పోలీస్ సీన్స్ అండ్ డైలాగ్స్ , ప్రొడక్షన్ వాల్యూస్ , ఫైట్స్పోలీస్ సీన్స్ అండ్ డైలాగ్స్ , ప్రొడక్షన్ వాల్యూస్ , ఫైట్స్రొటీన్ స్టోరీ , బోరింగ్ స్క్రీన్ ప్లే , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

జయదేవ్ (గంటా రవి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. అన్యాయాన్ని సహించని జయదేవ్ ఎవరికి భయపడే రకం కాదు. ఓ పోలీస్ ఆఫీసర్ శ్రీరాం (రవిప్రకాశ్) హత్య చేయబడంతో ఆ కేసు జయదేవ్ స్టేషన్ కు వస్తుంది. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన జయదేవ్ దీని వెనుక బడా బాబులు ఉన్నారని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో మస్తాన్ బాబు (వినోద్ కుమార్) శ్రీరాంను హత్య చేయించాడని ఓ నిర్ణయానికి వస్తాడు. ఇక మస్తాన్ బాబుని జయదేవ్ ఎలా పట్టుకున్నాడు..? అతని శ్రీరాంను ఎందుకు హత్య చేశాడు..? జయదేవ్ శ్రీరం కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడు అన్నది అసలు కథ. 

జయదేవ్ గా టైటిల్ రోల్ పోశించిన గంటా రవి తన వరకు తాను బాగానే చేశాడని చెప్పొచ్చు. మొదటి ప్రయత్నంగా తను పర్వాలేదు. అయితే ఎమోషనల్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. హీరోయిన్ కేవలం గ్లామర్ షోకి మాత్రమే అన్నట్టు ఉంటుంది. ఇక కమెడియన్స్ వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. వినోద్ కుమార్ చాలా రోజుల తర్వాత విలన్ గా ఫుల్ లెంథ్ రోల్ చేశారు. సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిగతా వారంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

డైరక్టర్ జయంత్ చేసిన ఈ ప్రయత్నం విఫలమయ్యిందని చెప్పొచ్చు. కొత్త హీరోని పరిచయం చేసే క్రమంలో అతన్ని ఇంకా వర్క్ అవుట్ చేయించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కథ కథనాల పరంగా కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. డైలాగ్స్ అక్కడక్కడ బాగా వచ్చాయి. సినిమా రిచ్ గా తీయడంలో మాత్రం ది బెస్ట్ అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ ఓకే. మణిశర్మ మ్యూజిక్ ఏమాత్రం మ్యాజిక్ చేయలేదు. కాస్త కూస్తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బెటర్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయొచ్చు. ఫైనల్ గా రిచ్ ప్రొడక్షన్ తో సినిమా వచ్చింది. 

హీరో సిన్సియర్ పోలీస్ అయ్యుండి సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టడం లాంటి కథలు చాలానే చూశాం. ఇక జయదేవ్ కూడా అలాంటి రొటీన్ కథతోనే వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఓ వ్యాపారవేత్త తన తప్పులను తప్పించుకునే ప్రయత్నంలో ఆ సాక్ష్యాలను రెడీ చేసిన పోలీస్ ను హత్య చేయించడంతో కథ మొదలవుతుంది.

కథ కథనాలు పాతవే అన్నట్టు కనిపించినా కథలో ఫీల్ మాత్రం దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అయితే హీరో గంటా రవి ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది. పోలీస్ శాఖకు సంబందించిన సీన్స్ కొన్ని ఆసక్తికరంగా సాగాయి. అయితే మొదటి భాగం ఎలాగోలా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో హీరో విలన్ల మధ్యే సీన్స్ ఎక్కువ రాసుకున్నాడని అనిపిస్తుంది. అవి బోర్ కొట్టించేస్తాయి. 

ఫైనల్ గా క్లైమాక్స్ లో మాత్రం మళ్లీ సినిమాను ట్రాక్ ఎక్కించేశారు. ఓవరాల్ గా సినిమా రొటీన్ పోలీస్ కథే కాని కొత్త కుర్రాడు చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోవచ్చు. తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ అక్కడ రేంజ్ మాత్రం అందుకోలేదు.
Ganta Ravi,Malvika Raaj,Jayanth C Paranji,Anil Kumar Kishen,Mani Sharma'జయదేవ్' అలరించలేకపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: