రకుల్, సినిమాటోగ్రఫీ ,కామెడీరకుల్, సినిమాటోగ్రఫీ ,కామెడీరొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే , వీక్ విలన్, క్లైమాక్స్
మహిందర్ రెడ్డి (జగపతి బాబు) ఓ మంచి రేసర్.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తండ్రి ముఖేష్ రుషి ఇంట్లోంచి వెళ్లిపోమనగా వచ్చి కొడుకు సిద్ధార్థ్ (సాయి ధరం తేజ్) తో జీవనం సాగిస్తుంటాడు. రేసులో లాస్ వస్తుండటంతో కొడుకుని మళ్లీ వెనక్కి పిలుపించుకున్న మహిందర్ రెడ్డి తండ్రి మహిందర్ రెడ్డి సిద్ధార్థ్ ల మధ్య దూరం పెంచుతాడు. ఈ క్రమంలో ఇంట్లో నుండి పారిపోతాడు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ మొదటి చూపులోనే సితార (రకుల్ ప్రీత్ సింగ్) ను చూసి ప్రేమిస్తాడు. మొదట తనని కాదన్న సితార తనకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుండటంతో రేసులో విన్నర్ గా నిలిచిన వాడితోనే తాను తాళి కట్టించుకుంటానని చెబుతుంది. మహిందర్ రెడ్డి కొడుకుగా మరొకరు రావడం ఇద్దరి మధ్య చాలెంజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు మహిందర్ రెడ్డికి కొడుకుగా వచ్చింది ఎవరు..? రేసులో ఎవరు గెలుస్తారు..? అన్నది అసలు కథ.  

సిద్ధార్థ్ పాత్రలో సాయి ధరం తేజ్ ఎనర్జీ బాగుంది. ఇదవరకు కన్నా ఎమోషన్స్ సీన్స్ లో పరిణితి కనిపించింది.  కామెడీ టైమింగ్ లో కూడా తేజ్ మంచి నటన కనబరిచాడు. ఇక రకుల్ సినిమాకు స్పెషల్ బోనస్. అమ్మడు నటనతో పాటు గ్లామర్ షో బాగుంది. సితార పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది రకుల్. ఇక తండ్రి పాత్రలో జగపతి బాబు మరోసారి అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్స్ లో జగ్గు భాయ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖేష్ రుషి యాస్ యూజువల్ గా కన్నింగ్ విలన్ గా బాగానే చేశాడు. అసలు విలన్ గా ఠాకూర్ అనూప్ సింగ్ పర్వాలేదు అనిపించుకున్నాడు. అతనికి ఇంకా స్కోప్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. పద్మ క్యారక్టర్ లో వెన్నెల కిశోర్, పీటర్ హెయిన్స్ గా ఆలి నవ్వ్హించే ప్రయత్నం చేశారు.     

విన్నర్ మూవీ దర్శకుడు గోపిచంద్ మలినేని సినిమాను ఓ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే క్రమంలో రొటీన్ స్క్రీన్ ప్లేనే అనుసరించాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీగా నడిపించిన విధానం ఓకే. ఇంటర్వల్ కూడా ఆడియెన్స్ ను ఎక్సయిటింగ్ కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పేలవంగా చేశాడు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. థమన్ మ్యూజిక్ రెండు సాంగ్స్ ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాకు ఎంత పెట్టాలో అంత ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు. 

మెగా హీరోల్లో మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి ధరం తేజ్ సినిమాలో మాస్ అంశాలను పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు. అయితే కథ మాత్రం పాత చింతకాయ పచ్చడే. ఫాదర్ సెంటిమెంట్ తో ఇదవరకే ఇలాంటి సినిమాలొచ్చాయి. ఇక కథ వరకు ఎలా ఉన్నా కథనంలో మొదటి భాగం అంతా కామెడీ ట్రాక్ తో పర్వాలేదు అనిపించాడు. కాని సెకండ్ హాఫ్ లో మాత్రం తేలిపోయేలా చేశాడు.


కమర్షియల్ సినిమాకు ఉన్న హంగులన్ని కరెక్ట్ ఫార్ములాతో లెక్కేసుకుని చేసిన ఈ సినిమా తేజ్ ఇమేజ్ ను పెంచొచ్చేమో కాని సినిమా పరంగా చెప్పుకునే రొటీన్ కథతోనే కానిచ్చేశాడని చెప్పొచ్చు. కొడుకు రూపంలో వచ్చిన అతను, కొడుకు కాకుండా తనకు దగ్గరవుదామని ప్రయత్నించే మరొకతను మధ్యలో జగపతి బాబు చూసుకునే కాలిక్యులేషన్స్ కాస్త సిల్లీగా అనిపిస్తాయి. విలనిజం కూడా చాలా వీక్ గా అనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ ఉన్నా అవి అంతగా టచ్ అయ్యేలా అనిపించవు. 


ఇక సినిమాలో తేజ్ డ్యాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ అంతా బాగుంటుంది. రకుల్ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్.. ఐటం సాంగ్ గా అనసూయ అదరగొట్టింది. కథనం విషయంలో దర్శకుడు రొటీన్ ఫార్ములా ఫాలో అవడం వల్ల సినిమా అంత కిక్ అనిపించదు. రెగ్యులర్ మాస్ ఆడియెన్స్ వరకు ఓకే కాని కొత్తదనం కోరుకునే వారికి సినిమా మాత్రం నచ్చకపోవచ్చు. 
Sai Dharam Tej,Rakul Preet Singh,Gopichand Malineni,Nallamalupu Bujji,Tagore Madhu,S. Thamanవిన్నర్ మరో రొటీన్ సినిమానే..!

మరింత సమాచారం తెలుసుకోండి: