నాని కీర్తి సురేష్ నటన, డైరక్షన్, మాటలు నాని కీర్తి సురేష్ నటన, డైరక్షన్, మాటలుఅక్కడక్కడ స్లో అవడం, రొటీన్ గా అనిపించడం
.బిటెక్ పాస్ అవడానికి నానా కష్టాలు పడ్డ బాబు (నాని) యాటిట్యూడ్ విషయంలో మాత్రం తగ్గేదే లెదన్నట్టి క్యారక్టర్. యాక్సిడెంటల్ గా కీర్తి (కీర్తి సురేష్) ను చూసి ఆమె తన లైఫ్ పార్ట్ నర్ అని ఫిక్స్ అవుతాడు. హీరోయిన్ తండ్రి సచిన్ బాబు వేశాలన్ని తెలుసుకుని కీర్తిని తన నుండి దూరం చేయాలని చూస్తాడు. ఈ లోగా నవీన్ చంద్ర ఎంట్రీ ఇచ్చి కీర్తిని పెళ్లిచేసుకునేది తానే అంటాడు. ఇంతకీ నవీన్ చంద్ర ఎవరు..? కీర్తి ఎవరికి దక్కింది..? అన్నది అసలు కథ.
నాచురల్ స్టార్ నాని మరోసారి బాబు పాత్రలో అదరగొట్టాడు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్, లవ్ ఈ క్యాటగిరిలన్నిటిలో నాని అదుర్స్ అనిపించేశాడు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కీర్తి పాత్రలో అదరగొట్టింది. నటన పరంగా కీర్తి నానికి తీసిపోనివిధంగా నటించింది. కొన్ని సీన్స్ లో నానిని డామినేట్ చేసిందని కూడా అనిపిస్తుంది. ఇక మలయాళ నటుడు సచిన్ కూడా హీరోయిన్ తండ్రి పాత్రలో బాగా అలరించాడు. హీరో నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో సిద్ధార్థ్ గా ఓకే అనిపించాడు. పోసాని కూడా నాని తండ్రిగా నటించి మెప్పించాడు. చిన్న పాత్రే అయినా రావు రమేష్ నటన బాగుంది. 
నేను లోకల్ ముందుగా దర్శకుడు త్రినాధరావు గురించి మాట్లాడాలి. నాని లాంటి నాచురల్ స్టార్ తో ఎలాంటి సినిమా వర్క్ అవుట్ అవుతుందో అలాంటి కథతో వచ్చాడు. కథ కథనాల్లో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది. అయితే సెకండ్ హాఫ్ లో కొంతభాగం కాస్త జాగ్రత్తపడి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. మ్యూజిక్ దేవి ట్రెండీగా ఉంటూ అలరించాయి. ఎక్కడ.. ఎక్కడ.. పాట యువతను బాగా ఆకట్టుకుంటుంది. నిజార్ షఫి కెమెరావర్క్ బాగుంది. సినిమా రచనా సహకారం అందించిన ప్రసన్న కుమార్, సాయి కృష్ణలకు కూడా క్రెడిట్ దక్కుతుంది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాను ఎంత రిచ్ గా తీయాలో అంతే రిచ్ గా తీసి మెప్పించారు.  


మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ సినిమాలతో దర్శకత్వ ప్రతిభ చాటుకున్న త్రినాధరావు నక్కిన నాని లాంటి క్రేజీ హీరోతో తీసిన సినిమా నేను లోకల్. ఓ పక్క వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని నేను లోకల్ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు. కథ కథనాల్లో దర్శకుడు యూత్ ని బాగా టార్గెట్ చేసి దానికి కాసింత ఫన్ యాడ్ చేసి మెప్పించాడు.


నాని నుండి ఎలాంటి సినిమా ఆశిస్తారో అలాంటి సినిమాతోనే వచ్చారు. లోకల్ యాటిట్యూడ్ చూపిస్తూ నాని చేసిన నటన అద్భుతం.. ఇక హీరోనే కాదు వచ్చిన అవకాశాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అదరగొట్టింది. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ సెలెక్షన్ తో యువత మనసుని తాకే విధంగా సినిమా ఉంటుంది. లవ్ స్టోరీనే అయినా దానికి కామెడీ కూడా జోడించి ఎంటర్టైన్ చేశారు.  


అయితే మొదటి భాగం నడిచినంత స్పీడ్ గా రెండో పార్ట్ నడవదు. రొటీన్ అన్న భావన కలుగుతుంది. క్లైమాక్స్ లో కూడా డైలాగ్స్ మీదే నడిపించేశారన్నమాట. సినిమాలో ముఖ్యంగా మాటలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఎమోషన్ క్యారీ చేయడంలో చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇలాంటి రొటీన్ క్లైమాక్స్ చాలా సినిమాల్లో చూశామనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే నాని ఫ్యాన్స్ కు యూత్ కు బాగా నచ్చేస్తాడు ఈ లోకల్ కుర్రాడు.  
Nani,Keerthi Suresh,Trinath Rao,Dil Raju,Devi Sri Prasad ఈ లోకల్ కుర్రాడు యువతకి బాగా నచ్చుతాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: