విలనిజం , మనోజ్ యాక్టింగ్ , సినిమాటోగ్రఫీవిలనిజం , మనోజ్ యాక్టింగ్ , సినిమాటోగ్రఫీరొటీన్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్

కన్నా (మంచు మనోజ్) మంచి ఎనర్జీతో ఉండే కుర్రాడు. తన ముందు ఎలాంటి అన్యాయం జరిగినా సహించని కన్నా అవతల ఎలాంటి వాడు ఉన్నా సరే తలపడతాడు. ఈ క్రమంలో ఓ పార్టీలో అనుకోకుండా క్రిమియల్ లాయర్ శేషు (సంపత్ రాజ్)తో గొడవపడతాడు. ఈగోయిస్ట్ అయిన శేషు తనను కొట్టిన కన్నాని చంపాలని ప్లాన్ చేస్తాడు. మరో పక్క మొదటి చూపులోనే కన్నా అమృతని చూసి ఇష్టపడతాడు. అమృత శేషు చెల్లెలని తెలిసి అతనికి సర్ధి చెబుదాం అనుకున్నా సరే శేషు మాటవినకపోవడమే కాకుండా కన్నాని జైల్లో వేస్తాడు. ఓ పక్క శేషు ఎమ్మెల్యేగా కావాలని కలలు కంటుంటాడు. కన్నా స్కెచ్ వేసి అతన్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తాడు. చివరు శేషు కన్నాల గొడవ ఎలా ముగిసింది..? శేషు తన చెల్లి ప్రేమను అంగీకరించాడా..? అన్నది అసలు కథ.  

గుంటూరోడులో ఆ మిర్చి ఘాటు లాంటి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు మంచి మనోజ్. కొద్ది కాలంగా మాస్ ఆడియెన్స్ కు దూరమైన తను గుంటూరోడులో ఫుల్ ఎనర్జీతో కనిపించి ఫ్యాన్స్ ను అలరించాడు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా బాగానే చేసింది. ప్రగ్యా పర్ఫెక్ట్ గా ఈ సినిమాలో రెగ్యులర్ అమ్మాయిలా చూపించారు. సినిమాలో ఈగోయిస్ట్ గా చేసిన విలన్ సంపత్ రాజ్ మనోజ్ కు ఏమాత్రం తగ్గకుండా చేశాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా సూర్య నారాయణ పాత్రలో మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక చాలా రోజుల తర్వాత కోటా శ్రీనివాస్ రావు సినిమాలో కాస్త లెంతీ రోల్ చేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా విలన్ కు సలహాలిస్తూ కోటా తన రోల్ కు న్యాయం చేశారు. కొసమెరుపుగా రావు రమేష్ ఎంట్రీ బాగుంటుంది. ఇక మిగతా పాత్రలన్ని తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

ముందుగా దర్శకుడు సత్య ఓ కమర్షియల్ సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు కాని అందులో కథ కథనాల సంగతి మాత్రం మర్చిపోయాడు. హీరో విలన్ ఢీ కొట్టుకోవడం విలన్ చెల్లిని హీరో ప్రేమించడం లాంటి కథలు ఇప్పటికే చూసి ఉన్నారు. కథనంలో కూడా అంత గొప్పగా సాగించలేదు. సినిమాలో సాంగ్స్ నోటబుల్ గా లేవు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
గుంటూరోడు గా గుంటూరు మిర్చి ఘాటు చూపించడానికి వచ్చిన మంచు మనోజ్ రొటీన్ కథ కథనాలతోనే వచ్చాడని చెప్పొచ్చు. డైరక్టర్ సత్య రాసుకున్న కథ పాతదే ఇప్పటికే చాలా సినిమాలు ఇదే కథతో వచ్చాయి. పోని కథనం ఏమైనా కొత్తగా చెప్పారా అంటే అది లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ లో వచ్చిన ఈ సినిమా మంచు మనోజ్ ఫ్యాన్స్ కు నచ్చే అవకాశం ఉంది తప్ప రెగ్యులర్ సిని ప్రేమికులను అలరించకపోవచ్చు.

మనోజ్ లోని ఎనర్జీని బాగా వాడుకున్నాడు కాని దానికి తగ్గ సందర్భాన్ని ఏర్పరచలేకపోయారు. పక్కా రొటీన్ స్ట్రక్చర్ తో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ నటన మాత్రం మెచ్చుకునేలా ఉంది. ప్రగ్యాను సినిమాలో అందంగా చూపించారు. అయితే హీరో హీరోయిన్ సీన్స్ ఇంకాస్త ఉంటే బాగుండేది. విలన్ క్యారక్టర్ అంత పవర్ ఫుల్ గా చూపించి చివరకు తనని కన్విన్స్ చేయడం కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. సినిమాలో డైలాగ్స్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంటే బాగుండేది.  

స్క్రీన్ ప్లే స్పీడ్ గా లాగించేసినట్టు అనిపించినా థియేటర్ నుండి బయటకు వచ్చాక మళ్లీ మూస సినిమా చూశాం అన్న భావన రాక తప్పదు. రొటీన్ కథలు రొటీన్ కథనంతో వచ్చిన ఈ గుంటూరోడు మాస్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశాలు ఉన్నాయి కాని కొత్తదనం కోరుకునే వారికి మాత్రం నిరాశ చెందక తప్పదు.  


Manchu Manoj,Pragya Jaiswal,S.K. Satya,Sree Varun Atluri,DJ Vasanthమాస్ మూసతో వచ్చిన 'గుంటూరోడు'..!

మరింత సమాచారం తెలుసుకోండి: