హృతిక్ రోషన్హృతిక్ రోషన్ఫస్ట్ సీన్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు, ఇంటర్వెల్, ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్

క్రిష్ చిత్రం ఎక్కడ అయితే ముగిస్తుందో ఈ చిత్రం అక్కడే మొదలవుతుంది. సోలార్ పవర్ ని ఉపయోగించి జీవంలేని వాటిని బ్రతికించే ప్రాజెక్ట్ తయారు చేస్తుంటాడు రోహిత్ మెహ్ర ( హృతిక్ రోషన్ ) , అదే ఇంట్లో అప్పటికే పెళ్ళయిన కృష్ణ మెహ్ర ( హృతిక్ రోషన్ ) మరియు ప్రియ ( ప్రియాంక చోప్రా ) కూడా ఉంటారు. ఇదే సమయంలో కాల్ ( వివేక్ ఒబెరాయ్) భయాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తుంటాడు దీనికి తన డి.ఎన్.ఏ ద్వారా తయారయిన "మాన్వార్(మ్యుటేంట్)" కాయ(కంగనా రనౌత్) సహాయపడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో తన డి ఎన్ ఏ ద్వారా తయారు చేసిన వైరస్ ని ముంబైలో స్ప్రెడ్ చేసి లాభాలు గడించాలని ఆశ పడుతున్న కాల్ ని క్రిష్ ఆపలేకపోతాడు. ఈ వైరస్ కి రోహిత్ మెహ్ర విరుగుడు కనుగొనాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక కాల్ తన ఆశయాన్ని చేరుకున్నాడా? కాల్ ప్రయత్నాన్ని క్రిష్ అడ్డుకున్నాడా? రోహిత్ విరుగుడు కనుగున్నాడా? అన్నది మిగిలిన కథ...

హృతిక్ రోషన్ , ఈ చిత్రంలో రెండు పాత్రలను పోషించిన ఈ నటుడు రెండింటి మధ్య తేడాను చాలా బాగా చూపించగలిగాడు. కోయి మిల్ గయా చిత్రంలోని రోహిత్ పాత్రను ఇటు క్రిష్ పాత్రను సమర్ధ వంతంగా పోషించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తరువాత క్రిష్ నుండి వచ్చిన మరో పాత్ర ప్రియాంక చోప్రా నేను ఈ సినిమాలో నటించాను... నటిస్తున్నాను.. అని చెప్పడానికే అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. కంగనా రనౌత్ , ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాములుగా నటించడమే కష్టం అనిపించే ఈ నటి ఈ చిత్రం కోసం ఓవర్ యాక్ట్ చెయ్యడం మన అదృష్టం. వివేక్ ఒబెరాయ్ విలనిజం ని సరిగ్గా పండించలేకపోయాడు. మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చి వెళ్లిపోతుంటాయి..

ఈ చిత్రానికి డైరెక్టర్ రాకేష్ రోషన్, అయన చూసిన ఆయనకు నచిన నాలుగు ఇంగ్లీష్ సూపర్ హీరోల చిత్రాలను మన ఆడియన్స్ కి పరిచయం చెయ్యాలన్న అయన తాపత్రయం మంచి విషయమే కాని ఆ చిత్రాలు అన్ని ప్రాంతీయ భాషలలో డబ్ అయ్యాయి, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యారండి ? ... రాజేష్ రోషన్ అందించిన సంగీతం పాటలలా కన్నా మాటల్లా ఎక్కువగా అనిపిస్తుంది. నేపధ్య సంగీతాన్ని సలీం సులేమాన్ పలు ఇంగ్లీష్ సినిమాల నుండి "కాపీ" కొట్టారు. ఈ చిత్రం రెండు గంటలు అయినా రెండున్నర గంటలు అయినా రిజల్ట్ లో తేడా ఉండేది కాదు కాని ఎఫెక్ట్ లో తేడా ఉండేది ఎడిటర్ గారు, కొన్ని అనవసర సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది సార్. రెడ్ చిల్లిస్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్ నెట్వర్క్స్ ని తలపిస్తాయి. సినిమాటోగ్రఫీ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

(ఎక్స్ -మెన్ + స్టార్ ట్రెక్ + డార్క్ నైట్ రైసెస్ + మాన్ అఫ్ స్టీల్ + మాట్రిక్స్) = క్రిష్ 3 (కథ + కథనం)

మన ఇండియా లో సూపర్ హీరో లు లేరని 2011 దీపావళికి మొట్టమొదటి భారత దేశ సూపర్ హీరోగా వచ్చిన రా.వన్ దెబ్బ నుండి ఇంకా కోలుకోనేలేదు ఈ సంవత్సరం దీపావళికి మరో బాలీవుడ్ సూపర్ హీరో "క్రిష్" మన ముందుకి వచ్చాడు... పేరయితే మారింది కాని రిజల్ట్ మాత్రం మారలేదు.ఇంకా ఈ చిత్రం మరో అడుగు ముందుకి వేసి, వేసే కాస్ట్యూమ్స్ తో మొదలు పెట్టి చేసే ఫైట్స్ , పాత్రలు ప్రవర్తించే విధానం, విజువల్ ఎఫెక్ట్స్ మొదలుగునవి పలు ఇంగ్లీష్ సినిమాల నుండి కాపీ కొట్టారు. "ఇన్స్పిరేషన్" అని అనడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అక్కడ ఎలా ఉందో అలానే "కాపీ" కొట్టారు. అలా కోపి కొట్టకుండా చేసిన పాత్ర ఏదయినా ఉందంటే ఒక్క ప్రియాంక చోప్రా మాత్రమే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఎవరెవరి పాత్ర ఎక్కడ ఎక్కడ నుండి కాపి కొట్టారు అన్న వివరాల్లోకి వెళ్తే ...

క్రిష్ (హృతిక్ రోషన్) - నిజానికి ఈ పాత్ర క్రిష్ కి కొనసాగింపు అయినా చిత్రంలో క్రిష్ గా కంటే కూడా స్పైడర్ మాన్ , బ్యాట్ మాన్ , మాన్ అఫ్ స్టీల్ లో సూపర్ మాన్ మరియు మాట్రిక్స్ లో హీరోలా ఆహార్యం మరియుఆ రకమయిన స్టైలింగ్ లో చూపించాలని తెగ ప్రయత్నించారు.

కాయ (కంగనా రనౌత్) - ఈ పాత్ర ఆహార్యం మరియు తీరుతెన్నులు అన్ని కాపీ కొట్టినవే , డార్క్ నైట్ రైసెస్ నుండి సెలిన కైల్ అలియాస్ క్యాట్ వుమన్ పాత్ర ఎలా అయితే ప్రవర్తిస్తుందో ఈ పాత్ర అలానే ప్రవర్తిస్తుంది. ఈ కాయా అనే పాత్రా ప్రవర్తించే విధానం ఎక్స్ - మెన్ చిత్రంలో మిస్టిక్ పాత్రను పోలి ఉంటుంది.

కాల్ (వివేక్ ఒబెరాయ్) - ఈ సదరు పాత్రను దర్శకుడు రెండు వేరు వేరు పాత్రలను తీసుకొని మిక్సీ లో వేసి కలిపెసాడు ఎక్స్ మెన్ చిత్రంలోని ప్రొఫెసర్ "ఎక్స్" అనే పాత్రని అదే సినిమాలో మాగ్నేటో అనే పాత్రను కలిపేసి ఈ చిత్రంలో కాల్ అనే పాత్రను సృష్టించేసాడు. అందులో వివేక్ ఒబెరాయ్ నటన మాత్రం పరవాలేదు.

ఇదంతా ఒక ఎత్తయితే చిత్ర క్లైమాక్స్ లో కాల్ రోబోకాప్ చిత్ర కాస్ట్యూమ్ వేసుకొని మాగ్నేటో లా ప్రవర్తిస్తుంటాడు ఆ కాస్ట్యూమ్ మొత్తానికి అతని హెల్మెట్ హైలెట్. .

దర్శకుడిగా రాకేష్ రోషన్ దారుణంగా విఫలం అయ్యాడు. మాములుగా ఇలాంటి చిత్రాలు చిన్న పిల్లలకి నచ్చుతుంది అని అంటారు ఈ చిత్రానికి ఆ అవకాశం కూడా లేదు. ఇంగ్లీష్ చిత్రాలలోని కొన్ని సన్నివేశాల సమూహారమే క్రిష్-3 , నా సలహా అయితే ఆయా ఇంగ్లీష్ చిత్రాల పేర్లన్నీ పై రివ్యూ లో పొందుపరిచాం అవే మళ్ళీ చూడండి..

Hrithik Roshan,Priyanka Chopra,Kangna Ranaut,Vivek Oberoi,Rakesh Roshan3 X ఇంగ్లీష్ సీన్స్ కాపీ = క్రిష్ 3

మరింత సమాచారం తెలుసుకోండి: