అమీర్ ఖాన్ ,సినిమాటోగ్రఫీ అమీర్ ఖాన్ ,సినిమాటోగ్రఫీ వీక్ ఫస్ట్ హాఫ్ ,పాత్రలు రచించిన విధానం ,యాక్షన్ సీన్స్ లేకపోవడం ,లాజిక్ లెస్ స్టంట్స్

చికాగో లో గ్రేట్ ఇండియన్ సర్కస్ నడుపుతున్న ఇక్బాల్ హరూన్ ఖాన్(జాకి ష్రాఫ్) కి కొడుకు సాహిర్ ఖాన్, గ్రేట్ ఇండియా సర్కస్ కోసం అప్పులుపాలయిన ఇక్బాల్ బ్యాంకు అప్పు తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటాడు. తన కళ్ళతో తండ్రి చనిపోవడాన్ని చుసిన సాహిర్(అమీర్ ఖాన్) ఆ బ్యాంకు మీద పగ తీర్చుకోవడానికి ఆ బ్యాంకు దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేసి అక్కడ తన మార్క్ ని విడిచి వెళ్తుంటాడు.

ఈ కేసు కోసమే ప్రత్యేకంగా చికాగో పోలీస్ డిపార్టుమెంటు ఇండియా నుండి జై (అభిషేక్ బచ్చన్) మరియు అలీ(ఉదయ చోప్రా) ను పిలిపిస్తారు ఇక్కడకి వచ్చిన జై, సాహిర్ ని పట్టుకునే ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఈ కేసు నుండి జై మరియు అలీ ని తప్పిస్తారు. ఎలాగయినా ఈ కేసు ని చేదించాలని అనుకున్న జై తను స్వంతంగా విచారణ జరిపి ఒక రహస్యాన్ని కనుగొంటాడు, ఇదిలా ఉండగా.. సాహిర్ ఎలాగయినా తన తండ్రి చావుకి కారణమయిన బ్యాంకు ని మూత పడేలా చెయ్యాలని చివరి దొంగతనానికి ప్లాన్ చేస్తుంటాడు.. సాహిర్ ఆ దొంగతనం చేసి ఆ బ్యాంకు ని మూతపడేలా చేసాడా? లేక జై కి దొరికిపోయాడా? జై కనుగొన్న రహస్యం ఏంటి? అన్నదే మిగిలిన కథాంశం..

అమీర్ ఖాన్ , ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ఏకైక ప్రధానాంశం, ఒకానొక సమయంలో చిత్రం చాలా నెమ్మదిగా నడుస్తున్నప్పుడు అయన నటన మాత్రమే చిత్రాన్ని కాపాడగలిగింది అంటే అయన నటనా స్థాయిని అంచనా వెయ్యచ్చు. జై పాత్రనే కొనసాగించిన అభిషేక్ బచ్చన్ గత చిత్రాలతో పోలిస్తే అంతగా ఆకట్టుకోలేకపోయాడు ఇక అలీ పాత్రా కూడా అంతంతమాత్రమే ఉండటంతో ఉదయ్ చోప్రా కూడా చెయ్యడానికి ఎం లేకుండాపోయింది. ఇక కత్రిన కైఫ్ఫ్ గురించి చెప్పుకోడానికి ఎం లేదు ఈ పాత్రకు అసలు ప్రాధాన్యత లేకపోవడంతో ఆ పాత్రా మరియు ఆమె నటన ఆకట్ట్టుకోలేకపోయింది. జాకీ ష్రాఫ్ ఉన్న కాసేపు బాగా నటించారు.

దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య , కథ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉండవలసింది చిత్రంలో చాలా వరకు నోలాన్ దర్శకత్వంలో వచ్చిన "ది ప్రెస్టేజ్" చిత్రాన్ని పోలిన సన్నివేశాలు కనిపిస్తుంది ఇక కథనం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు అసలు ఆసక్తికరంగా లేవు రెండవ అర్ర్ధ భాగం అమీర్ ఖాన్ నటన మూలాన ఆసక్తికరంగా మారింది కాని సన్నివేశాల పరంగా అంత గొప్పగా ఎం లేవు.

సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కొన్ని షాట్స్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. 'మలంగ్ మలంగ్' పాట ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు దీని వెనుక సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ పనితనం చాలా ఉంది. సంగీతం అందించిన ప్రీతం పాటలు బాగానే ఉన్న నేపధ్య సంగీతం వచ్చేసరికి ఎక్కువ సార్లు "ధూమ్ మచాలే" పాట మీదనే దృష్టి సారించాడు. అవసరం ఉన్న లేకపోయినా అదే మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటర్ కత్తిరికి ఇంకా చాలా పదును పెట్టాల్సి ఉంది 172 నిమిషాల పొడవయిన చిత్రం ఇది కాస్త కత్తిరించి ఉండాల్సింది అందులోనూ మొదటి అర్ధ భాగంలో ఉన్న కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపించాయి. ఈ చిత్రంలో స్టంట్స్ అసలు బాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ధూమ్ సిరీస్ లో చిత్రం అనగానే గుర్తుకు వచ్చేది యాక్షన్ సన్నివేశాలు, గన్స్, థ్రిల్లింగ్ చేసింగ్ సీక్వెన్స్, తెలివైన దొంగతనాలు. ఈ చిత్రంలో వీటన్నింటిని దాటుకొని ఎమోషన్స్ మరియు నటన ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మిగిలింది. అమీర్ ఖాన్ నటన మాత్రమే ఈ చిత్రాన్ని కాపాడే అంశము , ఇక కథనం విషయానికి వస్తే మొదటి అర్ధ భాగం లాజిక్ అసలు ఉండదు రెండవ అర్ధ భాగం కూడా అలానే నడుస్తుంది కాని అమీర్ నటన మాత్రమే ఈ తప్పులన్నింటిని కవర్ చేస్తుంది. ఈ సినిమా లో కొన్ని విషయాల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి మొదటగా అభిషేక్ బచ్చన్ ఇంట్రడక్షన్ ఫైట్ అసలు బేసిక్ లాజిక్ కూడా ఉండదు.

ఇలాంటిదే మరొక సన్నివేశం ఉంటుంది అమీర్ బైక్ చేసింగ్ సన్నివేశంలో బైక్ బోటు గా మారినప్పుడు ప్రతి ప్రేక్షకుడు అవాక్కయ్యే ఉంటారు. దొంగతనాల తో ఫేమస్ అయిన ధూమ్ సిరీస్ లో వచ్చిన ఈ చిత్రంలో ఒక్క దొంగతనం కూడా చూపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రతి సన్నివేశంలోను దొంగతనం అయిపోయాక జరిగే చేసింగ్ గురించే చూపించారు కాని దొంగతనం ఎలా చేసారు అన్న ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అన్నింటికన్నా నిరాశపరిచే అంశం ఈ చిత్రం "ది ప్రెస్టేజ్" ని పోలి ఉండటం. ఎప్పటిలా కాకుండా ఈ ధూమ్ చిత్రం యాక్షన్ కాకుండా ఎమోషన్ అనే అంశం మీద నడిపించారు. యాక్షన్ సన్నివేశాలు, చేసింగ్ సన్నివేశాల కోసం వెళ్ళిన వారు నిరాశ పడటం ఖాయం , కాని ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడటానికి గల ఏకైక కారణం అమీర్ ఖాన్ అయన నటన కోసం అయిన ఈ చిత్రాన్ని మిస్ అవ్వకుండా చూడండి..

Aamir Khan,Katrina Kaif,Vijay Krishna Acharya,Aditya Chopraధూమ్ 3 : ఓన్లీ అమీర్ ఖాన్ షో

మరింత సమాచారం తెలుసుకోండి: