ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఫస్ట్ హాఫ్ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఫస్ట్ హాఫ్సెకండ్ హాఫ్, ఓల్డ్ ఫార్మట్ స్టొరీ హైదరాబాద్ లో కాలేజీ లో చదువుకునే ఒక సాదాసీదా స్టూడెంట్ నందు(ఎన్టీఆర్) అక్షర (సమంత ) ను చూడగానే ప్రేమిస్తాడు. అక్షరని ప్రేమలో దించడానికి నందు పలు రకాలుగా ప్రయత్నిస్తూ అక్షరను ఆట పట్టిస్తూ ఉంటాడు. అలానే అక్షర అక్క పెళ్లికి వెళ్ళిన నందులోని కొత్త కోణం బయట పెడతాడు , నందు కి అక్షర తండ్రి అయిన నాగ భూషణం (ముఖేష్ రుషి). మరియు అమ్ములు (శృతి హాసన్) కి ఉన్న సంబంధం ఏంటి? బిక్షపతి ని నందు ఎందుకు చంపాలి అనుకుంటాడు ? అక్షర నందుని ప్రేమిస్తుందా లేదా ? అనే అంశాలు తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో థియేటర్ కి వెళ్ళిపొండి.ఎన్టీఆర్ ఈ చిత్రం లో ఈ పేరు లేకపోతే ఇంకేం లేదు అనిపిస్తుంది అంటే అయన నటన ఎలా ఉందో ఊహించేయవచ్చు గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అయన టైమింగ్, గ్రేస్ ఇంకా స్టైల్ సూపర్బ్ అనిపిస్తాయి. కొత్త రకమయిన ఎన్టీఆర్ ని ఈ చిత్రం లో చూడవచ్చు. సమంత ఉన్నంతలో బాగా నటించింది. శ్రుతి హసన్ పరవాలేదనిపించింది. రావు రమేష్ తనదయిన శైలిలో మెప్పించారు. విలన్ పాత్రలో రవి శంకర్ చాలా బాగా నటించారు. ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి తెర మీద హాజరు వేయించుకున్నారు... మిగిలిన నటులు తెర మీద కనిపిస్తున్నా కూడా అబ్సేంట్ అనే చెప్పాలి.దర్శకుడిగా హరీష్ శంకర్ పాస్ అయిపోయాడు కాని కథ కథనం విషయం వచ్చేసరికి కన్ఫ్యుస్ అయిపోయాడు.వేగ్నేశ మరియు రమేష్ అందించిన కథనం ఫస్ట్ హాఫ్ లో పరిగెత్తినా రెండవ అర్ధం వచ్చేసరికి రెస్ట్ తీసుకుంది. హరీష్ అందించిన డైలాగ్ బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే అయన పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయారు. సినిమాటోగ్రాఫర్ చాలా అందంగా చిత్రీకరించారు ముఖ్యంగా జాబిలి పాట చిత్రీకరణ చిత్రానికే హైలైట్. సన్నివేశాల పొడవు ఎక్కువయ్యింది అనుకున్నారేమో ఎడిటర్ రెండవ అర్ధ భాగంలో ఏ సన్నివేశం సరిగ్గా ముగించలేదు. మొదటి అర్ధ భాగంలో ఈయన పనితనం చాలా బాగుంది. రెండు పాటల్లో ఎన్టీఆర్ డాన్సు బాగుంది . ఒక ఫైట్ బాగుంది. తమన్ అందించిన పాటల్లో రెండు తెర మీద బాగుండగా నేపధ్య సంగీతం "అక్కడక్కడ" మాత్రమే బాగుంది.ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకోవాలన్నా మనకి దొరికే ఏకైక పాయింట్ ఎన్టీఆర్ , ఇప్పటి వరకు ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ మరియు డాన్స్ ఈ చిత్రంతో అయన అందం, స్టైల్ కూడా జత చేసుకొని ఒక కంప్లీట్ ప్యాకేజ్ ల తయారయ్యారు. మాములుగా ఏ హీరో అయిన చిత్రాన్ని భుజాల మీద వేసుకొని నడిపించారు అంటారు ఈ చిత్రం విషయంలో మునిగిపోతున్న చిత్రాన్ని ఎన్టీఆర్ నెత్తిన పెట్టుకొని ఒడ్డుకి చేర్చారు అని చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" చిత్రం తరువాత చేస్తున్న చిత్రం మరి కాస్త జాగ్రత్త వహించాల్సింది. ఎన్టీఆర్ స్టైలింగ్ మీద ఉన్న శ్రద్దలో పది శాతం అయినా రెండవ అర్ధ భాగం మీద పెట్టి ఉంటె ఈ రివ్యూ మరోలా ఉండేది. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ కాస్త బూడిద పాలయిపోయింది. తమన్ అందించిన నేపధ్య సంగీతం గురించి చెప్పాలంటే సన్నివేశానికి సంగీతానికి అసలు కనెక్షన్ ఉండదు. చాలా ఎమోషనల్ సన్నివేశాలను ఎలివేట్ చెయ్యలేకపోయాడు. పాత ఆవకాయ పచ్చడి పెడితే బాగుంటుంది కాని పాడయిపోయిన పచ్చడి పెడితే ఇలానే ఉంటుంది హరీష్ గారు... ఈ చిత్ర కథ గతంలో చాలా చిత్రాలలో వాడిందే కొత్తగా ఏదయినా ప్రయత్నించి ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో హీరో ఎలివేషన్ కి బాగా స్కోప్ ఉన్న సీన్స్ అయితే ఉన్నాయి కాని ఎలివేషన్ సీన్స్ ఏవి సార్? మొదటి అర్ధ భాగం అయిపోగానే సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది, రెండు వేరు వేరు సినిమాలను ఒక సన్నని దారంతో కలిపేసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో ఉన్న సన్నివేశాలన్నీ అర్ధంతరం గా ముగిసిపోయి కొత్త సీన్స్ విచిత్రంగా మొదలవుతాయి. ఫస్ట్ ఫైట్ మరియు ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి ఫైట్స్ కూడా "అలానే" ఉన్నాయి. సింపుల్ గ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ కి అన్నీ కలిసి వచ్చాయి,సెకండ్ హాఫ్ కి ఏది కలిసి రాలేదు.... నేను చెప్పెదేవిటంటే "ఎన్టీఆర్ కోసం అయితే ఎన్ని సార్లయినా చూడదగ్గ చిత్రం ఎంటర్ టైన్మెంట్ కోసం అయితే ఒకసారి చూడవచ్చుJr NTR,Samantha,Shruti Haasan, Dil Raju,Harish Shankar,Sri Venkateswara Creationsఎన్టీఅర్ మాత్రమే కాపాడాలయ్య

మరింత సమాచారం తెలుసుకోండి: