స్టార్ కాస్ట్ , డైలాగ్స్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్స్టార్ కాస్ట్ , డైలాగ్స్ , సినిమాటోగ్రఫీ , మ్యూజిక్అక్కడక్కడ కాస్త స్లో అనిపించడం , కొన్ని అనవసరమైన సీన్స్
ఉమామహేశ్వర్ రావు అలియాస్ ఉమా (నాని), పల్లవి (నివేథా థామస్) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండగా అనివార్య కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు. అరుణ్ (ఆది పినిశెట్టి) పల్లవిని పెళ్లి చేసుకుంటాడు. యూఎస్ లో ఉంటున్న వీరి దగ్గరకు సడెన్ గా నాని వస్తాడు. ఆదికి చెప్పి నానిని ఓ పది రోజులు వారి దగ్గర ఉండేలా పల్లవి అరుణ్ ని పర్మిషన్ అడుగుతుంది. అక్కడ జరిగిన పరిణాలేంటి..? ఉమా పల్లవిలు ఎలా విడిపోయారు..? ఉమా పల్లవిల ప్రేమలో పల్లవి తండ్రి మురళీ శర్మ పాత్ర ఎంత అన్నది అసలు కథ.  



లవర్ బోయ్ గా నాని మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆడియెన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథతోనే అద్భుతమైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు నాని. ఇక నానికి పోటీగా నివేథా కూడా అదిరిపోయేలా నటించింది. నాని నివేతా ఇద్దరు సినిమాకు ప్రాణం పోశారు. ఆది పినిశెట్టి కూడా తన రోల్ లో చక్కగా మెప్పించాడు. ఆది ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. అతను ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదని చెప్పాలి. మురళి శర్మ పాత్ర కూడా ఎప్పటిలానే ఆకట్టుకుంది. 



డెబ్యూ డైరక్టర్ శివ నిర్వాణ మొదటి సినిమానే అయినా ఇంప్రెస్ చేశాడు. కథ కథనాలు ఆడియెన్స్ మనసుకి హత్తుకునేలా రాసుకున్నాడు. ఎక్కడ కథను డీవియేట్ అవ్వకుండా చేశాడు. ఇక కార్తిక్ కెమెరా వర్క్ అద్భుతం. యూఎస్ లో లొకేషన్స్ అన్ని చాలా బాగా చూపించారు. గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. ఫీల్ గుడ్ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశారు. ఎడిటింగ్ ఓకే. ఇక డివివి దానయ్య ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే చెప్పనవసరం లేదు. సినిమా ఎంతో రిచ్ గా వచ్చేందుకు ప్రొడక్షన్ తరపునుండి పూర్తి స్వేచ్చ ఇచ్చారని చెప్పొచ్చు.



వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నిన్ను కోరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేమకథతో వచ్చింది. ఓపెనింగ్ తోనే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసిన దర్శకుడు నాని నివేతాలలో తమని తాము చూసుకునేలా సన్నివేశాలు రాశాడు. ప్రేక్షకుడు సినిమాలో ఎక్కడో ఓ చోట తమని తాము ఊహించుకునే అవకాశం ఉంది.


నాని కమాండబుల్ యాక్టింగ్ సినిమాకు హైలెట్. నివేతా కూడా నానికి ఏమాత్రం తీసిపోకుండా చేసింది. ఇక సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమాలోని డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మొదటి భాగం అలా అలా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అందరిని టచ్ చేసేలా ఉంటుంది.


సినిమా ఆడియోలోనే కచ్చితంగా మనసుకి నచ్చే సినిమా నిన్ను కోరి అని చెప్పిన నాని మాట నిజమని చెప్పొచ్చు. ప్రేక్షకుడు తమ ప్రేమనే తెర మీద చూస్తున్నాం అన్న భావన కలిగేలా కథ కథనాలు సహజత్వానికి దగ్గరగా తీశారు. కొన్ని సీన్స్ లో నాని నటన అద్భుతమని చెప్పాలి. 


కచ్చితంగా యువత నచ్చే సినిమాగా నిన్ను కోరి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తమని మర్చిపోయి మధురానుభూతిని కలిగించేలా సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఎంటర్టైన్ పాళ్లు కాస్త అటు ఇటు అయినా సినిమా మాత్రం ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుందని చెప్పొచ్చు.  


Nani,Nivetha Thomas,Aadhi Pinisetty,Shiva Nirvana,DVV Danayya,Gopi Sunder'నిన్నుకోరి' నాని మనసులను కదిలించాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: