తాగుబోతు రమేష్ తాగుబోతు రమేష్ కథనం,లిప్ సింక్ లేకపోవడం ,సస్పెన్స్ లేదు ,రొటీన్ స్టొరీ నాగ లంక అశ్విన్(అరవింద్ కృష్ణ) , అజయ్ దగ్గర పనిచేసే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , చిట్టి రాజు(వెన్నెల కిషోర్) రఘు కంపెనీ లో పని చేస్తూ ఉంటారు. ఇద్ద వాళ్ళ వాళ్ళ కంపెనీలలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఇదిలా ఉండగా నాగ లంక అశ్విన్ , దీక్షతో ప్రేమలో పడతాడు , ఆ తరువాత అతని జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి ని తట్టుకోడానికి రఘు మరియు అశ్విన్ కలిసి వారి బాస్ లు అయిన రఘు మరియు అజయ్ లను చంపేయడానికి షాడో(అలీ) సహకారం తీసుకుంటారు. కాని ఈలోపే రఘు ని ఎవరో చంపేసి ఉంటారు ? చిట్టి మరియు అశ్విన్ వారి నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నారు అన్నదే మిగిలిన కథ.ఈ చిత్రంలో నటించిన అందరు నటులలో ఒక్క తాగుబోతు రమేష్ మాత్రమే లిప్ సింక్ కి సరిపోయేలా డబ్బింగ్ కరెక్ట్ గా చెప్పగలిగారు మిగిలిన అందరు " డబ్బింగ్ లో సరిచేసుకోవచ్చు లే" అనుకునే వాళ్ళే ఒక్కరంటే ఒక్కరు కూడా లిప్ సింక్ కి సరిపడేలా డబ్బింగ్ చెప్పలేకపోయారు. ఋషి మరియు ఇట్స్ మై లవ్ స్టొరీ వంటి చిత్రాలలో నటించిన అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో బాగానే నటించారు. డింపుల్ తన అందాలతో బానే ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ తనదయిన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ తాగుబోతు రమేష్ అయన పాత్రా తెర మీద ఉన్నంతసేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అజయ్, రఘు రాజు మరియు అలీ పరవలేధనిపించారు. ఈ చిత్ర కథ చాలా సింపుల్ గ ఉంటుంది కొన్ని చోట్ల చాలా తెలుగు చిత్రాలను తలపిస్తుంది. దర్శకుడు అనిల్ గోపి రెడ్డి ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ ల తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డాడు కానీ నేరేషన్ లో విఫలం అయి ఇలాంటి జోనర్ కి ముఖ్యమయిన సస్పెన్స్ ని చివరి దాకా మైంటైన్ చెయ్యలేకపోయాడు. కథనంలో వేగం నెమ్మదిగా తగ్గుతూ వచ్చి ఒకానొక చోట పూర్తిగా కదలకుండా ఆగిపోతుంది. ఇక లాజిక్ లు గురించి మాట్లాడటం మొదలెడితే ఒకటా రెండా .. వాటి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.. ఈ చిత్రానికి అనిల్ అందించిన సంగీతం పరవాలేదు నేపధ్య సంగీతం అవసరానికి మించి ఎక్కువగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది చిత్రానికి కావలసిన మూడ్ ని బాగానే సృష్టించారు. ఎడిటింగ్ విషయంలో మరింత "కట్" చేసి ఉంటె బాగుండేది , ఇరమన విలువలు పరవాలేదు.. ఈ చిత్రం ఈ ఏడాదిలో వచ్చిన మొదటి రెండు చిత్రాలలో ఒకటి , ఈ చిత్రం మొదలయ్యేది క్రైమ్ కామెడీ గానే మొదలవుతుంది కాని చివరికి వచ్చేసరికి రొటీన్ బోర్ సినిమా గ తయారయ్యింది. ఏదయితే ఒక క్రైమ్ థ్రిల్లర్ కి అవసరమో ఈ చిత్రంలో అదే లేదు "సస్పెన్స్ తో కూడిన వేగవంతమయిన కథనం ". పోనీ కాస్త కామెడీ తో అయిన కవర్ హెసర అంటే తాగుబోతు రమేష్ ఒక్కడే ఈ చిత్రాన్ని సీరియస్ గా తీసుకొని నటించారు. మొత్తానికి ఈ చిత్రంలో క్రైమ్ ఉంది కానీ సస్పెన్స్ లేదు కామెడీ లేదు కరెక్ట్ కథనం లేదు మొత్తంగా ఈ చిత్రానికి ఏదయితే కావాలో అదే ఈ చిత్రంలో లేదు.. మీ ఏడాదిని ఇలాంటి చిత్రంతో మొదలుపెట్టమని అయితే మేము చెప్పలేము తరువాత మీ ఇష్టం Arvind Krishna,Dimple Chopade,Anil Gopal Reddy,Sravanthi, Rajబిస్కెట్ - ప్రేక్షకులకు పెద్ద "బిస్కెట్"

మరింత సమాచారం తెలుసుకోండి: