కాస్ట్ అండ్ క్రూ, స్క్రీన్ ప్లే, డైరక్షన్, సినిమాటోగ్రఫీ కాస్ట్ అండ్ క్రూ, స్క్రీన్ ప్లే, డైరక్షన్, సినిమాటోగ్రఫీ పెద్దగా చెప్పేందుకు ఏమి లేవు
1971లో ఇండియా పాక్ మధ్య జరిగిన నౌకాదళ జలాంతర్గ యుద్ధానికి సంబదించిన కథే ఈ ఘాజి మూవీ. విశాఖ పట్నం ఓడరేవు టార్గెట్ తో పాక్ పచ్చిమ పాకిస్థాన్ (బంగ్లదేష్) కు చేరుకోవాలని చూస్తుంది. అయితే మధ్యలో భారతీయ జలాలకు కాపలా ఉన్న ఎన్నెస్ విక్రాంత్ ను నాశనం చేద్దామని ప్రయత్నించించే క్రమంలో ఆ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న భారత నేవీ అధికారులు ఎస్ 21 సబ్ మెరైన్ ను పంపుతారు. ఘాజిని ఎస్ 21 ఎలా ఫేస్ చేసింది..? చివరకు జలాంతర్గ యుద్ధంలో ఎవరు గెలిచారు..? అన్నది అసలు కథ.   



ఘాజి లాంటి సినిమా చేయాలని ఆలోచన రావడమే రానా గట్స్ కు మెచ్చుకోవాలి. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా) అద్భుతమైన నటన కనబరిచాడు. ఎక్కడ పాత్ర నుండి బయటకు రాకుండా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక సినిమాలో కెప్టెన్ కమాండెంట్ రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్) కూడా బాగా నటించాడు. తాప్సి క్యారక్టర్ అంతగా ఉపయోగపడలేదు. ఇక సబ్ మెరైన్ లో ఉన్న టీం అందరు ఎంతో బాగా నటించి మెప్పించారు.


ఘాజి సినిమా గురించి ముందుగా చెప్పాలంటే ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు దర్శకుడు సంకల్ప్ రెడ్డిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఎక్కడ క్యూరియాసిటీ తగ్గకుండా స్క్రీన్ ప్లే నడిపించి వారెవా అనిపించాడు సంకల్ప్ రెడ్డి. ఇలాంటి అద్భుతమైన సినిమాకు టెక్నికల్ గా మంచి సపోర్ట్ లభించిందని చెప్పొచ్చు. సినిమా మొత్తం సెట్ లోనే నడిపించినా ఎక్కడ బోర్ కొట్టలేదు. కృష్ణ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మది సినిమాటోగ్రఫీ సూపర్బ్.. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమా తీసినందుకు పివిపి, మ్యాటిని ఎంటర్టైన్మెంట్ వారికి తప్పక ప్రశంసలు అందుతాయి.  


కేవలం సినిమా అంటే ఇలానే తీయాలి అన్న ప్రమాణాలను దాటి తెలుగు సినిమా స్టామినా చాటుతున్నారు దర్శక నిర్మాతలు. ఘాజి కచ్చితంగా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి. మనకు తెలియని చరిత్రను మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేసి అది కూడా జలాంతర్గాల యుద్ధంతో సినిమా అంటే ముందు ఇలాంటి సినిమా చేయాలన్న ఆలోచన వచ్చినందుకే యూనిట్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. 


ఎక్కడ సినిమా పరిధిని దాటి వెళ్లకుండా చక్కగా తీశారు. సబ్ మెరైన్ సెట్ అద్భుతం సినిమా అంతా దానిలోనే జరిగినా ఎక్కడ బోర్ కొట్టదు. తెలియని కథకు సినిమాటిక్ హంగులను అద్ది తెరకెక్కిన ఘాజి హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు అని చెప్పేయొచ్చు.  


కథ, కథనంలో క్లారిటీతో పాటుగా ఎక్కడ మిస్ గైడ్ చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ ను ఎంతో ఎమోషనల్ గా చెప్పారు. సినిమాలో జాతీయత భావం కలిగించే అంశాల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎవరికి తెలియని ఈ చరిత్రను అందరికి తెలిసేలా చేసిన ఈ ఘాజి ప్రయత్నం సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా సినిమా ద్వారా చెప్పొచ్చు అనే ఆలోచనతో చేసిన ఘాజి తెలుగు సినిమాకు సరికొత్త దిశా నిర్దేశాలను చూపిస్తుంది.         



Rana Daggubati,Taapsee Pannu,Sankalp Reddy,Anvesh Reddy,Venkatramana Reddy,Prasad V Potluriతెలుగులో మరో అద్భుతం 'ఘాజి'..!

మరింత సమాచారం తెలుసుకోండి: