సుమంత్ నటన,కీరవాణి సంగీతం సుమంత్ నటన,కీరవాణి సంగీతంపింకి సవిక నటన,పాత చింతకాయ పచ్చడి లాంటి కథ,అసలు గ్రిప్పింగ్ గా లేని కథనం,నటీనటులను పూర్తి స్థాయిలో ఉపయొగించులెక పోవడం

పదవ తరగతి పద్నాలుగు సార్లు తప్పిన బుల్లబ్బాయి (సుమంత్ అక్కినేని) , అమెరికా లో పని చేసే నీలవేణి(పింకి సవిక) బుల్లబ్బాయికి మరదలు అవుతుంది. నీలవేణికి పెళ్లి చెయ్యడానికి తండ్రి ప్రయత్నిస్తుంటాడు కాగా నీలవేణి తిరిగి తనకి నచ్చినత్తి బతకడానికి తిరిగి అమెరికా వెళ్లిపోవాలన్న ఆలోచనలొ ఉంటుంది. కాబట్టి బుల్లబ్బాయిని పెళ్లి చేసుకొని తనతో అమెరికా వెళ్లిపోవచ్చని పథకం వేస్తుంది. అప్పటికే నీలవేణి ఉన్న బుల్లబ్బాయి ఈ విషయం తెలిసినా కూడా పెళ్ళికి ఒప్పుకుంటాడు. పెళ్లి అయిపోయి అమెరికా వెళ్ళిపోయినా నీలవేణి అక్కడ తనకి సరిపోయే భర్త కోసం వెతుకుతుంటుంది. బుల్లబ్బాయి నీలవేణి ప్రేమను గెలిచాడా? నీలవేణి అనుకుంటున్న తనకి సరిపోయే భర్త దొరికాడా ? అన్నది మిగిలిన కథ .

ఈ చిత్రంలో సుమంత్ చాలా ఉత్సాహంగా కనిపించాడు, అలానే అమాయకమయిన పల్లెటూరి యువకుడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు గతంలో చేసిన చిత్రాల కన్నా ఈ చిత్రంలో చాలా పరీపఖ్వతతొ కూడిన నటన కనబరిచారు కాని అయన టైమింగ్ ఇంకా మెరుగ్గా ఉంటె చాలా బాగుండేది, థాయ్ ల్యాండ్ నటి పింకి సావిక నటనా పరంగా శూన్యం, లిప్ సింక్ అసలు కుదరలేదు. కంచి ఉన్న కాసేపు చాలా చిరాకు పెట్టాడు. అమ్మి రాజు పాత్రలో తాగుబోతు రమేష్ జస్ట్ ఓకే అనిపించుకున్నాడు ఈ చిత్రంలో ఏ నటుడు కూడా పూర్తి మార్కులు సంపాదించుకోలేక పోయారు. నటనా పరంగా ఏదయినా చెప్పుకోవాలంటే రెండు మూడు సన్నివేశాలలో నటించిన నటులు మాత్రమే బాగా నటించారు సినిమా మొత్తం నడిచే పాత్రలలో నటించిన నటులు పూర్తిగా విఫలం అయ్యారు.

దర్శకుడిగా చంద్ర సిద్దార్థ్ ఘోరంగా విఫలం అయ్యాడు చెప్పాలనుకున్న పాయింట్ ఇప్పటికే చాలా చ్చిత్రలలొ చూసిందే, హిందీ "నమస్తే లండన్" చిత్రం పోలి ఉంటుంది ఇక కథనం విషయానికి వస్తే దర్శకుడు చెప్పాలనుకున్న విషయం మొదటి అర్ధ భాగం అర్ధంలో నే అర్ధం అయిపోతుంది ఇక అదే విషయాన్నీ చాలా బోరింగ్ గా చెప్పారు. డైలాగ్స్ పర్లేదు బానే ఉన్నాయి. సంగీతం విషయానికి వస్తే పాటలు పర్లేదు నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బానే ఉన్నా కొన్ని సన్నివేశాలలో అవసరానికన్నా ఎక్కువగా ఇచ్చాడు. రెండవ అర్ధ భాగం ఎడిటింగ్ చేసినట్టు కూడా అనిపించదు ఈ విభాగం కాస్త శ్రద్ద తీసుకొని ఉంటె రెన్ద్దవ అర్ధ భాగం కాస్త బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి ..

ఒక చిత్రాన్ని ఎంత రొటీన్ గా తీయగాలమో ఎవరికయినా చూడాలి అనిపిస్తే ఈ చిత్రాన్ని చూడాల్సిందే, ఇప్పటికే చాలా సార్లు వచ్చేసిన ఈ కథని మళ్ళీ అలానే తీయడం మూలాన ఒరిగేది ఏమి ఉండదు అని దర్శకుడు గ్రహించలేకపోయాడు. ఎప్పుడు లేనిదీ సుమంత్ చాలా ఉత్సాహంగా నటిస్తున్నా చంద్ర సిద్దార్థ్ రాసుకున్న సన్నివేశాలు అటు అయన ఉత్సాహాన్ని ఇటు ప్రేక్షకుడి సహనాన్ని నీరుగార్చేసాయి. అయన తెలివి తేటలు ఉపయోగించి తెలుగు అమ్మాయిలను కాదని బాలివుడ్ అమ్మాయిలను వద్దని తెచ్చుకున్న థాయిలాండ్ మోడల్ పింకి సావిక ప్రేక్షకుడిని పెట్టిన హింస వర్ణనాతీతం తనకి వచ్చిన అన్థన్హ మాత్రపు నటనతో పరవలెధనిపించింది కాని ఇంగ్లీష్ మాట్లాడిన హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్పారు, హిందీ మాట్లాడిన హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్పడం చూసాం మలయాళం మరియు తమిళం కూడా అలవాటయిపోయింది కాని తెలుగు తెర పై గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు చిత్రంలో ఒక తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర పోషిస్తున్న కథానాయిక థాయ్ భాషలో లిప్ ఇస్తుంటే దానికి తెలుగు డబ్బింగ్ చెప్పారు ఇదే మొదటిసారి ఇచే చివరిసారి అయినా బాగుంటుంది చిత్రంలో ఇబ్బంది పెట్టిన విషయాలు అని లిస్టు తాయారు చేస్తే ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఇక ఈ లిస్టు లో రెండవ స్థానం దక్కించుకుంది ఎస్ ఎస్ కాంచి ఈయన పాత్ర ఎంతలా విసిగించింది అంటే అయన తెర మీదకు రాకపోతే బాగుంటుంది అని ప్రేక్షకుడిని ఫీల్ అయ్యేలా చేసారు. ఈ సినిమా సరిగ్గా దెఅల్ చేసుంటే ఫ్యామిలి ప్రేక్షకులను ఆకట్టుకునేది కాని దర్శకుడు చంద్ర సిద్దార్థ ఈ చిత్రాన్ని మలచిన విధానం మూలాన ఈ చిత్రం ఎవరికీ నచ్చకుండా పోయింది.. ఏదో పరవాలేదనిపించే మొదటి అర్ధ భాగం అబ్బే ఎం లేదు అనిపించే రెండవ అర్ధ భాగంతో బాలన్స్ అయిపోయి చిత్రం కూడా శూన్యంగా మిగిలిపోయింది.. ఈ చిత్రాన్ని స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం ఇచ్చారు అని తప్ప చూడటానికి మరొక కారణం లేదు...

Sumanth,Pinky,Chandra Siddardh,Madan,M.M. Keeravani. ఏమో గుర్రం ఎగరావచ్చు : ఇలాంటి గుర్రాలు ఎప్పటికి ఎగరలేవు ...

మరింత సమాచారం తెలుసుకోండి: