రాజశేఖర్ , సినిమాటోగ్రఫీ , డైరక్షన్రాజశేఖర్ , సినిమాటోగ్రఫీ , డైరక్షన్ఎడిటింగ్ , వీక్ క్లైమాక్స్

నేషనన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేసే చంద్ర శేఖర్ (రాజశేఖర్) సీక్రెట్ గా తన ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ లో ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయగా అది కాస్త చంద్రశేఖర్ ఛేధించి ఆ బ్లాస్ట్ జరుగకుండా చేస్తాడు. అయితే ఆ బ్లాస్ట్ వెనుక అసలు కుట్ర ఏంటి.. చంద్రశేఖర్ దాన్ని ఎలా కనిపెట్టాడు అన్నది అసలు కథ.  

యాంగ్రీ మన్ రాజశేఖర్ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ చంద్రశేఖర్ గా మరోసారి తన సత్తా చాటారు. సినిమాలో రాజశేఖర్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. త్వరగా ఆ పాత్రకు కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాడు. ఇక హీరోయిన్ గా పూజా కుమార్ నటన బాగానే ఉంది. నాజర్ కూడా పాత్రకు న్యాయం చేయగా. ఆదిత్ పాత్ర బాగా చేశాడు. సినిమా మొత్తం రాజశేఖర్ తో పాటు తను ఉంటాడు. ఇక ఎన్.ఐ.ఏ ఆఫీసర్స్ లో రవి వర్మ, చరణ్ దీప్ లు ఆకట్టుకున్నారు. విలన్ గా కిశోర్ అప్పియరెన్స్ బాగున్నా ఆ పాత్ర అనుకున్న విధంగా డెవలప్ చేయలేదు. సన్ని లియోన్ ఐటం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ అని పెట్టారు. కాని అది అంతగా అవసరం లేదనిపిస్తుంది.

సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాకు చాలా కష్ట పడ్డాడని తెలుస్తుంది. టెక్నికల్ గా సినిమా మీద చాలా వర్క్ అవుట్ చేసినట్టు తెర మీద తెలుస్తుంది. అయితే అది ఆడియెన్స్ కు కనెక్ట్ చేసే విధానంలో లోటుపాట్లు జరిగాయి. శ్రీ చరణ్, భీమ్స్ పాటలు రెండు ఏదో అలా ఉన్నాయి. ఇక సినిమాకు కాస్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హెల్ప్ చేసిందని చెప్పాలి. ఎడిటింగ్ ఓకే కాని ఇంకొంత ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

దాదాపు కెరియర్ ముగించినట్టే అనిపించిన రాజశేఖర్ తో గరుడవేగ అంటూ ఓ భారీ బడ్జెట్ సినిమాతో వచ్చాడు ప్రవీణ్ సత్తారు. కంటెంట్ లో దమ్ము ఉండాలే కాని ఎలాంటి సినిమా అయినా ఆడేస్తుంది అంటూ ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన గరుడవేగ ఆ అంచనాలకు రీచ్ అవ్వలేదు. టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. కాని సినిమాను సాధారణ ఆడియెన్స్ అంచనాలకు అందకుండా తీశాడు.


అసలు కథ అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే ఫ్లుటోనియం ఎక్స్ పోర్ట్ కు సంబందించిన స్కాం.. అయితే దీని కోసం సర్వర్ అంటూ సెకండ్ హాఫ్ సినిమా సాగిస్తాడు. అది ఉన్న విలన్ ను బిల్డప్ భారీగా ఇచ్చి చివరకు సిల్లిగా చంపేసినట్టు అనిపిస్తుంది. సినిమాకు ఖర్చు పెట్టిన భారీతనం తెరమీద కనిపిస్తుంది. మొదటి భాగం ఇంటర్వల్ బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ సోసోగా నడించినా క్లైమాక్స్ మాత్రం నిరాశ పరుస్తుంది. సన్ని లియోన్ సాంగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అయితే ఆడియెన్స్ కు కనెక్ట్ చేయడంలో మాత్రం కాస్త వెనుకపడ్డది. ఏ సెంటర్స్ లో సినిమాకు ఎంగేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బి, సి సెంటర్స్ లో చెప్పలేం.   

Rajasekhar,Pooja Kumar,Kishore,Shraddha Das,Praveen Sattaru,M Koteswara Raju,Murali Srinivas,Bheems Cecireleoగరుడవేగ రాజశేఖర్ కోసం చూసేయొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: