విజయ్ నటన, ఫస్ట్ హాఫ్ , మ్యూజిక్ , డైరక్షన్విజయ్ నటన, ఫస్ట్ హాఫ్ , మ్యూజిక్ , డైరక్షన్సెకండ్ హాఫ్ సాగదీత , డ్యూరేషన్

మంగుళూరు సెయింట్ మేరీస్ కాలేజ్ లో మెడికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ లో టాప్ ర్యాంకర్ గా ఉంటాడు. అలాంటి అర్జున్ రెడ్డి మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ప్రీతి (షాలిని పాండే)ని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అర్జున్ రెడ్డి కమిట్మెంట్ చూపిస్తున్న ప్రేమని చూసి ప్రీతి అర్జున్ రెడ్డిని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లిచేసుకుందాం అనేసరికి ప్రీతి తండ్రి ఆమెకు తమ కులం వాడితో పెళ్లిచేస్తాడు. ఆ దెబ్బతో అర్జున్ రెడ్డి చాలా డిస్ట్రబ్ అవుతాడు. తన కెరియర్ ను కూడా సంక్షోభంలో పడేసుకుంటాడు. ప్రీతి దూరమైన అర్జున్ రెడ్డి ఎలా మారాడు..? ప్రీతి అర్జున్ రెడ్డి మళ్లీ కలిశారా..? అన్నది అసలు కథ.

తన సెలెక్ట్ చేసుకునే సినిమాల మీద నమ్మకంతోనే కాబోలు విజయ్ దేవరకొండ అంత కాన్ఫిడెంట్ గా కనబడతాడు. సినిమాలో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. విపరీతమైన కోపం, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా విజయ్ తిరుగులేకుండా చేశాడు. ముఖ్యంగా దర్శకుడు అర్జున్ రెడ్డి పాత్రల్ను మలిచిన తీరు బాగుంది. ఇక హీరోయిన్ షాలిని స్క్రీన్ మీద అందంగా కనిపించింది. రాహుల్ రామకృష్ణ పాత్ర ఆకట్టుకుంటుంది. ప్రీతి రెడ్డి తండ్రి పాత్ర కూడా ఇంప్రెస్ చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి ఎందుకు తన సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నాడో సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఎంచుకున్న కథను చెప్పే విధానంలో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అందించాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి పాత్ర తెరకెక్కించిన తీరు సింప్లీ సూపర్బ్. సినిమాకు వాడిన రియల్ లొకేషన్స్ బాగా కనువిందు చేశాయి. రాధన్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది. రాజు తోట సినిమాటొగ్రఫీ బాగా అనిపిస్తుంది. ఇక శశాంక్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రణయ్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ తో బీభత్సం సృష్టించిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ, షాలిని లీడ్ రోల్స్ లో సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చింది. సినిమా కథ కథనాలు ఎలా ఉంటాయో ఆల్రెడీ టీజర్ ట్రైలర్ లో చూపించారు కూడా. విపరీతమైన కోపం, యాటిట్యూడ్ ఉన్న అర్జున్ రెడ్డి తను ప్రేమించిన ప్రీతికి దూరమవుతాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వారిని పెళ్లి చేసుకోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన అర్జున్ రెడ్డి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.

దర్శకుడు అర్జున్ రెడ్డి పాత్ర మలచిన తీరు అద్భుతంగా ఉంటుంది. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అతని పాత్ర మీద దర్శకుడు తెర మీద చూపించిన విధానానికి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అయితే మొదటి భాగం ఎంటర్టైనింగ్ గా సాగిన అర్జున్ రెడ్డి సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. చాలా వరకు ట్రిం చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. 

ఇక క్లైమాక్స్ విషయంలో కూడా అంతగా కేర్ తీసుకున్నట్టు అనిపించదు. సినిమా అంతా క్లాస్ గా అనిపిస్తుంది. ఈతరం దేవదాసు కథగా అర్జున్ రెడ్డిని చెప్పుకోవచ్చు. మొదటి సినిమానే అయినా దర్శకుడు తను రాసుకున్న కథని తెర మీద చూపించిన తీరు బాగుంది. కథనంలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. యూత్ ఆడియెన్స్ ను నచ్చే అంశాలున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు మాస్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.
Vijay Deverakonda,Shalini Pandey,Sandeep Reddy Vanga,Pranay Reddy Vanga,Radhanమోడ్రెన్ దేవదాసు అర్జున్ రెడ్డి మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: