అవసరాల నటన , మిస్తిచక్రవర్తి , కొన్ని డైలాగ్స్ అవసరాల నటన , మిస్తిచక్రవర్తి , కొన్ని డైలాగ్స్ కథ, కథనం , డైరక్షన్ , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

15 ఏళ్ల వయసునుండే రసికుడు అవుతాడు మాధవ్ (అవసరాల శ్రీనివాస్). తన కంట్లో పడ్డ ఏ అమ్మాయిని వదలని మాధవ్ ఫైనల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో రాధ (మిస్తి చక్రవర్తి) తనను పెళ్లి చేసుకునేందుకు వస్తుంది. రాధతో తను ప్రయాణం చేస్తూనే తన ఇదవరకు ప్రేయసులతో రొమాన్స్ చేస్తుంటాడు మాధవ్. ఈ విషయం మీద తర్జభర్జ పడుతూ చివరిగా మారాలని నిర్ణయించుకుంటాడు. మాధవ్ ఎలా మారాడు..? తన మీద రాధ ఎలాంటి ప్రభావితం చూపించింది..? చివరకు కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.

కమెడియన్ గా సపోర్టెడ్ ఆర్టిస్ట్ గా ఉంటూ వస్తున్న అవసరాల శ్రీనివాస్ మొదటిసారి లీడ్ రోల్ చేశాడు. మాధవ్ క్యారక్టర్ లో అవసరలా నటన మెచ్చుకునేలా ఉన్న తనని దర్శకుడు ఇంకా బాగా వాడుకోలేదని చెప్పాలి. ఇక రాధగా మిస్తి చక్రవర్తి నటన బాగుంది. చంద్రిక పాత్రలో కీర్తన హాట్ లుక్స్ తో కనిపిస్తుంది. ఇక తేజశ్వి మడివాడా కూడా చేసినంతవరకు బాగానే నటించింది. తల్లిదండ్రుల పాత్రల్లో తణికెళ్ల భరణి, సుధలు ఆకట్టుకున్నారు.

బాలీవుడ్ హంటర్ రీమేక్ గా వచ్చిన బాబు బాగా బిజీ తెలుగులో ఆ రేంజ్ లో తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు నవీన్. పూర్తిగా కథ కథనాల్లో విఫలమయ్యాడు. కెమెరా మెన్ పనితనం పర్వాలేదు. మ్యూజిక్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ సోసోగా ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు కావాల్సినంత రిచ్ గానే ఉన్నాయి.

బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమా హంటర్. ఆ సినిమా తెలుగు రీమేక్ గా వచ్చిన బాబు బాగా బిజీ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. హీరో క్యారక్టరైజేషన్ ఏమాత్రం అర్ధం కాదు.. ప్లే బోయ్ గా అవసరాల ఓకే అనిపిస్తాడు. తను ఎందుకు మారాలనుకున్నాడు అన్నది పర్ఫెక్ట్ గా చూపించలేకపోయాడు. ఇక ట్రైలర్ టీజర్ లో ఉన్న సన్నివేశాలు మాత్రమే సినిమాలో ఉన్నాయి తప్ప శృంగార ప్రియులను అలరించే సన్నివేశాలు అంతగా లేవు.

ఒకవేళ తెలుగులో శృతిమించితే బాగోదు అనుకున్నారో ఏమో కాని కథ కథనాల్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. దర్శకుడు నవీన్ మేడారం ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు బోర్ ఏం కొట్టదు కాని అసలు మ్యాటర్ మాత్రం ఏం లేదని అనిపిస్తుంది. సినిమా అంత ఎంటర్టైనింగ్ కూడా అనిపించదు. 

ప్రమోషన్స్ లో ఇదో అడల్ట్ కంటెంట్ మూవీ అన్నట్టు ప్రచారం ఇస్తున్నా సినిమాలో ఏమాత్రం డోస్ పెంచలేదని చెపాలి. మిస్తి చక్రవర్తి ఇదవరకు సినిమాల కన్నా బాగా అనిపిస్తుంది. శ్రీముఖి కేవలం ఒక్క సీన్ లోనే కనిపించి నిరాశ కలిగిస్తుంది. తేజశ్వి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకునన ఆడియెన్స్ కు నిరాశే కలిగుతుంది. ఫైనల్ గా బాబు కేవలం హడావిడి చేశాడో తప్ప సినిమాలో విషయం మాత్రం ఏం లేకుండా వచ్చాడు.  


Avasarala Srinivas,Sreemukhi,Tejaswi Madivada,Mishti Chakraborty,Supriya,Naveen Medaram,Abhishek Nama,Sunil Kashyapబాబు బాగా బిజీ హంగామా చేశాడు కాని సినిమాలో విషయం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: