కథ, కథనం, డైరక్షన్, శ్రీవిష్ణు, నివేదాకథ, కథనం, డైరక్షన్, శ్రీవిష్ణు, నివేదాపెద్దగా ఏమి లేవు

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ కన్ ఫ్యూజ్ మనిషి. ఎలాంటి నిర్ణయాన్నైనా సరే ఒకసారి తీసుకోలేడు. ఈ క్రమంలో స్వేచ్చ (నివేదా పేతురాజ్)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. స్వతంత్ర భావాలు కలిగిన స్వేచ్చ ప్రతి విషయంలో తనకో క్లారిటీ ఉంటుంది. అలాంటి అమ్మాయి అరవింద్ కృష్ణతో ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుంది. ఇక ఎంగేజ్మెంట్ ముందు అరవింద్ కు ముంబై వెళ్తాడు. అక్కడ రేణు పరిచయం కావడంతో అరవింద్ కృష్ణలో మార్పులు వస్తాయి. ఇంతకీ అరవింద్ కృష్ణ, స్వేచ్చను పెళ్లి చేసుకున్నాడా..? వీరి ముగ్గురు కథ ఎలా ముగిసింది అన్నది అసలు సినిమా.

అరవింద్ కృష్ణగా శ్రీవిష్ణు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తనకేం కావాలో తనకే తెలియని ఓ కన్ ఫ్యూజ్ స్టేట్ లో శ్రీవిష్ణు కొత్తగా కనిపించాడు. ఇక సినిమాలో స్వేచ్చ పాత్ర ప్రాణమని చెప్పొచ్చు. ఆ పాత్రకు నివేదా పేరురాజ్ 100 పర్సెంట్ న్యాయం చేసింది. రేణు పాత్ర చేసిన అమృత కూడా ఆకట్టుకుంది. ఇక శివాజిరాజా హీరో తండ్రి పాత్రలో కొత్తగా కనిపించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

చిన్న పాయింట్ నే కథగా తీసుకున్న వివేక్ ఆత్రేయా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కేవలం మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న ఈ కథను దర్శకుడు చాలా తెలివిగా ప్రెజెన్స్ చేశాడు. సినిమా అంతా చాలా నీట్ గా ఎలాంటి ట్విస్టులు గందరగోళాలు లేకుండా తెరకెక్కించాడు. సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఆకట్టుకున్నాడు. వినసొంపైన పాటలతో నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వేదరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాతో రాజ్ కందుకూరి ప్యాషన్ మరోసారి తెలుస్తుంది. పర్ఫెక్ట్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించారు.

ఓ క్యూట్ లవ్ స్టోరీతో వచ్చిన మెంటల్ మదిలో సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయా తన పనితనం చూపించాడు. మొదటి భాగం మొత్తం క్యారక్టర్ ఎస్టాబ్లిష్ తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. మన చుట్టూ జరిగే కథలా అనిపించడం అందనపు ఆకర్షణ. సినిమాలో నటీనటులు కూడా పాత్రలను ఓన్ చేసుకుని మరి నటించారు.

ఇక సినిమాలో సెకండ్ హాఫ్ కొత్త పాత్ర ఇంట్రడ్యూసింగ్.. ఇక దాని వల్ల కథలో వచ్చే మార్పులు ఓ సున్నితమైన భావోద్వేగాలతో ముగిసే క్లైమాక్స్ ఇలా మదిని తాకే ఓ పసందైన సినిమాగా మెంటల్ మదిలో వస్తుంది. కథ చెప్పుకోవడానికి గొప్పగా లేకున్నా దాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మెంటల్ మదిలో మరో పెళ్లిచూపులు అని చెప్పొచ్చు. సినిమా యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఇలాంటి కన్ ఫ్యూజన్స్ ఏమి లేకుండా వెళ్లి చూసేయొచ్చు.
Sree Vishnu, Nivetha Pethuraj,Vivek Athreya,Raj Kandukuri,Prashant R Vihariమెంటల్ మదిలో మనసుకి నచ్చే సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: