిన గౌరవాన్ని అల్లు శిరీష్ తీసిన ‘గౌరవం’ గంగలో కలిపింది.

More Articles on Gouravam || Gouravam Wallpapers || Gouravam Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: