క్లైమాక్స్, సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సన్నివేశాలు,అక్కడక్కడ యూత్ఫుల్ సన్నివేశాలుక్లైమాక్స్, సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సన్నివేశాలు,అక్కడక్కడ యూత్ఫుల్ సన్నివేశాలుఫస్ట్ హాఫ్,ఎంటర్టైన్మెంట్ లేకపోవడం,హీరో,హీరోయిన్, టైటిల్

కార్తీక్ ( సంతోష్ రమేష్) మరియు శ్వేత(మనీషా యాదవ్) ఒకే కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుకుంటూ ఉంటారు. వీరిద్దరికీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కార్తీక్ ఫ్రెండ్స్ సహాయంతో శ్వేతతో పరిచయం పెంచుకుంటాడు. ముందు కార్తీక్ ను స్నేహితుడిగానే చూసిన శ్వేత మెల్లగా వారి మధ్యన ఉంది స్నేహం కన్నా ఎక్కువయిన బంధం అని తెలుసుకుంటుంది. ఇలా శ్వేతకు తెలిసేలా చెయ్యడానికి కార్తీక్ ఆత్మ హత్య ప్రయత్నం కూడా చేస్తాడు. ఇలా నడుస్తున్న వీరి ప్రేమ కథను ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు వీరిద్దరూ ఇలా జరుగుతుండగా ఒక వీకెండ్ శ్వేతా మరియు కార్తీక్ విహారానికి అని వేరే ఊరు వెళ్లి అక్కడ శారీరకంగా దగ్గరవుతారు దీని మూలాన శ్వేత గర్భవతి అవుతుంది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టాలని ఎంత ప్రయత్నించినా ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఆపలేకపోతారు. ఈ విషయం ఇంట్లో తెలిసాక కార్తీక్ మరియు శ్వేత ఎదుర్కున్న పరిణామాలు ఏంటి? ఇంట్లో పెద్దలు వారి ప్రేమను అంగీకరించారా? లేదా? అన్నది మిగిలిన కథ..

ప్రధాన పాత్రలలో నటించిన సంతోష్ నటనాపరంగా జస్ట్ పరవాలేదనిపించాడు కీలక సన్నివేశాలలో కావలసినంత ఇంపాక్ట్ సృష్టించ లేకపోయాడు. మనీషా కూడా అలానే చేసింది కీలకమయిన సెంటిమెంట్ సన్నివేశాలలో తేలిపోయింది. ఇక వీరిద్దరి మధ్యన ప్రేమ ఉన్న భావం చివరి వరకు కలుగదు వీరి కెమిస్ట్రీ అలా ఉంది ఈ చిత్రంలో. అర్జున్ అక్కడక్కడ బాగానే నవ్వించాడు తల్లిదండ్రుల పాత్రలు ధరించిన సీనియర్ నటులు వారి అనుభవానికి తగ్గ ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కూతురి జీవితం ఏమయిపోతుందో అన్న భాదను జయప్రకాశ్ మరియు తులసి అద్భుతంగా ప్రదర్శించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ చిత్రంలో సహాయ నటుల నటనే కీలకం అయ్యింది అని చెప్పుకోవచ్చు.

కథాపరంగా ఒక సమకాలీన సాంఘీక అంశాన్ని ఎంచుకున్న సుశీంధ్రన్ ఆ విషయాన్ని అర్ధం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా రెండవ అర్ధ భాగంలో తల్లిదండ్రులు పడే వేదనను చాలా మంచి కథనంతో రక్తి కట్టించారు. ఇక చివరి ఐదు నిమిషాల చిత్రం చిత్రానికే హైలెట్. ఒక సందేశాత్మక చిత్రం తెరకేక్కించాలి అన్న సుశీంధ్రన్ ఆశయం నెరవేరింది అనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ అందించిన సూర్య పరవలెధనిపించారు. సంగీతం అందించిన యువన్ రెండు పాటల మినహా ఆకట్టుకోలేకపోయారు, నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది కథనం వేగంగా సాగడానికి చాలా తోడ్పడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇప్పటి చిత్రాలలో యువతకు ఉన్న ఏకైక సమస్య "ప్రేమ" లేదా "పెళ్లి" ఈ రెండు అంశాల మీదనే చిత్రాలు వస్తున్నాయి కాని ఎవ్వరు చూడని కోణంలో చిత్రాన్ని తెరకెక్కించాలన్న సుశీంధ్రన్ ఆలోచన నిజంగా మెచ్చుకోదగినదే అందులో అయన యూత్ కి చేరువయ్యేలా వాళ్ళ మధ్య బంధాన్ని వాళ్ళు సమస్యలు గా అనుకునే అంశాలను చూపిస్తూనే వారికి తెలియకుండానే వారు చేసే అతి పెద్ద తప్పులను చాలా బాగా చూపించారు.

రెండవ అర్ధ భాగంలో గర్భం తీయించుకునే అంశాన్ని సుశీంధ్రన్ హేండిల్ చేసిన విధానం అద్భుతం అని చెప్పాలి కాని ఇక్కడ వచ్చిన సమస్యల్లా వినోదం కోసం వచ్చిన ప్రేక్షకుడిని ముఖ్యంగా యువతని ఇలా సందేశాలిస్తే ఎంతవరకు గ్రహిస్తారు? అందులోనూ ఈ చిత్ర క్లైమాక్స్ తప్పు చేసే యువతకు చెప్పు దెబ్బ అన్న స్థాయిలో ఉంటుంది. మరి రోజు చూసే అంశాలను రోజు జరిగే తప్పులను తెర తీసుకురావడంలో సుసీన్ద్రన్ విజయం సాదించాడు కాని ప్రధాన పాత్ర దారుల నటన మరియు మొదటి అర్ధ భాగంలో పటుత్వం సన్నివేశాలు ఈ చిత్రంలో మైనస్ లు నిజానికి ఇది వినోదాత్మకంగా చెప్పలేని మరియు చెప్పకూడని అంశం కాబట్టి వినోదాత్మక అంశాలు లేకపోవడం అనేది మైనస్ కింద చెప్పుకోలేము కాని "ప్రేమించాలి" అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.

ఈ చిత్రంలో ప్రేక్షకుడు వినోదాన్ని ఆశించడం ఆశ్చర్యపరిచే విషయం కాదు కాని ఈ చిత్రంలో చూపించిన అమ్శంకి ప్రేమించాలి అన్న టైటిల్ కి అసలు సంభంధం ఉండదు కాని ఈ రెండింటిని కలపడానికి చివర్లో విఫలయత్నం చేసారు. ఈ చిత్రం చుసిన ప్రేమించాలా వద్దా అన్న డౌట్ వస్తుంది. ఒకవేళ మీరు సందేశాలను ఇష్టపడే వారయితే విప్లవాత్మక భావాలూ ఉన్న వారయితే యువత చెడిపోతుంది అని బాధ పడే వారయితే ఈ చిత్రాన్ని చూడండి, నా సలహా అయితే యువత తప్పకుండా చూడవలసిన చిత్రం తరువాత మీ ఇష్టం...

Santosh,Manisha Yadav,Suresh Kondeti,Yuvan Shankar Rajaప్రేమించాలా? వద్దా?..

మరింత సమాచారం తెలుసుకోండి: