సెకండాఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సెకండాఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సాగదీసిన ఫస్ట్ హాఫ్ ,శ్రీ కాంత్ పాత్రకి చేసే పనికి సంబందం లేకపోవడం,సరైన ముగింపు లేని క్లైమాక్స్ లండన్ లో పుట్టి పెరిగిన మధు(కుంకుమ్) ఇండియాలోనే ఉండాలనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చి తన బంధువుల సాయంతో తన పాత ఇంటిని బాగు చేసుకుంటుంది. అలా వచ్చిన మధుని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ తను ఎం చేస్తుందో ఎక్కడి వెళుతుందో కనుక్కోమని దావూద్(జయప్రకాశ్ రెడ్డి) డబ్బు కోసం ఏమన్నా చేసే రౌడీ శ్రీ కాంత్ ని నియమిస్తాడు. అదే తరుణంలో మధు తాతయ్య కోట శ్రీనివాసరావు మనవరాలిపై క్షుద్ర శక్తులతో చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్షుద్ర శక్తుల వల్ల మధు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోందా అని తెలుసుకోవడానికి ఓ మానసిక వైద్యుడి దగ్గరకు వెళితే మధుకి తన గురించి ఒక నమ్మలేని నిజం తెలుస్తుంది. ఆ నమ్మలేని నిజం ఏమిటి? మధుని క్షుద్ర శక్తుల నుంచి కాపాడటానికి శ్రీ కాంత్ ఏం చేసాడు? అసలు దావూద్ ఎవరు? సొంత తాతయ్య మధుని ఎందుకు చంపాలనుకున్నాడు? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే... గత కొంతకాలంగా వివిధ రకాల పాత్రలతో ప్రయోగాలూ చేస్తున్న శ్రీకాంత్ మరోసారి విభిన్నమయిన 'రొటీన్' పాత్రలో నటించాడు ఈ పాత్ర గతంలో వఛ్చిన మహాత్మ చిత్ర పాత్రను పోలి ఉంటుంది. శ్రీకాంత ఎప్పటిలానే తనవంతు ప్రయత్నం చేసి బాగా నటించారు. కుంకుం కి మంచి పాత్రయితే దక్కింది కాని తన ప్రతిభను చూపించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు . సైక్రియాటిస్ట్ పాత్రలో నటించిన రావు రమేష్ చాలా బాగా నటించారు కోట శ్రీనివాసరావు అయన అనుభవాన్ని మొత్తం రంగరించి నటించారు. నటులు ఏదో ఉన్నరంతే అనిపించుకున్నారు .... దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని అయితే ఎంచుకున్నాడు కాని కథనం మరియు దర్శకత్వం విషయంలో ఘోరంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా కథనం అయితే చాలా నెమ్మదిగా ఉండటమే కాకుండా అర్ధ రహితంగా ఉంది. సినిమాటోగ్రఫీ పరవాలేదు, ఎడిటింగ్ విషయంలో కత్తిరించడం మొదలు పెట్టి ఉంటె ఫస్ట్ హాఫ్ లో సగానికి పైగా ఉండేది కాదు ఎడిటర్ ఏ ఉద్దేశం తో వదిలేసారో ఆయనకే తెలియాలి. సంగీతం బాగుంది కాని సాయి కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం అసలు బాలేదు. నిర్మాణ విలువలు ఆకట్టుకోలేదు చాలా చోట్ల సన్నివేశాలు నాసిరకంగా కనిపిస్తాయి. చరిత్ర కి ప్రస్తుతానికి లింక్ పెట్టి రచించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే కాని కథనం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్త అసలు కనపడదు. శ్రీకాంత్ కూడా ఏదో నటించాలి అన్నట్టు నటించినట్టు కనిపిస్తుంది. దర్శకుడు కథనం మీద ఎడిటర్ కత్తిరించడం మీద కాస్త శ్రద్ద తీసుకొని ఉంటె చాలా బాగుండేది. మొదటి అర్ధ భాగం దారుణంగా ఉంటుంది, చెప్పాల్సిన విషయం మొత్తాన్ని రెండవ అర్ధ భాగం కోసం దాచి పెట్టుకొని మొదటి అర్ధ భాగాన్ని టైం పాస్ సన్నివేశాలతో నింపి వెయ్యాలన్న ఆలోచనతో దర్శకుడు చాలా నాసిరకమయిన సన్నివేశాలను రచించాడు. ఇక రెండవ అర్ధ భాగంలో "విషయాన్ని" ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు. మొత్తానికి ఈరోజు విడుదల ఇది మీ సంవత్సరాన్ని ఆరంభించడానికి సరయిన చిత్రం కాదు... లేదు శ్రీకాంత్ అభిమానిని అంటారా ఒకసారి మీరే ఈ చిత్రాన్ని ప్రయత్నించి చూడండి ... Srikanth,Kumkum,Udhay Chandhu,Mahendra Varmaక్షత్రియ - ప్రేక్షకుడి మీద "కక్ష"త్రియ

మరింత సమాచారం తెలుసుకోండి: