రఘ లారెన్స్, కామెడీ, స్రీన్ ప్లేరఘ లారెన్స్, కామెడీ, స్రీన్ ప్లేమ్యూజిక్, రొటీన్ ఆత్మల కథ
రహీం(శక్తి వాసు), సంగీత ప్రేమించుకుంటారు. ఇద్దరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో పెళ్లిచేసుకుంటారు. అయితే ఓ ప్రయాణంలో రైల్లో ప్రయాణిస్తున్న రహీం ట్రైన్ లోనుండి క్రిందకు దూకి మరణిస్తాడు. రైల్వే పోలీసులు రహీమ్ ది సూసైడ్ అని కేస్ క్లోజ్ చేస్తుంది. తన భార్య సంగీత కేస్ మళ్లీ రీ ఓపెన్ చేయించడంతో కేసు సిఐడి చేతుల్లోకి వెళ్తుంది. ఇక సిబి సిఐడి ఆఫీసర్ శివలింగ (రాఘ లారెన్స్) ఈ కేస్ టేకప్ చేస్తారు. తన భార్య సత్యభామతో కేస్ విషయమై రహీం ఊరికి వెళ్తారు. తన స్నేహితుడు చూపించిన రూం లో శివలింగ, సత్యభామ ఉంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ కేసు విషయమై శివలింగ బయటకు వెళ్లినప్పుడు సత్యభామ వింతగా ప్రవర్తిస్తుంది. పనివాళ్లను పంపించి తాను కూడా బయటకు వెళ్లొస్తుంది. ఓ రోజు రహీం ఆత్మ తన బార్య శరీరంలో చేరిందని తెలుసుకుంటాడు శివలింగ. అసలు రహీం ఎందుకు సత్య శరీరంలో చేరాడు..? సత్యకు రహీం కు సంబంధం ఏంటి..? రహీం చనిపోడానికి కారకులు ఎవరు..? వారిని రహీం ఏం చేస్తాడు అన్నది అసలు కథ.    
రాఘవ లారెన్స్ ఇలాంటి సినిమాకు స్పెషలిస్ట్ అని అందరు ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాలో శివలింగగా లారెన్స్ మరోసారి అద్భుతమైన నటన చూపించాడు. అమాయంకంగా నటిస్తూనే మరో పక్క ఇన్వెస్టిగేషన్ లో కూడా సీరియస్ గా నటించాడు. ఇక గురుతో ఆకట్టుకున్న రితిక సింగ్ హీరోయిన్ గా బాగానే చేసింది. రహీంగా శక్తి వాసు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగా మిగతా పాత్రదారులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు పి.వాసు డైరెక్ట్ చేసిన చంద్రముఖి, నాగవల్లి తరహాలోనే శివగలింగ నడుస్తుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించారు వాసు. వాటంత గ్రిప్పింగ్ తో కాకపోయినా సినిమాలో తన మార్క్ చూపించేశారు. దెయ్యాలు ఆత్మలు పాతవే అయినా వాటిని కొత్తగా చెప్పే ప్రయత్నం కొత్తగా అనిపిస్తుంది. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ పాటలేమో కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగులు ఇంకాస్త మంచిగా రాయించాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. సస్పెన్స్ ను కూడా గ్రిప్పింగ్ తో మెయింటైన్ చేస్తే కచ్చితంగా వర్క్ అవుట్ అయినట్టే. అదే క్రమంలో శివలింగతో కూడా లారెన్స్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు. ముని, కాంచన, గంగ సినిమాలతో అలరించిన లారెన్స్ ఈసారి శివలింగగా ఆకట్టుకున్నాడు.


వాసు డైరెక్ట్ చేసిన చంద్రముఖి ఎంతపెద్ద హిట్ సినిమానో తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా అదే రేంజ్ సస్పెన్స్ మెయింటైన్ చేశారు కాని మధ్యలో కథనం కాస్త అటు ఇటుగా సాగుతుంది. దెయ్యాలు ప్రతికారం కోసం చూడటం ఇదవరకు చాలా సినిమాల్లో చూసినా ఇందులో ఆపగ తాలూఖా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు.  


రెగ్యులర్ గా వచ్చే సినిమాలు కాకుండా కొత్తదనం కోసం ఎదురుచూసే ప్రేక్షకులు.. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి శివలింగ నచ్చే అవకాశం ఉంది. లారెన్స్ హర్రర్ సినిమాల సక్సెస్ కంటిన్యూ చేస్తున్నాడని చెప్పొచ్చు. 
Raghava Lawrencce,Ritika Singh,P. Vasu,R. Ravindran,S. Thamanభయపెట్టడంలో సక్సెస్ అయిన శివలింగ..!

మరింత సమాచారం తెలుసుకోండి: