బేసిక్ ప్లాట్, సంగీతం,సినిమాటోగ్రఫీ బేసిక్ ప్లాట్, సంగీతం,సినిమాటోగ్రఫీ అర్ధం పర్ధం లేని ఎడిటింగ్,అసలు గ్రిప్పింగ్ గా లేని కథనం,అవసరాని కన్నా ఎక్కువగా ఇచ్చిన నేపధ్య సంగీతం,అవసరం కన్నా తక్కువగా ఇచ్చిన నటుల ప్రదర్శన

శివ (ప్రిన్స్) ఒక ఫోటోగ్రాఫర్, అనాథ అయిన శివ చిన్నప్పటి నుండి సుందరం దగ్గర పెరుగుతాడు. లాస్య(దిశా పాండే) ఒక కంపెనీ లో ఆర్కిటెక్ట్ గా పని చేస్తుంటుంది. లాస్యతొ మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు శివ, లాస్య కూడా తనని ప్రేమించేలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదిలా నడుస్తుండగా లాస్య పని చేస్తున్న కంపెనీ ఓనర్ అయిన జై(సేతు) , మైథిలి(రిచా పనయ్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆనందంగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక MMS కలకలం రేపుతుంది అక్కడ నుండి కథ చాలా మలుపులు తీసుకుంటుంది. లాస్య కి ఎలాగయినా తన ప్రేమను చెప్పాలని శివ నిర్ణయించుకున్న రోజు లాస్య ఆత్మ హత్య ప్రయత్నం చేసుకుంటుంది అదే సమయంలో సుందరం కూడా చనిపోతాడు అసలు లాస్య ఆత్మ హత్య ప్రయత్నం ఎందుకు చేసుకుంది? సుందరాన్ని ఎవరు చంపారు? జై కి వచ్చిన MMS లో ఏముంది? అనే సందేహాలకు సమాధానం తెర మీదనే దొరుకుతుంది..

జై పాత్రలో చేసిన సేతు బాగా చెయ్యడానికి ప్రయత్నించాడు కాని విజయం సాధించలేక పోయాడు ఈ చిత్రంలో ఈయన పాత్ర చాలా కీలకం అలాంటిది ఈయన నటన తేలిపోతే కథలో ఉన్న ఇంటెన్సిటీ శూన్యం అయిపోయింది. ఇక ప్రిన్స్ నటన ఈ చిత్రానికి పెద్ద మైనస్ అతనికి తెలుగులో డైలాగ్ చెప్పడమే ఇంకా పూర్తిగా రాలేదు తమిళ్ లో డైలాగ్స్ చెప్తుంటే అసలు నప్పలేదు. దిశా పాండే నటనా పరంగా పెద్దగ ఆకట్టుకోలేదు రిచా పనయ్ కి ఆకట్టుకునేంత పాత్ర ఇవ్వలేదు మిగిలిన అన్ని పాత్రలు పర్లేదు అనిపించేసి వెళ్ళిపోయాయి..

తీసుకున్న ప్లాట్ కొత్తగానే ఉంది కాని దాని చుట్టూ అల్లుకున్న కథనం చాలా దారుణం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చివరికి ఎన్నో ప్రశ్నలతో ముగించేసాడు దర్శకుడు. సురేష్ కుమార్ ఇంకాస్త దృష్టి సారించి కాస్త పగడ్బందీ గా రచించి ఉంటె చిత్రం చాలా ఆసక్తికరంగా సాగేది ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు చెప్పాలనుకున్నది ఎలాగయినా చెప్పాలి అన్న ప్రయత్నం లో ఎలా చెప్తున్నాం అని కూడా ఆలోచించకుండా చెప్పేశారు కాస్త ఆలోచించి ఉంటె కరెక్ట్ గా చెప్పుంటే బాగుండేది. ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ముఖ్యంగా పాటల కోసం ఎంచుకున్న మంచి లొకేషన్లను చాలా అందంగా చిత్రీకరించారు. అలానే సంగీతం అందించిన మనికాంత్ కద్రి పాటలు వరకు బానే అందించిన నేపధ్య సంగెతం విషయంలో దారుణంగా విఫలం అయ్యారు. ఎడిటర్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఏ సన్నివేశానికి ఏ సన్నివేశం కొనసాగింపో అర్ధం అవ్వడానికి మూడు గంటలు పట్టుది, అది కథనంలో లోపమో ఎడిటింగ్ లో లోపమో కాని ప్రేక్షకుడ్ని మాత్రం బాగా విసిగించిన విషయం. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

మనసును మాయ సేయకే , ఈ టైటిల్ కి ఈ సినిమాకి సంబంధం ఎవరికీ అర్ధం కాదు MMS అని కలిసొచ్చింది కదా అని ఉపయొగించినట్టు ఉన్నారు. కథ కొత్తగా ఉంటె సరిపోదు దాన్ని సరితూగేలా నట బృందం ఉండాలి ఈ రెండింటికి చాలెంజ్ చేసేలా కథనం ఉండాలి ఈ చిత్రంలో ఈ రెండు లేవు, ప్రేక్షకుడిని విసుగెత్తించిన మరో విషయం ఏంటంటే తెలుగు చిత్రం అనుకోని లోపలి వెళ్ళిన ప్రేక్షకుడికి తమిళ డబ్బింగ్ చిత్రం చూపెట్టి "మాయ" చేసారు. రెండు బాషలలో ఒకేసారి తెరకెక్కించ లేక దర్శకుడు చేసిన ఒక తెలివయిన పని ఏంటంటే పాటల్లో పెదవులు కదుపక పోవడం "డబ్బింగ్ లో కరెక్ట్ చెసుకొవచ్చులె" అనుకున్నారు కాని ప్రేక్షకుల పరిస్థితి ఆలోచించలేకపోయారు. ఈ సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు దర్శకుడిని అడగాలనుకునే ప్రశ్న అసలు ఈ సదరు శివ క్యారెక్టర్ కి జై పాత్ర గురించి ఎలా తెలిసింది అసలు ఈ లాజిక్ ఆలోచించారో లేదో కూడా తెలియట్లేదు. ఈ చిత్రాన్ని పూర్తిగా అయితే కొట్టి పారెయలెము కాని ఒక ఆసక్తికరమయిన ప్లాట్ ని బొత్తిగా గ్రిప్పింగ్ గా లేని కథనం తో ఎలా పాడు చేసేయచ్చు అన్న అంశాన్ని నేర్చుకోవాలనుకున్న వారికి ఇది టెక్స్ట్ బుక్ లాంటిది .. అలంటి వారు హైదరాబాద్ లో ఉన్న ఒక థియేటర్ ని వెతుక్కొని వెళ్ళే ఓపిక ఉంటె వెళ్ళండి...

Prince,Sethu,Suresh P Kumar,Jaison Pullikottil,Manikanth Kadriమనసును మాయ సేయకే - ప్రేక్షకుడిని మాయం చేసావే .

మరింత సమాచారం తెలుసుకోండి: