కథ ,అక్కడక్కడ కామెడీ ,పాడింగ్ ఆర్టిస్ట్స్ కథ ,అక్కడక్కడ కామెడీ ,పాడింగ్ ఆర్టిస్ట్స్ కథనం ,నటీనటుల పనితీరు ,డైలాగ్స్ ,మ్యూజిక్

బన్ని/కార్తీక్ (ప్రిన్స్) త్వరలో మూతపడేలా ఉండే ఒక కంపనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తుంటాడు, ఇక చెర్రీ (మహాత్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉండే ఒక కుర్రాడు అతను పింకీ (కృతి) ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. అలానే బన్ని , కావ్య(సభ) ని చూడగానే ప్రేమిస్తాడు. వీరు ఇరువురు వారి లైఫ్ ని గడుపుతుండగా వారి జీవితాల్లో అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది ఆ సంఘటన మూలాన చెర్రీ ఆలోచనలు బన్నీ కి , బన్నీ ఆలోచనలు చెర్రీ కి మారిపోతాయి అక్కడ నుండి వారు ఎదుర్కొన్న సంఘటనలు సమస్యలు వాటి పరిష్కారాలు మిగిలిన కథ ...

ప్రిన్స్ ఎప్పటిలానే తన ప్రతిభ మొత్తం చూపించారు నటనలో ఎటువంటి పరిపఖ్వత లేకుండా తన పంథా అలానే కొనసాగించాడు. ఇక మహాత్ రాఘవేంద్ర నటన గురించి ఏదయినా మాట్లాడాలన్నా కూడా అవకాశం ఇవ్వలేదు సరిగ్గా చెప్పాలంటే అయన నటించలేదు కాబట్టి చెప్పడానికి అవకాశం లేదు. కృతికి నటించే అవకాశం తక్కువగా వచ్చింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని అవసరానికి మించి వినియోగించేసుకుంది.

సభ పాత్రకు అంతగా ప్రాదాన్యత లేదు కాని ఉన్నంతలో అందంతో ఆకట్టుకుంది కాని అభినయానికి ఆస్కారం ఇవ్వలేదు. పోసాని కృష్ణ మురళి ఉన్న కాసేపు ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం పాత్ర అసలు ఆకట్టుకోలేకపోయింది. సీత , ఎల్ బి శ్రీరాం , చంద్రమోహన్ , గౌతంరాజు, అపూర్వ , సుమన్ , యండమూరి వీరేంద్ర నాథ్ మొదలగు వారు పాడింగ్ కోసమే నటించినట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.

దర్శకుడు రాజేష్ పులి దర్శకత్వంలో విషయం ఉంది కాని అనుకున్న కాన్సెప్ట్ ని చెప్పడంలో ఘోరంగా విఫలం అయ్యారు. కథ కథనం విషయానికి వస్తే కథ కాస్త కొత్తగానే ఉన్న కూడా కొన్ని ఇంగ్లీష్ చిత్రాలను పోలి ఉంటుంది. ఇక కథనం విషయానికి వస్తే ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో అది చెప్పడానికి చాలా తడబడ్డారు చివరికి వచ్చేసరికి చెప్పాలనుకున్న విషయాన్నీ పక్కన పెట్టి కొత్త విషయాలని తెర మీదకు పట్టుకొచ్చారు.

సినిమాటోగ్రఫీ అందించిన రవి కుమార్ తన పని వరకు పాస్ మార్కులు వేయించుకున్నాడు. శ్రీ వసంత్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు అయన అందించిన నేపధ్య సంగీతం చిత్రానికి ఎటువంటి సహాయం చెయ్యలేకపోయింది. తిరుమల శెట్టి అందించిన డైలాగ్స్ బాగోలేదు. జస్ట్ ఉన్నాడు అనిపించాడు. నిర్మాణ విలువలు పరవాలేదు.

కొన్ని ఇంగ్లీష్ చిత్రాలను తీసుకొచ్చి తెలుగు పెయింట్ వేసి ప్రేక్షకుల ముందుకు పట్టుకొచ్చిన మరో చిత్రం ఇది "ఫ్రీకి ఫ్రైడే","ది అనిమల్", "ఇట్స్ అ బాయ్ గర్ల్ థింగ్ " లాంటి చిత్రాల ఛాయలు కనిపిస్తున్నా ఎక్కువ భాగం "చేంజ్ అప్" అనే చిత్రం నుండి ప్రేరణ పొందినట్టుగా తెలుస్తుంది. కాని కథనం విషయానికొచ్చేసరికి బాగా తడబడ్డాడు. చివరికి వచ్చేసరికి మెసేజ్ చెప్పాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో కాని దర్శకుడు అసలు చెప్పాలన్న విషయాన్ని పక్కన పెట్టి మెసేజ్ మీద దృష్టి సారించారు.

కథ కొత్తగా ఉంది కథనం కాస్త పగడ్భందీగా రాసుకొని సరిగ్గా తెరకెక్కించి ఉంటె ఈ చిత్రం మరోలా ఉండేది అంతే కాకుండా ఈ చిత్ర కాస్టింగ్ విషయానికి వస్తే నటనలో బేసిక్స్ కూడా తెలియని నటుల దగ్గర నటింప చేసారు రెండు పాత్రలకు మధ్యలో ఉన్న విభిన్నతను ఎవరు కూడా చూపించలేకపోయారు. ఇక కథానాయికలు "పాటలకు మాత్రమే" అన్నట్టు ఉండే పాత్రలలో కనిపించారు.

బుర్ర మార్పిడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు బుర్ర గోక్కోవడం ఖాయం.. కాస్తయిన బుర్ర పెట్టి ఉంటె మంచి చిత్రంగా మలిచి ఉండవచ్చు.. ఈ చిత్రంలో ఫెయిల్ అవ్వడంలో పూర్తి పాత్ర దర్శకుడిదే, సరయిన కథనం బలమయిన నటవర్గం ఉంది ఉంటె బాగుండేది .... మొత్తానికి ఇది థియేటర్ కి వెళ్లి చుసేయాల్సిన చిత్రం అయితే కాదు ... వెళ్ళడం వెళ్లకపోవడం మీ ఇష్టం ....

Prince,Mahat,Kriti,Rajesh Puli,Rajat Pardhasaradhiబన్నీ n చెర్రీ : బ్రెయిన్ లెస్ చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: