Star cast: Varun SandeshHaripriya
Producer: Laxman KyadariDirector: Koneti Srinu

Abbai Class Ammayi Mass - English Full Review

అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: చిత్రకథ 
తల్లిదండ్రులను పోగొట్టుకున్న శ్రీ(వరుణ్ సందేశ్)ని బామ్మ(శ్రీ లక్ష్మి) పెంచుతుంది చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా పెంచడంతో అమ్మాయిలంటే శ్రీలో భయం నెలకొంటుంది. ఎంత భయం అంటే అమ్మాయికి ఎప్పుడు అర కిలోమీటర్ దూరం మెయిన్ టెయిన్ చేస్తుంటాడు. ఒక ఐ టి కంపెనీ కి ఓనర్ అయిన శ్రీ కి అంజలి ప్రపోజ్ చేస్తుంది అప్పటికే లాస్ లో ఉన్న తన కంపెనీ ని కాపాడుకొనేందుకు తన కూతురు అంజలిని పెళ్లి చేసుకోవాలన్న అంజలి గ్రూప్ కంపెనీస్ ఎం డి కేకే (ఆహుతి ప్రసాద్) డీల్ కి ఒప్పుకుంటాడు. అమ్మాయిలంటే భయం పోవాలని తను ఒక అమ్మాయితో కోప్ద్ది రోజులు గదలని నిర్ణయించుకుంటాడు శ్రీ అలా శ్రీ జీవితంలోకి వేశ్య అయిన నీరు ( హరి ప్రియ ) కాంట్రాక్టు మీద ప్రవేశిస్తుంది. ఇదిలా నడుస్తుండగా దాస్ ( కాశి విశ్వనాధ్) అనే వ్యక్తి నీరు ని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ దాస్ ఎవరు, నీరు ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? శ్రీ లో అమ్మాయిలంటే భయం పోయి అంజలి ని పెళ్లి చేసుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెర మీద చూడాల్సిందే.

అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
ముందు మంచి చెప్పేసుకుందాం .. సినిమాలో ప్రధానంగా చెప్పుకోగలిగింది హరి ప్రియ నటన, ఇప్పటివరకు క్లాసు గానే కనిపించిన ఈ అమ్మాయి మాస్ ఏంటి అనుకునేవారికి తన నటన మరియు అందాల ఆరబోతతో సమాధానం చెప్పింది. వేశ్య పాత్రలో మాస్ లుక్ లో కనిపించడమే కాకుండా అభినయంలో కూడా మాస్ ని రాబట్టగలిగింది. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే అదే పాత కథ, హ్యాపీ డేస్ చిత్రం నుండి ఒకే రకమయిన నటన కనబరుస్తున్న ఈ నటుడు ఈ చిత్రంలో కూడా సేమ్ టు సేమ్ అలానే చేసాడు. శ్రీనివాస్ రెడ్డి కొన్ని సన్నివేశాలలో బాగానే నవ్వించారు. ఇక అంజలి పాత్ర చేసిన అమ్మాయి అందంగా కనిపించింది. శ్రీ లక్ష్మి, ఆహుతి ప్రసాద్ లు ఏదో ఉన్నాం అనిపించారు . కహాని చిత్రంలో ఒక పాత్రలా కనిపించే దాస్ పాత్రలో కాశీ విశ్వనాధ్ ఓకే అనిపించారు.

అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

దర్శకుడు కోనేటి శ్రీను గురించి చెప్పాలంటే పాత హాలీవుడ్ సినిమా ఒక లైన్ ఈ మధ్యనే వచ్చిన బాలీవుడ్ సినిమా నుండి మరో లైన్ తీసుకొని కొత్త లైన్ గీసాడు పోనీ ఈ లైన్ కరెక్ట్ గా ఉండాలంటే స్కేల్ లాంటి స్క్రీన్ప్లే ఉండాలి అన్న విషయాన్నీ వదిలేసి కథ చెప్పాలి ఎలా అయితే ఏంటి అన్నట్టు నడిపించారు . కథ మొదలవగానే క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడికి అర్ధం అయ్యేంత వీక్ గా ఉంది స్క్రీన్ ప్లే దర్శకత్వం విషయానికి వస్తే కథ అయితే ఉంది కాని ఇంత వీక్ స్క్రీన్ప్లే కి ఎలాంటి దర్శకత్వం అయితే ఏంటి అన్నట్టు ఉంటుంది. సాయి కృష్ణ అందించిన డైలాగ్స్ కూడా అబ్బే అంతగా ఆకట్టుకోలేదు, ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ అయితే ఎప్పుడు క్లాసుగా చేసే శేఖర్ చంద్ర డిఫరెంట్ గా మాస్ ట్రై చేశాడు అనిపించుకోడమే కాకుండా ఆకట్టుకున్నాయి కూడా అలానే నేపధ్య సంగీతం కూడా పరవాలేదనిపించాడు . కథ బాగుంది అనుకోగానే కథనం గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసారు నిర్మాతలు. చివరగా ఎడిటర్ విషయానికి ఏది కట్ చెయ్యాలో తెలియని పరిస్థితి రెండు సార్లు వస్తుంది ఒకటి అన్ని బాగున్నప్పుడు ఇంకోటి ఏది బాలేనప్పుడు ఈ చిత్ర విషయంలో ఎడిటర్ రెండవ సమస్యని ఎదుర్కున్నాడు.


అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: హైలెట్స్
  • హరిప్రియ గ్లామర్, వేశ్య పాత్రలో తన నటన
  • అక్కడక్కడా శ్రీనివాస్ రెడ్డి కామెడీ
  • పరవాలేదనిపించే పెళ్లి ఎపిసోడ్

అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: డ్రా బాక్స్
  • కథ చాలా ఊహాజనితంగా ఉంది
  • వీక్ స్క్రీన్ ప్లే
  • నో కామెడీ

అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: విశ్లేషణ

అందరిలో ఉన్నట్టు గానే నాక్కూడా ఉన్న ఒక డౌట్ ఇన్ని ఫ్లాప్ లు ఎదుర్కున్నా కూడా వరుణ్ సందేశ్ కి అవకాశాలు ఎలా వస్తున్నాయి ? ఇది పక్కన పెడితే దర్శకుడు హిందీ కహాని చిత్రంలో ఒక పాత్రని ఎంచుకొని ఒక థ్రెడ్ ఇంగ్లీష్ ప్రెట్టి వుమన్ లో ఒక పాత్రని ఎంచుకొని ఇంకొక థ్రెడ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ది రీడర్ ని తలపించేలా ఇంకొక త్రెడ్ ఇలా అచ్చం పులిహోరాల కనిపించే ఈ చిత్ర కథను ఆసక్తికరంగా చెప్పడానికి మంచి కథనం ఉండాలన్న పాయింట్ మరిచిపొయాడు . మరో నాలుగు చిత్రాలను చూసుంటే అది కూడా కరెక్ట్ గానే వచ్చి ఉండేదేమో . సినిమాలో మిగిలిన పాత్రలన్నింటిని తీసేసి వరుణ్ సందేశ్ సన్నివేశాలు మాత్రమే చూపిస్తే ఎవరు కూడా ఆ సన్నివేశాలు ఏ చిత్రంలోనిదో చెప్పలేరు . అయన కాస్ట్యుం లు అయితే మారుతున్నాయి కాని నటనలో మాత్రం ఎటువంటి మార్పు కనపడటం లేదు . దీనికి బోనస్ అన్నట్టు మధ్య మధ్యలో ఆయనకు వేరే వాళ్ళ గాత్రాన్ని అతికించారు తెర మీద కనిపిస్తున్న పాత్రలు కాకుండా మూడవ వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. మరి డబ్బింగ్ పూర్తిగా చెప్పకపోవడం అయన తప్పో లేక చెప్పించుకోలేకపోవడం నిర్మాత తప్పో కాని శిక్ష మాత్రం మనకి పడుతుంది. వేశ్య పాత్ర అనగానే ఎబ్బెట్టుగా హావభావాలను ఉంటుందని అనుకుంటాం కాని ఇందులో హరిప్రియ పాత్ర కాస్త సెన్సిటివ్ గా తీర్చి దిద్దడంతో సగటు ప్రేక్షకుడు ఎబ్బెట్టుగా ఫీల్ అవ్వడు అంతే కాక దీనికి హరిప్రియ నటన కూడా ఎంతో తోడ్పడింది . మరి భవిష్యత్తులో ఇలాంటి పాత్రలే చేస్తుందో లేదా తిరిగి క్లాసు వైపు వెళ్లిపోతుందో చూడాలి. అసలే వీక్ గా ఉన్న కథనాన్ని డైలాగ్స్ మరింత బలహీన పరిచింది. ఏం చూసి నిర్మాతలు ఈ చిత్రానికి ఇంత ఖర్చు పెట్టారా అన్న సందేహం చుసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. వరుణ్ సందేశ్ కి ఎక్కువ మంది అమ్మాయిలే ఫాన్స్ ఉండటంతో వాళ్ళు ఈ చిత్రానికి రావడం కష్టమే, ఏ సెంటర్స్ లో ఈ చిత్రం ఊసు కూడా ఉండదు,బి సెంటర్స్ లో ఇలాంటి ఒక చిత్రం ఉందని కూడా తెలిసే అవకాశం ఉండదేమో, కౌష ఐటెం సాంగ్ మరియు హరి ప్రియ అందాలు సి సెంటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చేమో మరి.


అబ్బాయి క్లాస్ ఆమ్మాయిమాస్ రివ్యూ: చివరగా
అబ్బాయి క్లాసు - అమ్మాయి మాస్ : ప్రేక్షకుడు మటాష్
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Abbayi Class Ammayi Mass | Abbayi Class Ammayi Mass Wallpapers | Abbayi Class Ammayi Mass Videos

మరింత సమాచారం తెలుసుకోండి: