సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్స్క్రీన్ ప్లే , మ్యూజిక్ , డైలాగ్స్

ఉల్లాస్ (సునీల్)ఈజీగా మనీ సంపాదించాలనుకునే మనిషి. తన చిన్ననాటి స్నేహితురాలైన లయ (మనిషా రాజ్) ను పెళ్లి చేసుకుంటాడు ఉల్లాస్. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అవిటి అమ్మాయిని చేసుకోవాలనుకున్న ఉల్లాస్ పరిస్థితుల కారణంగా లయను చేసుకుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే ఆలోచనలో ఉన్న ఉల్లాస్ కు లయతో గొడవ అవుతుంది. ఇంతకీ ఉల్లాస్ లయలకు ఎందుకు గొడవ అయ్యింది..? చివరకు ఈ ఇద్దరు కలిశారా లేదా అన్నది సినిమా కథ. 

సునీల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే కథ కథనాల్లో దమ్ము లేకపోవడంతో సినిమా మళ్లీ సునీల్ కు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. మనిషా రాజ్ నటన పర్వాలేదు. సంజన గర్లాని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. షయాజి షిండే, సితారా, దేవి గిల్ పాత్రలు పరిధి మేరకు నటించారు. 

రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించగా.. ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సినిమా దర్శకుడు ఎన్.శంకర్ అన్నివిధాలుగా ఫెయిల్ అయ్యాడు.  కన్నడలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ సినిమా తెలుగులో అంత మంచి అవుట్ పుట్ వచ్చేలా తీయలేదు. గోపి సుందర్ తెలుగు సినిమాల్లో మంచి ట్రాక్ ఉంది. కాని ఈ సినిమాకు ఆయన కూడా ఎందుకో మంచి ట్యూస్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి. 

దర్శకుడు ఎన్.శంకర్ కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో తెరకెక్కించారు. ఆల్రెడీ ఫ్లాపులతో సతమతమవుతున్న సునీల్ కు ఈ సినిమా నిరాశ పరచిందని చెప్పొచ్చు. కామెడీ సినిమాగా కన్నడలో రికార్డులు సృష్టించిన 2 కంట్రీస్ తెలుగులో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అంత ప్రభావితం చూపించలేదు.

సినిమా ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. జై బోలో తెలంగాణా తర్వాత 6 సంవత్సరాల గ్యాప్ తో వచ్చిన 2 కంట్రీస్ ఆడియెన్స్ సహనానికి పరిక్ష పెడుతుందని చెప్పొచ్చు. పూర్ టెక్నికల్ ఎఫర్ట్ తో వచ్చిన 2 కంట్రీస్ పూర్తిగా నిరాశ పరచిందని చెప్పొచ్చు. అక్కడక్కడ కాసిన్ని నవ్వులను నింపినా సునీల్ ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ అంతగా వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి. 
Sunil,Manisha Raj,N.Shankar,Gopi Sundarసునీల్ మరో విఫలప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: