Star cast: Sai Ram ShankarEster Noronha
Producer: P SuneetaDirector: Teja

1000 Abaddalu - English Full Review


1000 అబద్ధాలు రివ్యూ
: చిత్రకథ
 
ఒక సత్య (సాయిరామ్ శంకర్) మరో సత్య (ఎస్తర్) తో ప్రేమలో పడతాడు, కానీ ఎస్తర్ కి సామ్రాట్ తో ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోతుంది. సాయిరామ్ శంకర్ నానా తిప్పలు పడి ఎస్తేర్ ని ఇంప్రెస్ చేయగలుగుతాడు. కానీ టవర్ స్టార్ ఫాన్ ఆఫ్ పవర్ స్టార్ (నాగబాబు) హీరో-హీరోయిన్ ల మధ్య కు ఎంటర్ అవుతాడు. కథ ఈ రకంగా నానా భీభత్సంగా నడుస్తూండగా ఎస్తర్ స్నేహితురాలు స్వాతి మినిస్టర్ తనని మానభంగం చేశాడన్నకారణంగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్తెర్ తన స్నేహితురాలి చావుకు కారణాన్ని బయటపెట్టాలనుకుంటుంది. దీనికోసం సాయిరాంశంకర్ సహాయం అడుగుతుంది.

1000 అబద్ధాలు రివ్యూ: నటీనటుల ప్రతిభ
ఈ-టీవి, జబర్దస్త్ లో నుండి తీసుకొచ్చి హీరో ఫ్రేండ్స్గ్ గా పెట్టిన గ్యాంగ్ జబర్దస్త్ గా చెయ్యడానికి తయ్యారుగా ఉన్నా కూడా స్క్రిప్ట్ లో విషయం లేక కామ్ గా ఉండిపోయారు.

సాయిరామ్ శంకర్ నటన బాగానే మెరుగయ్యింది, తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడనే చెప్పుకోవాలి. హీరోయిన్ ఎస్తేర్ మాత్రం నవ్వుడం అయినా ఏడుపైనా ఒక్కటే భావాన్ని పలికించే గాజు బొమ్మ మాదిరి హీరో పడుతున్న కష్టాన్ని గంగపాలు చేసింది. నవీన్ - వేణు కామెడీ పండించ గలిగారు. నాగబాబు పెద్ద తరహాలో ఉంటూనే హాస్యాన్ని పలికించ గలిగారు. జోష్ రవి, బాబు మోహన్ ఫర్వాలేదనిపించారు. విలన్ గా గౌతమ్ రాజు అంత బాగోలేదు.


1000 అబద్ధాలు రివ్యూ: హైలెట్స్
  • నాగబాబు
  • తమ్ముడు నవీన్ల మధ్య కామెడీ సీన్లు
  • సినిమాటోగ్రఫీ

1000 అబద్ధాలు రివ్యూ: డ్రా బాక్స్
  • స్క్రీన్ ప్లే
  • పాటలు
  • కొరియోగ్రఫీ
  • సెకండ్ హాఫ్

1000 అబద్ధాలు రివ్యూ: విశ్లేషణ

1000 అబద్దాలు సినిమాలో ఉన్న ట్విస్టుల కంటే సినిమా మొదలు పెట్టిన దగ్గర్నుండి రిలీజ్ చేసే వరకు ఉన్న ట్విస్టులే ఎక్కువ. హీరోగా స్ట్రగుల్ అవుతున్న సాయిరామ్ శంకర్ కి దర్శకుడిగా తెరమరుగయిన తేజ కి చాలా ముఖ్య మయిన సినిమా ఇది. తేజ చాలా క్రియేటీవ్ డైరెక్టర్.. కానీ క్రియేటివిటీ ఒక్కటే సినిమాను బతికించలేదు. మంచి కథ కూడా ఎంతయినా అవసరం. నీకూ-నాకు డాష్..డాష్ ఫెయిల్యూర్ కి కూడా బలమయిన కథ లేకపోవడమే కారణం. సాయిరామ్ శంకర్ నటన పర్వాలేదనిపించినా, జబర్దస్త్ గ్యాంగ్ కామోడీ చేసినా అక్కడక్కడ నవ్వించగలిగినా ఆసక్తి కరమయిన కథ.. ఆకట్టుకునే విధంగా ఆ కథను ప్రజెంట్ చేయలేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ 1000 అబద్దాలు సినిమా ఫస్ట్-హాఫ్ పరవాలేదనిపించినా విశ్రాంతికి ముందు వచ్చే బ్లాకు కూడా ఓకే. కానీ సెకండ్ ఆఫ్ మొత్తానికి కంప్లెట్ డిసాస్టర్. వెయ్యి అబద్దాలు అనే ఇటువంటి సున్నతమయిన కథను సెలక్ట్ చేసిన తేజ, కథనం విషయంలో శ్రద్ధ పెట్టి వున్నా.. సామాన్య ప్రేక్షకులు కథలో ఉన్న పాత్రలతో తమని ఉహించుకోగలిగేటటువంటి ఫీల్ తీసుకురాగలిగినా వెయ్యి అబద్దాలు సినిమా ఫలితం వేరే విధంగా ఉండేది.


1000 అబద్ధాలు రివ్యూ: చివరగా
క్రియేటివిలీ ఒక్కటే కూడెట్టదు.
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on 1000 Abaddalu | 1000 Abaddalu Wallpapers | 1000 Abaddalu Videos

మరింత సమాచారం తెలుసుకోండి: