Star cast: SrinivasSupraja
Producer: Sohail AnsariDirector: Sajid Qureshi

Pusthakamlo Konni Pageelu Missing - English Full Review

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ:చిత్రకథ 

విజయ్ కుమార్(శ్రీ), సలీం(మస్త్ అలీ), శివ, బాలాజీ చాలా మంచి ఫ్రెండ్స్. ప్రేమంటే అంతగా నమ్మకంలేని విజయ్ సంధ్య(సుప్రజ)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట ఒప్పుకోని సంధ్య కొద్ది రోజులకి శ్రీ ప్రేమని అంగీకరిస్తుంది. సంధ్య శ్రీ ప్రేమని అంగీకరించినా పెద్ద వాళ్ళు మాత్రం వీరి పెళ్ళికి ఒప్పుకోరు. ఏదో కాళ్ళా వేలా పడితే ఇద్దరి కుటుంబ పెద్దలు పెళ్ళికి ఒప్పుకుంటారు. రేపు పెళ్లి అనగా ఈ రోజు హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా క్రికెట్ ఆడతాడు. అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. క్రికెట్ ఆడుతూ కింద పడ్డ విజయ్ కి తల బ్యాక్ సైడ్ చిన్న దెబ్బ తగులుతుంది. దాని వల్ల విజయ్ టెంపరరీ మెమరీ లాస్ అవడంతో ఆ రోజు నుంచి గత సంవత్సరం రోజులుగా ఏమి జరిగిందనేది మరిచిపోతాడు. దాంతో ఏమిచెయ్యాలో అర్థం కాని ఫ్రెండ్స్ ఎలాగోలా విజయ్ పెళ్లి చేసెయ్యాలి అనుకుంటారు. అక్కడి నుండి విజయ్ పెళ్ళి చేయడానికి తన ముగ్గురు ఫ్రెండ్స్ ఎదుర్కొన్న సమస్యలేమిటి? టెంపరరీ మెమొరీ లాస్ వల్ల విజయ్ ఫ్రెండ్స్ ని ఎలా టార్చర్ చేసాడు? ఇంత టార్చర్ ని అనుభవించిన ఫ్రెండ్స్ చివరికి విజయ్ - సంధ్యకి పెళ్ళి చేయగలిగారా? లేదా? విజయ్ కి తన గతం ఎప్పటికి గుర్తొచ్చింది? అనే అంశాలు తెరపైనే చూడాలి

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: నటీనటుల ప్రతిభ

మెమరీ లాస్ ఉన్న కథానాయకుడి పాత్రలో శ్రీ, విజయ్ సేతుపతి స్థాయికి కాకపోయినా ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. సుప్రజా పాత్రా ఉన్నదీ కొద్ది సేపే అయినా పాత్రా ఉన్నంతవరకు తను ఉన్నాను అనిపించేలా నటించింది.  సలీం పాత్రలో నటించిన మస్త్ అలీ తన డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. అతని ప్పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. అయోమయంగా  పాత్రను పోషించిన నటుడు కూడా చాలా బాగా నటించారు. డాక్టర్ పాత్రలో రఘుబాబు కాసేపు నవ్వించారు శివ పాత్రా పోశిన నటుడు పరవాలేదనిపించాడు. మిగిలిన పత్రాలు అన్ని అలా వచ్చి ఇలా వెల్లిపోతుంటాయి ...

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

తమిళ చిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర మూలకతను కదపకుండా దర్శకుడు మంచి పని చేశాడు అంతే కాకుండా అతను చేసిన చిన్న చిన్న మార్పులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మర్తినో జో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అలానే గున్వాంత్ అందించిన సంగీతం చాలా బాగుంది నేపధ్య సంగీతం సన్నివేశాలకు బలం కూర్చాయి. గిరీష్ కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి ఎడిటర్ మరింత శ్రద్ద పెట్టున్దల్సింది . నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు.

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: హైలెట్స్
  • డైరెక్టర్ సాజిద్ ఖురేషి టేకింగ్
  • గున్వంత్ మ్యూజిక్ మరియు మార్టిన్ జో సినిమాటోగ్రఫీ
  • క్రికెట్ మరియు రిసెప్చన్ ఎపిసోడ్స్ లో సూపర్బ్ హైలైట్స్
  • సరదాగా', 'అయ్యోరామారే' పాటల్లో సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి
పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: డ్రా బాక్స్
  • మాస్ ని మెప్పించే అంశాలు ఏమీ లేవు
  • రిపీటెడ్ సీన్స్

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: విశ్లేషణ

తమిళ చిత్రాలను డబ్బింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న తరుణంలో ఒక తమిళ చిత్ర రైట్స్ కొనుక్కొని తెలుగులో రీమేక్ చెయ్యడం అనేది నిజంగా ధైర్యంతో కూడుకున్న పని, ఎందుకంటే అక్కడ మార్కెట్ ఇక్కడకి విస్తరిస్తున్న కొద్దీ అక్కడ చిత్రాలు ఇక్కడి వాళ్ళకు దగ్గర అయిపోయాయి అలానే "నడువుల కొంజెం పక్కత కానుం" చిత్రం కూడా చాలా మంది ప్రేక్షకులకు పరిచయమే ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు  విజయ్ సేతుపతి స్థానంలో శ్రీ అనగానే ఆశలు వదిలేసుకున్నారు ఎందుకంటే విజయ్ సేతుపతి నటన ఆ స్థాయిలో ఉంటుంది సంతోషకరమయిన విషయం ఏంటంటే ఆ స్థాయికి చెయ్యకపోయినా శ్రీ ఈ పాత్రకు న్యాయం చేసాడనే చెప్పుకోవాలి. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే రీమేకే కదా అక్కడ ఉండేది ఇక్కడ తీసేస్తే సరిపోతుంది అని "రిస్క్ లెస్ " జాబు ఎంచుకోకుండా ఏదో కొట్టగా చూపించాలన్న ప్రయత్నం కనబడింది మూల కథను టచ్ చెయ్యకుండా మార్చారు కాబట్టి సరిగ్గా సరిపోయింది.  మొదటి చిత్రాన్నే ఈ స్థాయిలో హేండిల్ చేయ్యగాలిగాదంటే దర్శకుడిలో విషయం ఉందని తెలిసిపోతుంది.  తమిళ చిత్రంతో దీన్ని పోలిస్తే జస్ట్ పాస్ మార్కులు మాత్రమే సంపాదించుకుంటుంది కాని ఇంకా చాలా వాటిలో మెరుగ్గా ఉండాల్సింది కాని తమిళ చిత్రాల డబ్బింగ్ కన్నా ఇలా రీమేక్ చెయ్యడం నూతన విధానానికి శ్రీకారం చుడుతుంది కాని రాబోయే చిత్రాలు అయినా మాతృక ల స్థాయిలో ఉండేలా దర్శకులు జాగ్రత్త వహించాలి తమిళ చిత్రంలో అసలు పాటలే లేవు ఇందులో పాటలను దర్శకుడు చకకాక్యంగా ఇరికించాడు . చిత్రం ఆద్యంతం బాగున్నట్టే ఉంటుంది కాని ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది.  ఇలాంటి వైవిధ్యమయిన కాన్సెప్ట్ లను డీల్ చెయ్యడంలో తెలుగు దర్శకులు ఇంకా మెరుగుపడాలి అన్న అంశాన్ని ఈ చిత్రం నిరూపించింది . మీకు తమిళం అర్ధం అయితే "నడువుల కొంజెం పక్కత కానుం" చూడండి అర్ధం కాకపోతే ముందు ఈ చిత్రాన్ని చూసి మిస్ అవ్వకుండా ఆ చిత్రాన్ని చుడండి.....


పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ రివ్యూ: చివరగా
పుస్తకంలో కొన్ని పేజీలు  మిస్సింగ్ - చిత్రంలో కూడా ఏదో మిస్సింగ్ ..... 
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

మరింత సమాచారం తెలుసుకోండి: