నటీనటులు , స్క్రీన్ ప్లే , డైరక్షన్నటీనటులు , స్క్రీన్ ప్లే , డైరక్షన్మ్యూజిక్ , కమర్షియాలిటీ మిస్సింగ్
కృష్ణ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని ఆమె మీద ప్రేమను తలచుకుంటూ ఉండే కుర్రాడు. శివ ఊరి నుండి ఓ చిన్న గొడవతో హైదరాబాద్ కు చేరుకుంటాడు. కార్తిక్ ఉద్యోగం కోసం చూస్తున్న కుర్రాడు. శమంతకమణి అనే కారు ఈ నలుగురిని ఒక్క చోటికి చేరుస్తుంది. సిఐ రంజిత్ వీరి నలుగురిని టార్గెట్ చేస్తాడు. అసలు శమంతకమణి కథ ఏంటి..? కథలో నలుగురు కుర్రాళ్లు ఎలా కలిశారు అన్నదై అసలు కథ.

నలుగురు హీరోలు తమ తమ పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేశారు. కృష్ణగా సుధీర్.. శివ గా సందీప్.. కార్తిక్ గా ఆది.. రంజిత్ గా నారా రోహిత్. ఇలా కుర్ర హీరోలందరు మల్టీస్టార్ గా ఒకరికి ఒకరు పోటీ అన్నట్టు నటించి మెప్పించారు. ఇక ఉమామహేశ్వర్ రావుగా రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం. సుమన్ పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలన్ని మంచి నటన కనబరిచారు.

దర్శకుడు అన్ని విధాలుగా సినిమా మెప్పించేలా చేశాదు. కథ చిన్నదే అయినా సర్ ప్రైజింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. కెమెరామన్ పనితనం బాగుంది. మ్యూజిక్ సోసోగానే ఉంది. ఎడిటింగ్ మాత్రం షార్ప్ గా ఉంది. ఇక ఆనంద్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓ కారు దాని చుట్టి తిరిగే కథ ఇలా ఒకే అంశంపై తిరిగే కథలు చాలానే వచ్చాయి. ఇలాంటి కథలు అన్ని స్క్రీన్ ప్లేతోనే ఆకట్టుకోవాలి లేదంటే ఫట్ అనిపిస్తాయి. ఓరకంగా దర్శకుడు శ్రీ రాం ఆదిత్య శమంతకమణితో అన్ని విభగాల్లో ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు. కథ పాతదే అయినా కథనం కొత్తాగా నడిపించాడు.

ముఖ్యంగా అర్టిస్టులను నలుగురు హీరోలు అనేలా కాకుండా నలుగురు పాత్రలుగా ట్రీట్ చేశాడు. అక్కడే సినిమా సక్సెస్ అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో కూడా డైరక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ కథనాలు రేసీగా ఉండటం కూడా ప్లస్ అవుతుంది. సినిమాకు తగ్గట్టుగా ముందే ఆడియెన్స్ ను ఓ మూడ్ లోకి తీసుకెళ్తాడు.

అంతేకాదు సినిమా అంతా ఎంటర్టైన్ మోడ్ లో సాగుతుంది. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని రాసుకున్న డైలాగ్స్ కూడా బాగా పేలుతాయి. ఓవరాల్ గా ముందునుండి నమ్మ్మకంగా చెబుతున్న ఈ సినిమా అంతే నమ్మకంగా ప్రేక్షకులన్ మనసు గెలుచుకుంటుందని చెప్పొచ్చు.
Nara Rohith,Sudheer Babu,Aadi,Sudeep Kishan,Aditya Sriram,V Anand Prasad,Mani Sharmaశమంతకమణి యువ హీరోలు టాలెంట్ చూపించారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: