సంపూర్ణేష్ బాబు, కథ, డైలాగ్స్సంపూర్ణేష్ బాబు, కథ, డైలాగ్స్స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, మ్యూజిక్
యూనివర్సిటీ టాపర్ అయిన కిట్టు (సంపూర్ణేష్ బాబు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలని కలలు కన్నా సరే అవి నెరవేర్చుకునే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో ఓ కాఫీ షాప్ లో పనిచేస్తూ జీవనం గడుపుతుంటాడు. ఇక అతని టాలెంట్ తెలుసుకున్న అనన్య (నిదిషా) కిట్టుకి కావాల్సిన ఆర్ధిక సాయం చేస్తుంది. అంతేకాదు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లేందుకు సహకరిస్తుంది. సాఫ్ట్ వేర్ జాబ్ సాధించిన కిట్టుకి సడెన్ గా అనన్య మరణ వార్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వెంటనే అమెరికా నుండి వచ్చి అనన్య చనిపోడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటాడు. తను ఉండే అపార్ట్ మెంట్ లో నెట్ వర్క్ ఆపరేటర్ గా చేరి ఆమె మరణానికి గల కారణాలు ఏంటని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో కిట్టు షాక్ అయ్యేలా నిజాలు బయట పడతాయి. అనన్య మరణానికి వైరస్ డాట్ కాం కు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఇక దాన్ని ఛేదించే క్రమంలో అనన్య ఎలా మరణించిందో కనిపెడతాడు. అసలు వైరాస్ డాట్ కాం ఏంటి..? కిట్టు తెలుసుకున్న నిజాలు ఏంటి..? అనన్య ఎందుకు చనిపోయింది అన్నది అసలు కథ. 
సంపూర్ణేష్ బాబు సినిమా అంటే అతని సినిమాలో అతని ఓవర్ యాక్షన్ తప్పనిసరి. ఆడియెన్స్ నవ్వించేందుకు అతను చేసే అభినయం అందరిని ఆకట్టుకుంటుంది. డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్ అన్ని సంపూ ఇరగదీశాడు. ఇక హీరోయిన్ నిదిష బాగానే చేసింది. ఆమెను గ్లామర్ గా వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఇక సినిమాలో వెన్నెల కిశోర్ రోల్ సర్ ప్రైజ్ ఇస్తుంది. కమెడియన్స్ చమ్మక్ చంద్ర, వైవా హర్ష ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రదారులంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. 
దర్శకుడు ఎస్.ఆర్ కృష్ణ రాసుకున్న కథ చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ రివల్యూషన్ ఎంత బాగా ఉందో తెలిసిందే. సోషల్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయంపై కథ బాగానే రాసుకున్నాడు. కాని కథనంలో మాత్రం తేలగొట్టేశాడు. సునీల్ కశ్యప్ సాంగ్స్ పర్వాలేదు, కెమెరా వర్క్ ఓకే అనిపించేలా ఉంది. ఎడిటింగ్ ఇంకా బాగా చేయొచ్చనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి.
తన వెరైటీ కామెడీతో కడుపుబ్బా నవ్వించే బర్నింగ్ స్టార్ ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోగా తను చేసే ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ ఆడియెన్స్ కు భలే థ్రిల్ అనిపిస్తాయి. ఇక అదే కోవలో వచ్చిన వైరస్ సినిమా కథ వరకు మెచ్చుకునేలా ఉన్నా కథనంలో మాత్రం దెబ్బపడిపోయిందని చెప్పొచ్చు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో దర్శకుడు కృష్ణ సినిమా నడిపించాడు.


సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా సరిగా కుదరలేదు. అంతేకాదు సినిమాలో వచ్చే దెయ్యం సీక్వెన్స్ ఎందుకు పెట్టారో సినిమా కథకు దానికి ఏం సంబంధం అన్న ఆలోచన ఆడియెన్స్ కు వస్తుంది. కథ వరకు బాగానే రాసుకున్న దర్శకుడు కథనంలో అదే ఫాలో అయ్యి ఉంటే సినిమా మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది.  


సంపూర్ణేష్ బాబు వన్ మ్యాన్ షోగా సినిమా మొత్తం నడిపించాడు. అయినా కూడా సినిమా అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. కొన్ని సీన్స్ ఓకే అనేలా ఉన్నా ఓవరాల్ గా సినిమా మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. 

Sampoornesh Babu,Geeta Shah,SR Krishna,Salim,Meenakshi Bhujangసంపూ 'వైరస్' నిరాశ పరచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: