నారా రోహిత్, స్టోరీ పాయింట్నారా రోహిత్, స్టోరీ పాయింట్స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్, హీరోయిన్
సినిమాల్లో విలన్ గా నటిస్తూ స్టార్ డం సంపాదించుకున్న అర్జున్ చక్రవర్తి (నారా రోహిత్) కేవలం సినిమాల్లోనే విలన్ గా కాదు బయట కూడా అదే ఇమేజ్ తో ప్రవర్తిస్తుంటాడు. అతనికి ఉన్న ఫాలోయింగ్ చూసి అతన్ని ఎవరు ఏమి అనలేని పరిస్థితి. ఇక మరో పక్క స్టార్ హీరోగా అదే ఇండస్ట్రీలో ఉన్న నాగ శౌర్య అర్జున్ ను దెబ్బ తీసేందుకు రెడీగా ఉంటాడు. అందరిచేత ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ విలన్ అనిపించుకుంటున్న అర్జున్ ఓ యాక్సిడెంట్ లో తన ప్రవర్తననే మార్చుకుంటాడు. ఆ తర్వాత తనలోని మార్పుని గమనించి డాక్టర్ ను కలుస్తాడు. ఇక డాక్టర్ సలహా మేరకు తన పాత శత్రువు సీత (నమిత ప్రమోద్) మీద పగ తీర్చుకునేందుకు బయలుదేరుతాడు అర్జున్. ఇంతకీ అర్జున్, సీతల మధ్య గొడవ ఏంటి..? అర్జున్ ఎందుకు ఆమెనే ఎంచుకున్నాడు..? సీత అర్జున్ పగ నుండి ఎలా బయటపడింది..? నాగ శౌర్య అర్జున్ ల మధ్య వైరం ఏమైంది అన్నది తెర మీద చూడాల్సిందే. 



నారా రోహిత్ నటన అద్భుతంగా ఉంటుంది. సినిమా మొత్తం అతని పాత్ర మీదే నడుస్తుంది.. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశాడు. ఇక సినిమాలో రోహిత్ కాస్త సన్నబడినట్టు కనిపిస్తాడు. మరో పక్క నాగ శౌర్య కూడా తన యాక్టింగ్ టాలెంట్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నమిత ప్రమోద్ అంతగా  ఇంప్రెస్ చేయలేదు. కథలో ఆమె పాత్ర చాలా కీలకం అలాంటి పాత్ర ఆమె చాలా చక్కగా నటించాలి కాని అది కుదరలేదు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఘోరంగా చేసింది. సినిమా మొత్తం ఈ ముగ్గురు పాత్రల మీదే నడిపించాడు. ఇక మిగతా పాత్రలన్ని ఏదో చేశాం అంటే చేశాం అన్నట్టు ఉంది. 



సినిమా దర్శకుడు మహేష్ రాసుకున్న కథ కాస్త కొత్తగా అనిపించినా కథనంలో మాత్రం తేలగొట్టేశాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో నీరసం తెప్పించేస్తాడు. కథనమే కాదు సినిమాలో డైలాగులు కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించవు. నరేష్ సినిమాటోగ్రఫీ సోసొగానే అనిపిస్తుంది. సంగీతం ఇళయరాజా అయినా ఆ మార్క్ ఎందుకో అందుకోలేదని చెప్పొచ్చు. విశాల్ చంద్ర శేఖర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ అసలు బాలేదు. దర్శకుడు ఎంత మంచి కథ రాసుకున్నా దాన్ని తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి.



నారా రోహిత్, నాగ శౌర్య జ్యో అచ్యుతానంద మూవీ డీసెంట్ రిజల్ట్ అందుకుంది. ఇక ఆ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ఈ కథలో రాజకుమారి నారా రోహిత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. సినిమాలో ప్రధాన పాత్రదారుడు అర్జున్ చక్రవర్తి అదే నారా రోహిత్. కథగా చెప్పుకుంటే బాగుంది అనిపించే ఈ సినిమా కథనంలో ఎలా కిచిడి చేయాలో అంత చేసేశారు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథనం సాగించారు. ఎంటర్టైనింగ్ చేయాల్సిన సన్నివేశాలు కూడా ఎంతో పేలవంగా నడిపించేశారు. స్క్రీన్ ప్లే మీద ఏమాత్రం గ్రిప్ సాధించలేని దర్శకుడు మహేష్ ఈ కథను మంచి దర్శకుడు చేసుంటే కచ్చితంగా మంచి ప్రయత్నం అయ్యుండేది అని చెప్పొచ్చు. రోహిత్ కాస్త బరువు తగ్గినట్టు అనిపించాడు. నాగ శౌర్య ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. చుట్టాలబ్బాయ్ తో ఎంట్రీ ఇచ్చిన నమితా ప్రమోద్ చేసిన ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యిందని చెప్పాలి. 



Nara Rohit,Namitha Pramod,Naga Shourya,Mahesh Surapaneni,Sudhakar Reddy Beeram,Narra Soundarya,Prashanti,KrishnaVijay,Ilaiyaraajaకథలో రాజకుమారి ఓ ఫెయిల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: