Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Aug 19, 2017 | Last Updated 2:56 pm IST

Menu &Sections

Search

దువ్వాడ జగన్నాథమ్ : రివ్యూ

- 2.5/5
దువ్వాడ జగన్నాథమ్ : రివ్యూ ఈ సినిమా రివ్యూ ను తెలుగులో చదవండి

What Is Good

  • అల్లు అర్జున్ నటన
  • పూజా హెగ్దె గ్లామర్
  • డైలాగ్స్
  • మ్యూజిక్

What Is Bad

  • రొటీన్ స్టోరీ
  • ఆకట్టుకోలేని కథనం
Bottom Line: బన్ని డిజె కేవలం ఫ్యాన్స్ కోసమే..!

Story

అగ్రహారంలో ఉండే దువ్వాడ జగన్నాధం (అల్లు అర్జున్) అన్నపూర్ణ క్యాటరింగ్ నడిపిస్తుంటాడు. తన చేతి వంటతో అందరిని మైమరిచోయేలా చేసే డిజె చిన్నప్పటి నుండి ఆవేశపరుడు. ఇక మురళి శర్మతో కలిసి విలన్ల పని పడుతుంటాడు డిజె అండర్ కవర్ ఆపరేషన్ నడిపిస్తున్న డిజెకు సడెన్ గా తనకు బాగా దగ్గరైన మనిషి చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం బాధిస్తుంది. దీనికి కారణం అగ్రి డైమండ్ సంస్థని తెలుసుకుని వారిని టార్గెట్ చేస్తాడు. అగ్రి డైమండ్ సంస్థ రొయ్యల నాయుడు స్టీఫెన్ బినామిగా నడుపుతూ ఉండాడు. డిజెగా వారి పనిపట్టేందుకు సిద్ధమైన దువ్వాడ జగన్నాధం నాయుడుని ఎలా మట్టుపెట్టాడు అన్నది అసలు కథ. డిజె ఎలా నాయుడు పని పట్టాడు..? హీరోయిన్ పూజా ప్రేమలో డిజె ఎలా పడ్డాడు..? హీరోయిన్ తండ్రికి రొయ్యల నాయుడికి సంబంధం ఏంటన్నది తెర మీద చూడాలి.


Star Performance

దువ్వాడ జగన్నాధంలో అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటిసారి కెరియర్ లో బ్రాహ్మణ వేశంలో కనిపించిన బన్ని పర్ఫార్మెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివెరీలో కూడా ప్రత్యేకతను చూపాడు. బన్ని సినిమాలో డ్యాన్స్ లో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే. ప్రతి సాంగ్ లో తన స్టాంప్ వేసుకున్నాడు బన్ని. ఇక హీరోయిన్ పూజా హెగ్దె సినిమాలో గ్లామర్ షో చేసింది. సినిమాకు పూజా గ్లామర్ చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక విలన్ గా రావు రమేష్ తన తండ్రి రావు గోపాల రావు ఆ ఒక్కటి అడక్కు సినిమా తరహా పాత్రలో అదరగొట్టేశారు. మురళిశర్మ, తణికెళ్ల భరణిల పాత్రలు బాగా వచ్చాయి. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సుబ్బరాజు పాత్ర కూడా అలరించింది.

Techinical Team

టెక్నికల్ గా డిజె సినిమా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. బోస్ సినిమాటోఫ్రఫీ బాగుంది. బన్నిని చాలా స్టైలిష్ గా చూపించారు. పూజా హెగ్దె అయితే సినిమాతో కచ్చితంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఇక చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలెట్.. దేవి మ్యూజిక్ కు బన్ని డ్యాన్సులు అదరహో అనిపిస్తాయి. ఇక సినిమా దర్శకుడు హరిష్ శంకర్ తన మార్క్ సినిమాతో వచ్చాదు. అయితే కథ కథాలన్ని పాత చింతకాయ పచ్చడిలానే ఉంటాయి. డైలాగ్స్ విషయంలో హరిష్ తన పనితనం చూపించాడు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Analysis

దువ్వాడ జగన్నాధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా అదరగొట్టాడు. బన్ని విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడ్డట్టే. అయితే పాత కథకి హీరో క్యారక్టరైజేషన్ కాస్త కొత్తగా రాసుకుని డిజెగా వదిలాడు హరిష్ శంకర్. కథ పాతదే అన్న భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా అంత ఎట్రాక్టివ్ గా ఉండదు. 

సినిమా మొదటి భాగం అంతా కామెడీతో నడిపించిన హరిష్ శంకర్ ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ తో నింపాడు. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో బన్ని ఎనర్జీ.. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. కథ రొటీన్ అయినా కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

సరైనోడు తర్వాత అదే రేంజ్ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. సినిమా అయితే మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. సినిమ సరదాగా సాగినా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తాయి. ఇక కొత్తగా ఏం చెప్పదలచుకున్నాడు అన్న పాయింట్ ఆడియెన్స్ ఆలోచిస్తే మాత్రం కష్టమే.

మెగా అభిమానులకు మంచి ఫీస్ట్ అందించే సినిమాగా మాస్ క్లాస్ మికెస్ తో వచ్చింది డిజె. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కచ్చితంగా నచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు. 

Cast & Crew

3 / 5 - (7622 votes)
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all
Jab Harry Met Sejal Hindi Movie Review, Rating

Jab Harry Met Sejal Hindi Movie Review, Rating

Indu Sarkar Hindi Movie Review, Rating

Indu Sarkar Hindi Movie Review, Rating