ఉంటాయని మీరనుకోవడంఉంటాయని మీరనుకోవడంచెప్పాలని నేను అనుకోవడం

మల్లిగాడు (శ్రీకాంత్) ఒక మ్యారేజ్ బ్యూరో కి ఓనర్ , మల్లిగాడు అనుకుంటే వీధి చివరి టైలర్ కి ఎలిజిబెత్ టేలర్ కి పెళ్లి చేసేయగల ఘనుడు. ఇలా డబ్బులిస్తే ఎటువంటి వారికయినా పెళ్లి చేస్తూ ఉంటాడు. అంతే కాకుండా అతను చేసే పెళ్ళిళ్ళకి ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తుంటాడు . అదే క్రమంలో మల్లి అసలు పెళ్ళంటే ఇష్టపడని మనో చిత్ర ను పెళ్లికి ఒప్పించేలా మనో చిత్ర తల్లిదండ్రులకు మాటిస్తాడు ఇక అక్కడ నుండి మల్లిగాడి కష్టాలు మొదలవుతాయి. ఇదిలా ఉండగా ప్రేమలో విఫలం అయ్యి ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటున్న బాబిని మల్లి కాపాడి తన ప్రేమను గెలిపిస్తాను అని మాటిస్తాడు , ఇదిలా సాగుతుండగా, మల్లికి బావ అయిన సురేష్ కి యాక్సిడెంట్ అవుతుంది ఎవరికీ తెలియకుండా అతనికి వైద్యం ఇప్పిస్తుంటాడు ... ఇదంతా ఒక కథ అయితే చోటు భాయ్ (బ్రహ్మానందం) కి పెళ్లి చేస్తాను అని మోసం చేస్తాడు మల్లి దాంతో మల్లి మీద కక్ష పెంచుకుంటాడు చోటు భాయ్ ... ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ముళ్ళను విప్పడమే మిగిలిన కథ ...

శ్రీకాంత్ , ఈ మధ్య కాలంలో అయన నటన బాగా రొటీన్ గా ఉంటున్నాయి ఏదయినా రెండు చిత్రాలలో అయన నటన చూపించి ఏ చిత్రమో చెప్పుకోండి అంటే గుర్తు పట్టలేనంత గా ఒకేలా ఉన్నాయి. మనో చిత్ర నటనాపరంగా చేసేది ఏమి లేదు ఉన్నంతలో చాక్లెట్ దొరికిన చిన్న పిల్లలా హావభావాలు ఇచ్చేసి వెళ్లిపోయింది. తెర మీద కాస్త అందంగా కూడా కనిపించింది. వెన్నెల కిషోర్ ఉన్నంతలో బానే నటించాడు. శ్రీకాంత్ చెల్లెలిగా చేసిన అమ్మాయి తన సీరియల్ నటననే ఇందులోనూ ప్రదర్శించి ఓపికకు పరీక్ష పెట్టింది అతని బావగా చేసిన సీరియల్ యాక్టర్ కూడా తన సీరియల్ యాక్టింగ్ ని వదిలి బయటకు రాలేకపోయాడు. బ్రహ్మానందం ఉండాలి అనుకోని రాసుకున్న పాత్ర ఇది కాబట్టి అది కూడా అలానే ఉంది పోసాని , జయ ప్రకాష్ నారాయణ , తెలంగాణా శకుంతల , కాశి విశ్వనాథ్ ఇలా చాలామందిని ప్యాడింగ్ కోసం నటింపజేశారు...

దర్శకుడు ఉదయ రాజ్ , ఎం తీయాలి అనుకున్నాడో ఎం తీసాడో ఆయనకి అయినా అర్ధం అయ్యిందా లేదా అన్నది ప్రతి ప్రేక్షకుడు అడగాలనుకునే ప్రశ్న.. చాలా రోజుల నుండి చూసి చూసి అలిసిపోయిన కథను మాలి చూపించి మెప్పించాలని ఎందుకనిపించిందో అనాది మరో ప్రశ్న.. కథనం అసలు పటుత్వం లేని కథనం, నవ్వించాలి అన్న ప్రయత్నంలో అయన చేసిన విఫల యత్నాలను చూసి నవ్వుకోవాలి అంతేగాని సన్నివేశాన్ని చూసి కాదు క్లైమాక్స్ సన్నివేశం ఏంటో మొదటి సన్నివేశంలోనే పసిగట్టేయ్యచ్చు. సంగీతం అందించిన రఘు రామ్ పాటల పరంగా అసలు ఆకట్టుకోలేకపోయాడు నేపధ్య సంగీతం కూడా అసలు ఆకట్టుకోలేదు సన్నివేశంలోనూ బలం లేదు నటనాపరంగా ఆకట్టుకోలేదు ఇక అతను చేసేది ఏమి లేకుండా పోయింది.

ఇంతోటి చిత్రానికి దాదాపుగా మూడు గంటల నిడివి ఎందుకో ఎవరికీ అర్ధం కాదు ఎడిటర్ గారు ఎక్కడ కట్ చెయ్యాలో తెలియక ఎక్కడా కట్ చెయ్యకుండా వదిలేసి ఉన్నట్టు ఉన్నారు. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి పెళ్లి కొడుకు గురించి తెలంగాణా శకుంతల చెప్పే డైలాగ్ "ఐ ఫోన్ తెమ్మంటే చైనా ఫోన్ తెస్తావా గ్యారంటీ ఉంటుందా" ఒక్కటి చాలు సినిమాలో ఎంత దిగజారిన డైలాగ్స్ ఉన్నాయో.. నిర్మాణ విలువల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసింది...

ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో "నాసిరకం" చిత్రాలు చేస్తున్నారు. నాసిరకం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో అయన చేస్తున్న చిత్రాలు అలానే ఉంటున్నాయి ఈ చిత్రం కూడా అలానే ఉంది. సినిమా కథ కూడా వినకుండా ఒకే చేస్తున్నారేమో అన్న అనుమానం వచ్చేలా ఉంది.. చాలా కొన్ని చిత్రాలు మాత్రమే విశ్లేషణకి కూడా నోచుకోవు అలంటి ఒక లిస్టు తయారు చేస్తే ఈ చిత్రం మొదటి ఐదింటిలో ఒకటవుతుంది. శ్రీకాంత్ గారికి అభిమానులు ఉంటె వారు కూడా ఈ చిత్రాన్ని చూసి ఏంటి ఇలా ఉంది? అనుకుంటారు ఈ చిత్రం అలా ఉంటుంది. ఇక ఇలాంటి చిత్రాలను తెరకెక్కించే దర్శకులకు ఒక సలహా (ఎందుకంటే భవిష్యత్తులో మీ చిత్రాలను మళ్ళీ మేమే చూడాలి కాబట్టి) ఇలాంటి చిత్రాలను తెరకెక్కించి విడుదల చేసేప్పుడు కామెడీ ఎంటర్ టైనర్ అని విడుదల చేస్తున్నారు కాబట్టి థియేటర్లో ప్రతి పది నిమిషాలకు నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) విడుదల చేసేలా ఏర్పాట్లు చెయ్యండి చిత్రం ఎలా ఉన్నా కడుపుబ్బా నవ్వుకున్నాం అన్న ఫీలింగ్ తో థియేటర్ నుండి బయటకు వస్తాడు ప్రేక్షకుడు.

ఈ చిత్ర శీర్షిక వన్ ఇయర్ మాత్రమే గ్యారంటీ అన్నట్టుగానే ఈ చిత్రానికి వెళ్ళిన ప్రేక్షకుడికి వన్ మినిట్ కూడా గ్యారంటీ కూడా ఉండదు. ఇకనయినా శ్రీకాంత్ గారు ఆచి తూచి చిత్రాలను ఎంచుకుంటారని ప్రతి పాత్రకి మధ్య భిన్నత్వాన్ని చూపెడతారని ఆశిస్తూ ఈ రివ్యూ ని ముగిస్తున్నాం. ఈ చిత్రం ఈరోజు విడుదల ఉందని చాలామందికి తెలియదు కాబట్టి వారు వెళ్లరు ఒకవేళ మీకు తెలిసినా వెళ్ళకండి.. ఇప్పుడు తెలుసుకొని ఇది చదివాక కూడా వెళ్ళాలని అనుకుంటే మీ ఇష్టం ...

Srikanth,Manochitra,Uday Raj,Mallela Sitaramarajuమల్లిగాడు మ్యారేజ్ బ్యూరో (వన్ ఇయర్ మాత్రమే గ్యారంటీ) : ప్రేక్షకుడి జీవితానికి వన్ మినిట్ కూడా గ్యారంటీ లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: