Star castGopichandTaapseeShakti Kapoor
ProducerBVSN PrasadDirectorChandra Sekhar Yeleti

Sahasam - English Full Review

సాహసం రివ్యూ: చిత్రకథ 
ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే గౌతమ్(గోపీచంద్) కి లక్ కలిసొచ్చి చాలా తొందరగా ధనవంతుడు అయిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే లాటరీ టికెట్స్ కొనడం, బాబాల దగ్గర జాతకాలు చూపించుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. కానీ తనకి అన్ని చోట్లా నిరాశే ఎదురవుతుంటుంది. అదే సమయంలో తన ఉద్యోగంలో జరిగిన సంఘటన వల్ల తనని వేరే డిపార్ట్ మెంట్ లో వేస్తారు. ఆ సమయంలో గౌతమ్ కి తన తాత అయిన  సత్యనారాయణ వర్మ (సుమన్) పాకిస్థాన్ - భారత్ విడిపోక ముందు వజ్రాల వ్యాపారం చేసేవాడని, అతను చనిపోయే ముందు కొన్ని వజ్రాలను తన తర్వాత రాబోయే తరలా కోసం పెషవర్ అనే చోట దాచి ఉంచాడని తెలుస్తుంది. కట్ చేస్తే ప్రస్తుతం అది పాకిస్థాన్ లో ఉందని తెలుస్తుంది. ఎలాగైనా వెళ్లి తనకి దక్కాల్సిన వజ్రాలను దక్కించుకోవాలని నిర్ణయించుకున్న గౌతమ్ అక్కడికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్న తరుణంలో మరో రెండు సంవత్సరాలలో ప్రపంచం అంతమైపోతుందని, ఈ లోపు పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవీ గుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్న శ్రీనిధి(తాప్సీ) సాయంతో గౌతమ్ కూడా పాకిస్థాన్ కి వెళతాడు. కానీ అక్కడికి వెళ్లాకే తెలుస్తుంది ఆ ప్రాంతం అంతా సుల్తాన్(శక్తి కపూర్) అనే ఓ టెర్రరిస్ట్ చేతిలో ఉందని, ఆ సమయంలో గౌతమ్ వాళ్ళతో ఎలా పోరాడి తనకు కావాల్సిన నిధిని సాదించుకున్నాడు? అనే ఆసక్తికరమైన చేజ్ ని వెండితెరపై చూడాల్సిందే.

సాహసం రివ్యూ: నటీనటుల ప్రతిభ
గౌతమ్ పాత్రలో గోపీచంద్ అద్భుతమైన నటనని కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు. ఈ సినిమాలో పాత సినిమాల్లో లాగా పవర్ఫుల్ గా చూడొచ్చు. తాప్సీ చూడటానికి అందంగా ఉంది, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగా కష్టపడి తనకిచ్చిన పాత్రకి న్యాయం చేసింది. కానీ ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకున్న తాప్సీ ఈ సినిమాలో గ్లామర్ విషయంలో ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి.  శక్తి కపూర్ కి టెర్రరిస్ట్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.అలాగే ఆయన మంచి నటనని కనబరిచాడు. అలీ నవ్వినచడానికి తనవంతు కృషి చేసాడు. సుమన్ కనిపించేది అతిధి పాత్రలోనే అయినా ఆపాత్రలో ఒదిగిపోయాడు. గోపీచంద్ కి తండ్రిగా కనిపించిన నారాయణ మూర్తి నటన జస్ట్ ఓకే. 

సాహసం రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

ఈ సినిమాకి మొట్టమొదటి హైలైట్ శ్యాం దత్ సినిమాటోగ్రఫీ. శ్యాం దత్ తన కెమెరా టెక్నిక్స్ తో మన కళ్ళని కట్టి పడేసాడు. అలాగే డైరెక్టర్ ఏమనుకున్నాడో దాన్ని తెరపై ఆవిష్కరించడంలో శ్యాం దత్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. తారవాత చెప్పుకోవాల్సింది రామకృష్ణ అందించిన సెట్స్ గురించి మరియు విజవల్ ఎఫెక్ట్స్, ఇవి రెండూ మనకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. చాలా కాలం తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ని సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేసాడు. సెల్వ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. 

ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గురించి.. చాలా ఫ్రెష్ ప్లాట్ ని ఎంచుకున్న ఆయన దాన్ని తెరపై అడ్వెంచర్ థ్రిల్లర్ గా చూపించడంలో డిస్టింక్షన్ మార్క్స్ కొట్టేసాడు. అలాగే లడఖ్ ని పర్ఫెక్ట్ పాకిస్థాన్ లుక్ లో చాలా రియలిస్టిక్ గా చూపించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


సాహసం రివ్యూ: హైలెట్స్
  • ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్
  • సూపర్బ్ సినిమాటోగ్రఫీ
  • అబ్బురపరిచే సెట్టింగ్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్
  • ఆడియన్స్ ని కట్టి పడేసే ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్
  • చంద్రశేఖర్ యేలేటి టేకింగ్

సాహసం రివ్యూ: డ్రా బాక్స్
  • ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
  • హాట్ బ్యూటీ తాప్సీ ఉన్నప్పటికీ
  • బి, సి ఆడియన్స్ ని ఆకట్టుకునే గ్లామర్ లేకపోవడం
  • అక్కడక్కడా ఫేస్ పడుతూ లేస్తూ ఉంటుంది

సాహసం రివ్యూ: విశ్లేషణ

చంద్రశేఖర్ ఏలేటి చిత్రం అంటే సినిమా చూస్తే సరిపోదు ఆలోచించాలి ఈ విషయం అందరికి తెలిసిందే. అందరిది ఒక పంథా అయితే నాది వేరు అన్నట్టుగా ఉండే ఈయన సినిమాలు నిజంగానే అన్ని సినిమాలు ఒకేలా ఉండవు అని నిరూపిస్తూ వచ్చాయి. చివరగా ప్రయాణం చిత్రంతో మన ముందుకి వచ్చిన ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించారు ట్రెజర్ హంట్ అనే అంశం తెలుగు తెర మీద వచ్చి చాలా రోజులయింది ఇలాంటి సమయంలో ఈ రకమయిన చిత్రాన్ని తీయాలనుకోవడం నిజంగా సాహసమే . అలానే  ప్రచారం విషయంలో ఎటువంటి ఆసక్తి కనబరచని నిర్మాత నిర్మాణంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చు పెట్టారు, మరి ఇంతలా ఖర్చు పెట్టి ప్రచారం గురించి పట్టించుకోకపోవడం వెయ్యి డాలర్ల ప్రశ్న. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో మాత్రమే కనిపించిన తప్సి  ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించడం గ్లామర్ పాళ్ళు తక్కువగా ఉండటం తప్సీ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే .

చాలా రోజుల తరువాత సంగీతం అందించిన శ్రీ నేపధ్య సంగీతం తో సన్నివేశాలకు ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు. వాణిజ్య అంశాలు లేకపోవడం అక్కడక్కడ చిత్రం నెమ్మదించడం చిత్ర మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ఈ సినిమా బి,సి ఆడియన్స్ ని ఆకట్టుకునే చాన్స్ 50 -50 మాత్రమే కానీ ఎ సెంటర్స్ మరియు ఓవర్సీస్ లో కలెక్షన్స్ కొల్లగొడుతుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

సాహసం రివ్యూ: చివరగా -  కమర్షియల్ చిత్రాల మధ్య ఇది నిజంగా సాహసమే 


 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Sahasam | Sahasam Wallpapers | Sahasam Videos

Sahasam
Sahasam Review | Sahasam Rating | Sahasam Movie Review | Sahasam Movie Rating | LIVE UPDATES | Gopichand Sahasam | Story | Performances | Cast Crew on APHerald.com
Directed by: Chandra Sekhar Yeleti
Starring:
Gopichand
Taapsee Pannu
Ali
Sahasam
Sahasam Review | Sahasam Rating | Sahasam Movie Review | Sahasam Movie Rating | Sahasam Telugu Movie Review | Sahasam Telugu Movie Rating | Gopichand | Taapsee
Date published: 07/12/2013

మరింత సమాచారం తెలుసుకోండి: