ప్లస్ పాయింట్స్ : నాగార్జున, సమంత నటన సినిమాటోగ్రఫీ కొన్ని కామెడీ సీన్స్ప్లస్ పాయింట్స్ : నాగార్జున, సమంత నటన సినిమాటోగ్రఫీ కొన్ని కామెడీ సీన్స్ఊహించే కథాంశం మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
అశ్విన్, కిశోర్, ప్రవీణ్ బిజినెస్ గా ఓ పెద్ద బంగ్లా తీసుకుని అందులో రిసార్ట్ నడిపిస్తుంటారు. అందులో మోసపోయి చనిపోయిన అమృత (సమంత) దెయ్యంగా వారిని భయపెడుతుంది. ఇక అక్కడి చర్చ్ ఫాదర్ సాయంతో మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున)ను కలుస్తారు.

ఇక ఆయన వచ్చి ఆ దెయ్యం ఎవరు.. ఎందుకు అక్కడ తిష్ట వేసుకుంది.. అసలు ఆమె ఏం చేయాలనుకుంది అన్నది తెలుసుకుంటాడు. అమృత ఎలా చనిపోయింది అన్న విషయం కనిపెట్టే క్రమంలో రుద్ర కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాడు. అసలు అమృత ఎలా చనిపోయింది..? ఆమె చావుకి కారణం ఎవరు..? అన్నది సినిమా కథ. 



అశ్విన్, కిశోర్, ప్రవీణ్ లు ఉన్నంతలో బాగానే నటించారు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సినిమాలో మెంటలిస్ట్ రుద్రగా నాగార్జున సినిమా మొత్తం తన భుజాల మీదే నడిపించాడు.


మెంటలిస్ట్ గా నాగార్జున పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక అమృత పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. స్కోప్ ఉండాలే కాని ఎలాంటి పాత్ర అయినా సరే చాలెంజింగ్ గా చేస్తుంది అని సమంత మరోసారి నిరూపించింది. ఇక సీరత్ కపూర్ అందాల ప్రదర్శనకే ఉందని చెప్పొచ్చు. షకలక శంకర్ ఉన్న కొన్నిసీన్లు ఓకే. చర్చి ఫాదర్ గా నరేష్ ఉన్న సీన బాగానే ఉన్నాయి.

రాజు గారి గది-2 అంటూ ఓ హిట్ సినిమా సీక్వల్ కు నడుం బిగించిన ఓంకార్ సినిమాను అంత గ్రిప్పింగ్ గా నడిపించలేకపోయాడు. కథ కథనాల్లో అంతగా పట్టు సాధించలేదు.

దివాకరణ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే అనిపిస్తుంది. అబ్బూరి రవి మాటలు కొన్ని బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. 



రాజు గారి గది సీక్వల్ గా రాజు గారి గది-2 అనే టైటిల్ పెట్టగానే సినిమా ఆ సినిమా కన్నా ఇంకా ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆశిస్తారు. కాని ఇందులో అంతగా థ్రిల్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. మొదటి భాగంలో రెండు మూడు చోట్ల కాస్త భయపెట్టడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఇక మిగతా సినిమా అంతా సాదాసీదాగానే నడిపించాడు.

సినిమాలో నాగార్జున పాత్ర బాగుంది. మెంటలిస్ట్ గా అతను ఎదుటివారు తప్పు చేశారా లేదా అని కనిపెట్టే విధానం బాగుంది. అయితే అవేవి అంత నమ్మశక్యంగా అనిపించవు. 


కాసేపు నవ్వించడం కాసేపు భయపెట్టించడం ఇలా సాగే థ్రిల్లర్ సినిమా నేపథ్యం ఓంకార్ ఏమాత్రం గ్రిప్పింగ్ తో స్క్రీన్ ప్లే తీసుకురాలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే అమృత పాత్ర అయినా సినిమాను నిలబెడుతుంది అంటే మరి ఎమోషనల్ గా అయ్యి ఆడియెన్స్ కు నీరసం తెప్పిస్తుంది.


ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యిందనే చెప్పాలి.  స్క్రీన్ ప్లే అంతగ గొప్పగా ఏం లేదు.. క్లైమాక్స్ లో దెయ్యంగా ఉన్న సమంత వచ్చి మాట్లాడటం అంతా ఏదోలా అనిపిస్తుంది. సినిమా ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. ఐతే సమంత చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. 


Nagarjuna Akkineni,Samantha Ruth Prabhu,Seerat Kapoor,Ashwin Babu,Omkar,Prasad V. Potluri,S. Thamanరాజు గారి గది-2 పెద్దగా భయపెట్టలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: