మంచు విష్ణు నటన , మ్యూజిక్, కొన్ని కామెడీ సీన్స్ మంచు విష్ణు నటన , మ్యూజిక్, కొన్ని కామెడీ సీన్స్ స్క్రీన్ ప్లే , డైరక్షన్ , రొటీన్ డ్రామా
లక్కీ (మంచు విష్ణు) పుట్టిన నాటి నుండి ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణం చేత లక్కీ తండ్రి భక్తవత్సలం (జయ ప్రకాష్) లక్కీని పేరు పెట్టి పిలవడు. పాతికేళ్ళు తన తండ్రి చేత పేరు పెట్టి పిలిపించుకోవాలని లక్కీ ఆరాటపడుతుంటాడు. అయితే తన పరిచయంతో అందరు అన్ లక్కీగా మారుతున్నారని సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు లక్కీ. ఆ క్రమంలో తనకు పాజిటివ్ పద్మ పరిచయం అవుతుంది. అయితే సరే లక్కీ ఫాదర్ తనని అపార్ధం చేసుకుంటూనే ఉంటాడు. ఇక అనుకోకుండా మాఫియా గ్యాంగ్ అయిన జె.కె కు లక్కీకి ఓ మ్యాటర్ లో క్లాష్ ఏర్పడుతుంది. అక్కడ కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. అసలు జెకె ఎవరు..? లక్కీని ఎందుక్కు టార్గెట్ చేశాడు..? జెకె నుండి లక్కీ ఎలా తప్పించుకున్నాడు..? చివరకు తండ్రికి దగ్గరయ్యాడా లేదా అన్నది అసలు కథ.

సినిమాలో మంచు విష్ణు ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. లక్కీ పాత్రలో విష్ణు మంచి ఈజ్ తో నటించాడు. అయితే క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు ఇంకా కాస్త దృష్టి పెట్టాల్సి ఉందనిపిస్తుంది. సినిమాలో విష్ణు ఎనర్జీ మెచ్చుకోవాల్సిందే. ఇక పాజిటివ్ పద్మగా హాన్సిక తన బబ్లీ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సినిమాలో ఆమెకు అంత స్కోప్ లేదని చెప్పొచ్చు. ఉన్నంతవరకు హాన్సిక ఓకే అనిపించుకుంది. ఇక లక్కీ తండ్రిగా చేసిన జయ ప్రకాశ్ నటన బాగుంది. కమెడియన్ ప్రభాస్ శ్రీను, వెన్నెల కిశోర్ కాసేపు నవ్వించారు. ఇక విలన్ గా నటించిన ఎంవివి సత్యనారాయణ తనవరకు బాగానే చేశాడు కాని దర్శకుడు ఆ పాత్ర మలచిన తీరు బాగాలేదు. 

లక్కున్నోడు ముఖ్యంగా దర్శకుడు రాజ్ కిరణ కొన్ని ఫార్మెట్ లలో విఫలమయ్యాడు. సినిమా కథ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. దాన్ని రెండు గంటలు నడిపించడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా హీరో విలన్ క్యారక్టర్స్ చూపించడంలో ఏమాత్రం ఆకట్టుకోలేదు. అచ్చు, ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఓకే. డైమండ్ రత్నం మాటలు మాములుగానే ఉన్నాయి. విజి విందా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. 
ఓ లక్ లేని కుర్రాడు లక్కీ అని పేరు పెట్టుకుని తనతో పాటు ఉన్న వారిని అన్ లక్కీ చేసే కథే ఈ లక్కున్నోడు సినిమా. సినిమా మొదటి భాగం హీరోయిన్ ని లవ్ సీన్స్ అంతా రొటీన్ గానే అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ గా అనిపించినదల్లా పాతిక కోట్ల బ్యాగ్ లక్కీ దగ్గరకు వచ్చినప్పుడే. ఇక తన కడుపున పుట్టిన కొడుకుని కనీసం పేరు కూడా పిలవడానికి ఇష్టం లేని తండ్రి తన కొడుకు అన్ లక్కీ అని ఫీల్ అవుతుంటాడు.

అయితే ఈ కోణాల్లో దర్శకుడు అనుకున్న కథ.. కథనంలో తేలిపోయిందని చెప్పొచ్చు. విష్ణు తన పాత్ర పరంగా సూపర్ అనిపించుకున్నాడు. దర్శకుడు అన్ని విభాగాల్లో విఫలమయ్యాడు. ఇలాంటి సినిమాలన్ని ఎంటర్టైన్మెంట్ మోడ్ లో నడుస్తాయి. అయితే ఆ కామెడీ కూడా సోసోగానే అనిపిస్తుంది.  

ఇక క్లైమాక్స్ సీన్స్ కూడా అంత యావరేజ్ గానే ఉంటాయి. విలన్ ను సరిగా చూపించలేదు. చాలా వీక్ గా విలనిజం కనిపిస్తుంది. గీతాంజలి తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం రొటీన్ ఫార్ములా ఎంచుకున్న రాజ్ కిరణ్ లక్కున్నోడు కాసేపు ఏదో నవ్వుకోడానికి తప్ప సగటు సిని ప్రేక్షకుడిని కూడా నిరాశ పరుస్తుందని చెప్పొచ్చు.
Manchu Vishnu,Hansika Motwani,Raj Kiran,MVV Satyanarayana,Praveen Lakkarajuరొటీన్ గానే వచ్చిన మంచు విష్ణు 'లక్కున్నోడు'..!

మరింత సమాచారం తెలుసుకోండి: