కుక్క! కుక్క! కుక్క! కామెడీ ,సీనియర్ నరేష్ కామెడీ ట్రాక్కుక్క! కుక్క! కుక్క! కామెడీ ,సీనియర్ నరేష్ కామెడీ ట్రాక్ స్క్రీన్ ప్లే,నటీనటుల పెర్ఫార్మన్స్, రొటీన్ అనే పదానికే చిరాకు తెప్పించేలా ఉండే సెకండాఫ్ & క్లైమాక్స్

పుట్టినప్పటి నుండి ప్రసాద్(సీనియర్ నరేష్) కి కొడుకైన సిద్దు(సుదీర్ బాబు) రకరకాలుగా చుక్కలు చూపిస్తుంటాడు. దాంతో సిద్దు వల్ల కలిగే ఇబ్బందిని తట్టుకోలేక అతన్ని హాస్టల్ ఉంచి చదివిస్తుంటాడు. అలా అనుకోకుండా ఇందు(అస్మితా సూద్)ని చూసిన సిద్దు మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తన కోసం అదే కాలేజ్ లో చేరిన సిద్దుకి ఇందు అన్నయ్య చెర్రి(రణధీర్ రెడ్డి) వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయి. సిద్దు చెర్రిని డైవర్ట్ చెయ్యడం కోసం అంజలి(పూనం కౌర్)తో ముడేస్తాడు. దాంతో సిద్దు పలు సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆ సమస్యలని క్రియేట్ చేసేది తను అనుకున్న దాని కోసం ఏమన్నా చేసే శంకరన్న అలియాస్ బుజ్జి(అజయ్). శంకరన్న వల్ల వచ్చే సమస్యలని సిద్దు ఎలా ఎదుర్కొన్నాడు? అసలు శంకరన్నకి ఈ నలుగురికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మీరు వెండితెరపైనే చూడాలి..

రోబో సినిమాలో చెప్పినట్టు ఈ సృష్టిలో పనికోచ్చేటివి రెండే రెండు ఒకటి నువ్వు రెండు నేను అన్న స్టైల్లో ఈ సినిమా నటీనటుల్లో పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించింది రెండే రెండు ఒకటి - కుక్క కామెడీ, రెండు - సీనియర్ నరేష్ కామెడీ ట్రాక్. కుక్కని గ్రాఫిక్స్ లో చేసారు, అలాగే దాని ఎక్స్ ప్రెషన్స్ గురించి చెప్పలేం కానీ బాగా నవ్వించింది. అలాగే సీనియర్ నరేష్ కామెడీ చేయడంలో మంచి గ్రిప్ ఉన్న యాక్టర్. ఆయన మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించాడు. ఇక సుదీర్ బాఉ నటనలో ఎలాంటి మార్పు కనపడలేదు. మొదటి సినిమా అప్పుడు ఎక్కడ ఎబిసిడిలు దిద్దుతున్నాడో అక్కడే ఉన్నాడు. డైలాగ డెలివరీ మీద అస్సలు పెట్టు లేదనేది పంచ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు బాగా తెలుస్తుంది. అస్మితా సూద్ హావ భావాలు, నటన మొదలైన వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఎందుకంటే కాయిన్ కి ఒకవైపు బొమ్మ బొరుసు అన్నా ఉన్నాయి కానీ అస్మితా ఎ సీన్స్ లో ఏ యాంగిల్ లో చూపించిన నాకైతే ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కనిపించలేదు. పూనం కౌర్, రణధీర్ రెడ్డి, సుమన్ ల నటన జస్ట్ ఓకే. విలన్ గా అజయ్ మరోసారి మెప్పించాడు. ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేవు..

ఈ కథ ఇప్పటికే తెర మీదకు పలు హీరోలతో పలుమార్లు దర్శనం ఇచ్చింది. ఇదే కథతో వచ్చిన చిత్రాలు విజయం సాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని వాటిలో ఉన్నది ఈ చిత్రంలో లేనిది "ఎంటర్ టైన్మెంట్" ... ఇది చాలదన్నట్టు గా కథను నడిపించిన విధానం ప్రేక్షకులలో ఓపికను చంపేస్తుంది. ఇక టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో మిమ్మల్ని కాస్తో కూస్తో మెప్పించేది ఒక్క సినిమాటోగ్రాఫర్ మాత్రమే. అతను ప్రతి ఫ్రేం ని బాగా రిచ్ గా చూపించాడు. ఇకపోతే శ్రీ మ్యూజిక్ ఏదో ఉండాలి కాబట్టి ఉంది. పోనీ శ్రీ - సునీల్ కశ్యప్ కలిసి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నా బాగుందా అంటే అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఎడిటర్ సెకండాఫ్ మీద అస్సలు జాగ్రత్త తీసుకోలేదు. అసలు చాలా అనవసరమైన సీన్స్ ని సెకండాఫ్ లో లేపెయచ్చు కానీ ఆ టైం లో ఎడిటర్ ఎం చేస్తున్నాడో గానీ వాటిని అలానే ఉంచేసాడు. దాని వల్ల సినిమా సాగదీసినట్టు అవుతుంది. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే - ఇతనికి కామెడీ మీద కాస్త గ్రిప్ ఉంది తప్ప మిగతా చాలా విషయాల మీద గ్రిప్ లేకపోవడం వల్ల డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే..

ఇక్కడ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో మొదటి 40 నిమిషాల తప్ప మిగతా అంతా రొటీన్ అంటే పదానికి చిరాకు పుట్టేలా ఉంటుంది. సెకండాఫ్ ఐతే డీ, రెడీ,దేనికైనా రెడీ, బిందాస్, దూసుకెళ్తా, బాద్షా ఇలా పలు తెలుగు సినిమాల కలగూరగంపలా ఉంటుంది. అదన్నా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉందా అంటే అదీ లేదు. ఎక్కడో వచ్చే కుక్క కామెడీ తప్ప మిగతా సినిమా మొత్తం ప్రేక్షకుడి సహనానికి పెట్టిన పరీక్ష కాబట్టి ఇలాంటి సెకండ్ హాఫ్ ఉంచటం కన్నా ఫస్ట్ హాఫ్ తోనే సినిమానే పూర్తి చేసుండవచ్చు.

నటీనటుల్లో సీనియర్ నరేష్, అజయ్ నటన తప్ప చెప్పుకోదగ్గ విధంగా ఒక్కరి నటన కూడా లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ నటీనటుల నుండి ఏ మేరకు నటనను పిండుకున్నాడు అనేది. అలాగే విలన్, హీరోకి కొన్ని యాంగ్రీ డైలాగ్స్ ఉంటాయి. వాటిని ఏదో బట్టి పట్టినట్టు గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తారు. ఆ డైలాగ్స్ లో ఒక ఫీల్ ఉండదు. డైలాగ్స్ అన్నాక ఎక్కడ నొక్కాలో ఎక్కడ గట్టిగా పలకాలో తెలియాలి. అప్పుడే డైలాగ్ రైటర్ రాసిన డైలాగ్స్ కి ప్రాణం పోసినట్లు అవుతుంది. లేదో ఈ సినిమాలోలా సీన్ లో పవర్ ఉన్నా పసలేకుండా పోతాయి.

అలాగే సుదీర్ బాబు కెవ్వు కేక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసాడు అని చెప్పుకొని పోస్టర్స్ అన్నిటినీ సిక్స్ ప్యాక్ పోస్టర్స్ తో నింపేశారు. దీన్ని చూసిన వాళ్ళు ఎవరన్నా సరే సిక్స్ ప్యాక్ లుక్ లో సుధీర్ బాబు ఫైట్స్ చేస్తాడు. బాగుంటాయి అనుకుంటారు. కానీ సిక్స్ ప్యాక్ తో ఒక్క ఫైట్ కూడా పెట్టకుండా పాటల్లో షర్టు ఇప్పేసి నడుస్తుంటాడు. ఈ మాత్రం దానికి సిక్స్ ప్యాక్ చెయ్యడం దేనికి ఆడియన్స్ అనుమానం. మొత్తం మీద ఆడు మగాడ్రా బుజ్జి చిత్రం అంటే ఒక కుక్క, ఆరు ప్యాక్ లు (సిక్స్ ప్యాక్), నాలుగు స్టెప్ లు మొత్తం కలిపి నలభై నిముషాలు మిగిలింది ఏం ఉన్న చెప్పలేనిది లేదా చెప్పుకోలేనిది ..

CastAndCrew Separated By ,ఆడు మగాడ్రా బుజ్జి - ఇదేం సినిమారా బుజ్జి ...

మరింత సమాచారం తెలుసుకోండి: