వరుణ్ తేజ్ , సాయి పల్లవి నటన , మ్యూజిక్వరుణ్ తేజ్ , సాయి పల్లవి నటన , మ్యూజిక్సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ , ఎడిటింగ్
వరుణ్ (వరుణ్ తేజ్) అమెరికాలో మెడిసిన్ చేస్తుంటాడు.. తన అన్న పెళ్లి విషయంపై భాన్సువాడలో సంబంధం చూసేందుకు వస్తాడు. అక్కడ భానుమతి (సాయి పల్లవి)ని చూసి ఇష్టపడతాడు. భానుమతి కూడా వరుణ్ ను ఇష్టపడుతుంది. ఈ టైంలో ఓ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇద్ద్దరు ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోకుండానే విడిపోతారు. భానుమతి వరుణ్ ను ఎవైడ్ చేయడం మొదలు పెడుతుంది. వరుణ్ ప్రపోజల్స్ ను కూడా కాదంటుంది. అసలు భానుమతి ఎందుకు వరుణ్ పట్ల అలా ప్రవర్తిస్తుంది..? వరుణ్ ప్రేమను భానుమతి అంగీకరిస్తుందా..? వరుణ్ ను భానుమతి కూడా ప్రేమించిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెర మీదే చూడాలి.

మెగా హీరో వరుణ్ క్లాస్ కుర్రాడిగా బాగానే చేశాడు. ఎన్నారై గా వరుణ్ తన డైలాగ్ డెలివరీ అంతా బాగానే చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సి ఉందనిపిస్తుంది. ఇక భానుమతిగా మలయాళ భామ సాయి పల్లవి అదరగొట్టేసింది. అసలు సినిమా మొత్తం తన కోసమే అన్న విధంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది. తన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో సాయి పల్లవి ప్రేక్షకులను నిజంగానే ఫిదా అయ్యేలా చేసింది. ఇక వరుణ్ అన్న వదినలుగా చేసిన వారు బాగానే చేశారు. సత్యం రాజేష్ ఎపిసోడ్ పర్వాలేదు. ఇక సినిమాలో మిగతా నటీనటులంతా బాగానే చేశారు.

సినిమా కెమెరా వర్క్ బాగుంది.. సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయొచ్చనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా తెలంగాణా  యాసలో అదరగొట్టాయి. ఇక శేఖర్ కమ్ముల డైరక్షన్ టాలెంట్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. తన మార్క్ కనిపించేలా సినిమా ఉంది. 

ఇదో రొటీన్ స్టోరీనే అయినా తెరకెక్కించిన విధానంలో ప్రేక్షకులను ఫిదా చేస్తారు. వరుణ్ తేజ్ ఎన్నారైగా.. సాయి పల్లవి పల్లెటూరి పిల్లలా ఇద్దరిని సినిమాలో శేఖర్ బాగా వాడారని చెప్పొచ్చు. ముఖ్యంగా సాయి పల్లవి మీద అంతా ఫోకస్ పెట్టాడు. మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది.. సెకండ్ హాఫ్ కాస్త ల్యాంగ్ చేసినట్టు అనిపిస్తుంది. 

మళ్లీ క్లైమాక్స్ లో దాన్ని కవర్ చేశాడు. సినిమా అంతా సాయి పల్లవి ఎనర్జీ సూపర్ గా మెయింటైన్ చేస్తుంది. ముందు చెప్పినట్టుగా కథ పాతదే అయినా సినిమా అంతా సరదాగా నడిపించేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.

సినిమాలో ప్రేక్షకులు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి మూడ్ క్రియేట్ చేస్తారు. అయితే లీడ్ పెయిర్ మధ్య ఇంకాస్త కెమిస్ట్రీ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తగ్గినట్టుగా ఉంటాయి. సగటు ప్రేక్షకుడు నచ్చేలా ఉన్న ఈ సినిమా శేఖర్ కమ్ములను.. వరుణ్ తేజ్ ను ఒడ్డున పడేసినట్టే. 
Varun Tej,Sai Pallavi,Shekhar Kammula,Dil Raju,Shakthi Kanthవరుణ్ తేజ్ సాయి పల్లవితో కలిసి శేఖర్ కమ్ముల ఫిదా చేసినట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: