పవన్ కళ్యాణ్ ,సినిమాటోగ్రఫీ ,ఇంటర్వల్ సీన్ , ప్రొడక్షన్ వాల్యూస్పవన్ కళ్యాణ్ ,సినిమాటోగ్రఫీ ,ఇంటర్వల్ సీన్ , ప్రొడక్షన్ వాల్యూస్షడెస్ ఆఫ్ హాలీవుడ్ మూవీ లార్గో వించ్ , స్క్రీన్ ప్లే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ 25వ సినిమా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ అజ్ఞాతవాసి వచ్చింది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. 

ఇక కథలోకి వెళ్తే.. కోటీశ్వరుడైన అభిజిత్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) తన తండ్రి మరణించడంతో.. తన తండ్రి చావుకి కారణమైన వారిపై పగ తీర్చుకోవడమే సినిమా కథ. దానికోసం తన తండ్రి స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు అభిజిత్ భార్గవ్. తన తండ్రి మరణానికి కారణమైన వారిని అభిజిత్ ఎలా సంహరించాడు.. తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నదే అజ్ఞాతవాసి సినిమా కథ.

పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి అజ్ఞాతవాసి ప్రూవ్ చేసింది. కథలో అభిజిత్ భార్గవ్ పాత్ర త్రివిక్రం పవన్ కోసం దాన్ని మలచిన తీరు ఆకట్టుకుంటాయి. ఇక త్రివిక్రం రాసిన డైలాగ్స్ పవన్ నోటి వెంట వస్తుంటే థియేటర్ లో క్లాప్స్ పడుతున్నాయి. పవన్ నట విశ్వరూపం చూపించాడని సింపుల్ గా చెప్పొచ్చు. సినిమా మొత్తం పవన్ తన భుజాన వేసుకుని చేశాడు. ఇక హీరోయిన్స్ కీర్తి హోంలీగా అనిపించగా.. అను ఇమ్మాన్యుయెల్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి విలనిజం బాగుంది. వర్సటైల్ యాక్ట్రెస్ కుష్బు నటన బాగుంది. తనకి పవన్ కు వచ్చే సీన్స్ బాగుంటాయి. రావు రమేష్ ఎప్పటిలానే అదరగొట్టగా.. మురళి శర్మ ఆకట్టుకున్నారు. రగుబాబు, వెన్నెల కిశోర్ కాసేపు నవ్వించేశారు.

మనికందన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేం సినిమాకు ఎంతో బాగా హెల్ప్ అయ్యింది. ఇక అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు మరో లెవల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అవగా.. బయటకొచ్చి చూస్తే, గాలివాలుగా, స్వాగతం కృష్ణా సాంగ్ ఆకట్టుకున్నాయి. ఇక కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇక త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి ఎప్పుడు మంచి సినిమాలే వస్తాయని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రచయిత, దర్శకుడిగా త్రివిక్రం ఎప్పుడు ఫెయిల్ అయ్యింది లేదు. జల్సా, అత్తరింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి త్రివిక్రం దర్శకత్వ స్టాండర్డ్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాయి.

అజ్ఞాతవాసి అంటూ తండ్రి మరణానికి కారణమైన వారి పనిపడుతూ.. కుటుంబాన్ని దగ్గర చేసే ప్రయత్నంతో ఈ సినిమా కథ రాసుకున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. పర్ఫెక్ట్ కథతో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ కాంబోలో వచ్చిన సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మొదటి భాగం మొత్తం కూల్ ఎంటర్టైనింగ్ గా సాగగా.. సెకండ్ హాఫ్ అసలు కథ నడుస్తుంది.

అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయినా సరే త్రివిక్రం తన డైలాగ్స్ తో నిలబెట్టాడని చెప్పొచ్చు. సందర్భం దొరికితే తన పెన్ పవర్ ఏంటో చూపించే త్రివిక్రం అజ్ఞాతవాసితో మరోసారి తన అస్త్రాన్ని సంధించాడు. పవన్ త్రివిక్రం పర్ఫెక్ట్ కాంబోలో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా సినిమా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

అయితే సగటు సిని అభిమానులకు నచ్చే అంశాలతో పాటు అక్కడక్కడ కాస్త నరేషన్ విషయంలో డ్రా బ్యాక్ అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా పక్కా పైసా వసూల్ మూవీ.. మంచి కథ కథనాలతో వచ్చి అలరించింది.
Pawan Kalyan,Keerthy Suresh,Anu Emmanuel,Trivikram Srinivas,S. Radha Krishna,Anirudh Ravichanderపవన్ త్రివిక్రం అజ్ఞాతవాసి.. అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: