Star cast: Pawan KalyanSamanthaPranitha
Producer: BVSN PrasadDirector: Trivikram Srinivas

Attarintiki Daredi - English Full Review

అత్తారింటికి దారేది రివ్యూ: చిత్రకథ 
విదేశాల్లో పెద్ద బిజినెస్ మాగ్నెట్ రఘునందన్ (బోమన్ ఇరానీ), అయన మనవడు గౌతం నంద (పవన్ కళ్యాణ్) . శేకర్ (రావు రమేష్)ను ప్రేమ పెళ్లి చేసుకొందని తన కూతురు సునంద (నదియ) ని ఇంట్లో నుండి తరిమేస్తాడు రఘునందన్ పాతికేళ్ళ తరువాత తనకి తన కూతురిని తెచ్చి పెట్టమని రఘునందన్, గౌతం నంద ని అడుగుతారు. తాత కోరికను నేరవర్చడానికి ఇండియా బయలుదేరిన గౌతం , సునంద ఇంట్లో సిద్దార్థ్ గా డ్రైవర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ నుండి అత్తయ్యని ఒప్పించడానికి గౌతం చేసిన ప్రయత్నాలు, ఈ మధ్యలో శశి (సమంత) మరియు గౌతం ల మధ్య ప్రేమ మిగిలిన కథ.

అత్తారింటికి దారేది రివ్యూ: నటీనటుల ప్రతిభ
పవన్ కళ్యాణ్ పేరులో ఉన్నట్టుగానే అయన నటనలో కూడా పవర్ ఉంది ఈ సినిమాలో అయన పవర్ ప్రతి సీన్ లో కనిపిస్తుంది. మొత్తం చిత్రాన్ని అయన భుజాల మీద మోసారు. అయన పవర్ కి పక్కన నటులు ఎవరూ కనపడరు అని తెలిసినా ప్రతి నటుడు వందశాతం తమా తమ పాత్రలకు న్యాయం చేశారు చిత్రంలో కీలక పాత్ర అయిన నదియ చాలా బాగా నటించారు. బోమన్ ఇరాని, రావు రమేష్, అలీ , బ్రహ్మానందం,సమంత , ప్రణీత ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరు వారి పాత్రలకు న్యాయం చేశారు. నదియ మరియు పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చే సన్నివేశాలలో వారి నటన సింప్లీ సూపర్బ్.. ఎవరి నటనలో లోపం లేదు కోట శ్రీనివాస్ రావు , బోమన్ ఇరానీ మరియు ముఖేష్ రుషి లాంటి నటులను ఇంకాస్త ఉపయోగించి ఉంటె బాగుండేది.

అత్తారింటికి దారేది రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

కథ కథనం మాటలు దర్శకత్వం త్రివిక్రమ్ , తెర ముందు పవర్ పవన్ కళ్యాణ్ అయితే తెర వెనుక పవర్ త్రివిక్రమ్, కొన్ని సన్నివేశాలలో ప్రాస కోసం అనవసర ప్రయాస పడినా కీలక సన్నివేశాలలో అయన రచించిన డైలాగ్స్ "అద్భుతం". "ఎక్కడ నెగ్గాలొ కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే గొప్పోడు " ఇది మచ్చుక్కి ఒక్కటి ఇలాంటి చాలానే ఉన్నాయి. రెండవ అర్ధ భాగంలో కొన్ని చోట్ల అకస్మాతుగా వేగం పడిపోవడం వెంటనే పుంజుకోవడం జరుగుతుంది ఇక్కడ కాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. కెమరామెన్ పని తనం చాలా చోట్ల బాగున్న కొన్ని చోట్ల బాలేదు మొత్తం మీద ఒకేకి ఎక్కువ సూపర్బ్ కి తక్కువ అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ పేస్ విషయంలో ఎడిటర్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది మొత్తం మీద ఈయన పనితనం కూడా చాలా బాగుంది. ఈ విభాగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీటర్ హెయిన్స్, మొదటి ఫైట్ స్టైలిష్ గా ఉన్న అంతగా ఆకట్టుకోలేదు కాని మిగిలిన ఫైట్ లు గాల్లో ఎగిరే ఫైట్ లా కాకుండా పవన్ లో స్టామిన చుపెట్టేలా ఉన్నాయి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రతి టెక్నీషియన్ సూపర్బ్ ఔట్పుట్ ఇవ్వాలి. ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు(దాదాపుగా ఇచ్చారు కూడా).


అత్తారింటికి దారేది రివ్యూ: హైలెట్స్
  • పవన్ కళ్యాణ్
  • కథ కథనం
  • కామెడీ
  • ఇంకా చాలా....

అత్తారింటికి దారేది రివ్యూ: డ్రా బాక్స్
  • పైరసి (పెద్ద మైనస్)
  • త్రివిక్రమ్ బలం అయిన డైలాగ్స్ లో అక్కడక్కడ కాస్త బలం తగ్గడం
  • రెండవ అర్ధ భాగంలో అక్కడక్కడ పేస్ పడిపోవడం

అత్తారింటికి దారేది రివ్యూ: విశ్లేషణ

పవర్ స్టార్ సినిమా అనగానే పండగ లాంటిది, అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చెయ్యడం అంటే పెద్ద పండగే. విజయం దక్కాలంటే కష్టపడాలి లేదా ఇష్టపడాలి ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరు ఇష్టపడి కష్టపడి పని చేశారు ప్రతి విభాగంలో అవుట్ పుట్ టాప్ నాచ్ లో ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ పోతే పేజీలు నిండిపోవడమే కాని పుల్ స్టాప్ ఉండదు అంత రాయచ్చు. ఫుల్ ఎనర్జీ తో ప్రతి సీన్ లో నటించారు ఇక పతాక సన్నివేశం అయితే పతాక స్థాయి నటన కనబరిచారు, తొలి ప్రేమ క్లైమాక్స్ సన్నివేశాన్ని గుర్తు చేశారు. కరెక్టే త్రివి గత చిత్రాలలా ఇందులో లాజిక్స్ ఉండవు ఓన్లీ ఎంటర్ టైన్మెంట్. ఈ చిత్ర కథ కూడా కొత్తది ఎం కాదు గతంలో చాలా చిత్రాలను చూసాం కాని ఇందులో అదే కథను చెప్పిన విధానంలో త్రివిక్రమ్ తన శైలిని నిరూపించుకున్నారు. ఇకపోతే సమంత ఆడియో వేదిక మీద అన్నట్టుగానే "పక్కన పవర్ స్టార్ ఉంటె చుట్టూ పక్కల ఎవరున్నా కనపడరు" ఈ చిత్రం లో కూడా అందరి నటులు పవన్ పవర్ కి జస్ట్ సపోర్ట్ గా మిగిలిపోయారు. 'నిన్ను చూడగానే' సాంగ్ మరియు 'కాటమరాయుడా' సాంగ్ చిత్రానికి హైలెట్. ఎం చెప్పాలి ఎంత చెప్పాలి పవన్ ఫాన్స్ కి ఇది పెద్ద పండగ లాంటి సినిమా అయితే ఫ్యామిలీ లకు బెస్ట్ ఆప్షన్. ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ పైరసీ కాని కంటెంట్ ఉన్న సినిమాని పైరసీ ఎం చెయ్యగలదు .... పండగలాంటి ఈ సినిమాని పైరసీలో చూడటం కన్నా థియేటర్ లో చూస్తే ఎక్కువ ఆనందిస్తారు. నా సలహా త్రివిక్రమ్ ఫ్యాన్ అయిన కాకపోయినా పవన్ ఫ్యాన్ అయినా కాకపోయినా ఈ చిత్రాన్ని తప్పక చుడండి ఎన్నో రోజుల నుండి సరయిన చిత్రం కోసం దాహంతో ఎదురు చూస్తున్న మీకు ఈ చిత్రం పెప్సీ తాగినంత కిక్ ఇస్తుంది.

చివరగా
అత్తారింటికి దారేది?- రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే బ్లాక్ బస్టర్ కి పక్కన...
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Attarintiki Daredi | Attarintiki Daredi Wallpapers | Attarintiki Daredi Videos

మరింత సమాచారం తెలుసుకోండి: