Star cast: Manoj ManchuSakshi ChowdharySimran Kaur Mundi
Producer: Sireesha LagadapatiDirector: Pavan Wadeyar

Potugadu - English Full Review

పోటుగాడు రివ్యూ: చిత్రకథ 
ఒక మంచి ప్లేస్ వెతుక్కొని అక్కడ ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు గోవిందు (మంచు మనోజ్) అదే ప్లేస్ కి అదే కారణంతో వస్తాడు వెంకటరత్నం(పోసాని కృష్ణ మురళి). అక్కడ ఎలాగు చనిపోతున్నాం కదా అని వాళ్ళు ఎందుకు చనిపోవలనుకున్నారో ఒకరికిఒకరు చెప్పుకోవడం పెడతారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోవాలని అనుకుంటున్నా అని వెంకట రత్నం చెప్పగా గోవిందు కూడా అదే కారణంతో చనిపోవలనుకున్నాడని చెప్తాడు కాని గోవిందుకి నాలుగు ప్రేమ కథలు ఉండటంతో ఒక్కో ప్రేమకథ గురించి చెప్పడం పెడతాడు. మొదటి ప్రేమ కథ బ్రాహ్మణ అమ్మాయి వైదేహి (సిమ్రాన్ కౌర్ ముండి), తన నుండి విడిపోయాక రెండవ లవ్ ట్రాక్ ముంతాజ్(సాక్షి చౌదరి), తన నుండి కూడా విడిపోయాక మూడవ ప్రేమ కథ స్టేసీ (రేచల్) చివరగా మేరి (అనుప్రియ) ఇలా ఒక్కో ప్రేమ కథ చెప్పుకుంటూ ఎందుకు విడిపోవలసి వచ్చింది అని చెప్పడమే ఈ చిత్ర కథ. ఎందుకు విడిపోయారు ? అసలు గోవిందు చనిపోయాడా లేదా ? అన్న సందేహాలుంటే సినిమా చూడండి.

పోటుగాడు రివ్యూ: నటీనటుల ప్రతిభ
ప్రస్తుత హీరోలలో కష్టపడి చేసే హీరోల లిస్టులో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటాడు కాని అయన చాలా కష్టపడి పది సినిమాలకి సరిపడా నటన ఒకే సినిమాలో చూపించేశారు. కాని అయన చేసిన స్టంట్స్ కొన్ని సన్నివేశాల్లో అయన మార్క్ డైలాగ్ డెలివరి తో ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణ మురళి చిత్రంలో అప్పుడప్పుడే కనిపించినా తనదయిన టైమింగ్ తో థియేటర్ లో నవ్వులు పూయించాడు . కథానాయికలుగా నటించిన సిమ్రాన్, సాక్షి , రేచల్ మరియు అనుప్రియ చిన్న చిన్న పాత్రలే కాబట్టి పాత్రకు తగ్గట్టుగా నటించారు. మిగిలిన పత్రాలు అల వచ్చి ఇలా వెళ్ళిపోయాయి.

పోటుగాడు రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

రీమేక్ చిత్రం కాబట్టి కథ గురించి మాట్లాడుకోవడం అనవసరం, కథనం మొదటి అర్ధ భాగంలో పరిగెత్తింది రెండవ అర్ధ భాగం కి వచ్చేసరికి అలసిపోయి కదలడమే కష్టం గా కదిలింది. దర్శకత్వం బాగానే ఉంది కాని మనోజ్ బాబుని కూడా డైరెక్టరే డైరెక్ట్ చేసుంటే బాగుండేది. వీటి మూడింటిని వడియార్ హేండిల్ చేసారు. ఇక డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన 'ఇప్పటికయినా' (ప్లీజ్) ప్రాస వెనక పరిగెట్టడం మానేసి భావత్మకమయిన సంభాషణలు రచిస్తే బాగుంటుంది. ఈ చిత్రానికి మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫీ లొకేషన్లను మరియు కథానాయికలను చాలా అందంగా చూపించారు. అచ్చు అందించిన సంగీతం వినడానికే కాకుండా తెర మీద చూడటానికి కూడా బాగుంది. సెకండ్ హాఫ్ కి కూడా ఎడిటర్ ని హైర్ చేసుకొని ఉంటె బాగుండేది... ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో లగడపాటి శ్రీదర్ ఎక్కడ వెనుకంజ వెయ్యలేదు అనిపించేలా తెరకెక్కించారు.


పోటుగాడు రివ్యూ: హైలెట్స్
  • అచ్చు సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • పాటల చిత్రీకరణ
  • ఫస్ట్ హాఫ్

పోటుగాడు రివ్యూ: డ్రా బాక్స్
  • చాలా సన్నివేశాలలో మనోజ్ నటన
  • రెండవ అర్ధ భాగం స్క్రీన్ ప్లే
  • పాత్రలను సరిగ్గా ఎలివేట్ చెయ్యకపోవడం

పోటుగాడు రివ్యూ: విశ్లేషణ

సినిమాలో విభిన్నంగా కనిపించడానికి, విభిన్నంగా చూపించడానికి కష్టపడటంలో మనోజ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు కాని సమస్య మొత్తం నటనతోనే వచ్చింది పాతిక రూపాయల సన్నివేశానికి పదివేల రూపాయల నటన చూపించడంతో ప్రేక్షకుడు అసహనానికి గురవ్వడం ఖాయం. అల అని ఆయనకు నటన రాదూ అని కాదు తనకి వచ్చు అని చూపించుకోవడానికి కాస్త "ఎక్కువ" గా నటించేస్తారు. నిజానికి మాములుగా నటించి ఉంటె బాగుంది అనిపించుకునే ఈ సినిమా "అతి" జాగ్రత్తగా నటించి ఆ స్థాయికి చేరుకోనివ్వుండా చేసేసాడు మనోజ్. పోనీ పూర్తిగా అలానే అంటే మధ్య మధ్యలో అయన చేసిన రిస్కీ స్టంట్స్ చూస్తుంటే అతను పడ్డ కష్టం తెలిసిపోతుంది. ఇకనయిన మనోజ్ గారు నటనకి లిమిట్స్ పెట్టుకొని నటించడం ఇమిటేషన్ తగ్గించడం వంటివి చేస్తే మంచిది . కథానాయికలు అందరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి ఒక్కరికి కూడా తెలుగు రాదు కాబట్టి అందరు డైలాగ్ డెలివరీ వద్ద తడబడ్డారు, అందరికి ఒక పాట రెండు సన్నివేశాలు అన్నట్టుగా విభజించేయడం వలన ఎవరు పెద్దగా టాలెంట్ చూపించేసుకోవాలన్న ప్రయత్నం చెయ్యలేదు. రేచల్ అయితే ఇంకాస్త ముందుకెళ్ళి అందాలను చూపించింది. ఈ సదరు రేచల్ అనే పాత్ర చిత్ర నిడివి పెంచడానికి మరియు అందాల ఆరబోతకు మాత్రమే అన్నట్టు ఉంటుంది. చిత్రం మొత్తం మనోజ్ మాత్రమే కనిపిస్తాడు అందుకు తగ్గట్టుగానే చాలా పాత్రలను ముగించకుండా వదిలేసారు. మనోజ్ గారు మోహన్ బాబు గారి యాక్టింగ్ చూడాలనుకుంటే అయన సినిమాలనే చూస్తాం కదా మీరు ప్రతి సినిమాలో ఆయనలా నటించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? .. అని ఏ ప్రేక్షకుడికయినా అడగాలనిపిస్తుంది. మొత్తంగా తీసుకుంటే మొదటి అర్ధ భాగం పరవాలేదనిపిస్తుంది రెండవ అర్ధ భాగం బాగా నెమ్మదించడమే కాకుండా చివర్లో చిరాకు పుట్టిస్తుంది. మంచు మనోజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రం పరవాలేదనే అనిపిస్తుంది. మంచు మనోజ్ ఫాన్స్ అయితే ఒకసారి చూడచ్చు లేదంటే లైట్ తీస్కోండి.


పోటుగాడు రివ్యూ: చివరగా
పోటుగాడు - తల'పోటు' గాడు
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Potugadu | Potugadu Wallpapers | Potugadu Videos

మరింత సమాచారం తెలుసుకోండి: