నాని - వాణి జోడి,సంగీతం,సినిమాటోగ్రఫినాని - వాణి జోడి,సంగీతం,సినిమాటోగ్రఫిదర్శకత్వం,సెకండ్ హాఫ్,ఎడిటింగ్, క్లైమాక్స్

శక్తి (నాని ) పల్లెటూరి నుంచి కాలేజీ లో చదువుకుంటున్న కుర్రాడు. చదువు కన్నా మిగతా అన్నిటి మీదా అతనికి శ్రద్ధ ఎక్కువ. అతని తండ్రి చదువు అయిపోగానే ఊరు వచ్చి పొలం పనులు చూసుకోమంటాడు. ఒక పెళ్లి లో శృతి (వాణి ) ని చూస్తాడు. ఆమె తో స్నేహం పెంచుకుని ఆమె వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో చేరతాడు. శృతి శక్తి కి 'స్నేహం వరకే' .. అని రూలు పెడుతుంది. ఆమె చందా (సిమ్రన్ ) దగ్గర పని నేర్చుకుని చందా లాగే పెద్ద పెద్ద పెళ్లిలు చేయించాలి అనుకుంటుంది. 'గట్టి మేళం' అనే కంపెనీ మొదలుపెడుతారు. పెళ్లిలు బాగా చేయిస్తారు అని పేరు తెచ్చుకుంటారు. బిజినెస్ బాగా పెరుగుతుంది . అనుకోకుండా శృతి శక్తి తో ప్రేమ లో పడుతుంది. కాని శక్తి కి ఎం చెయ్యాలో అర్ధం కాదు. విడిపోతారు. తరువాత ఏమయ్యింది ? శక్తి - శృతి ప్రేమ ని అంగీకరించాడా లేదా? అనేది మిగిలిన కథ .

మంచి నటుడి గా పేరు తెచ్చుకున్న నాని మరోసారి బాగా చేసాడు. ముఖ్యం గా హాస్య సన్నివేశాల్లో అతను చాలా బాగా చేసాడు. కాని హిందీ లో రంవీర్ సింగ్ నటన లో కనపడిన ఫ్రెష్ నెస్ ముందు నాని తేలిపోయాడు అనే అనాలి. వాణి కపూర్ చాల అందం గా ఉంది అంతకన్నా అందం గా నవ్వింది. కాని అనుష్క శర్మ అంత బాగా చెయ్యలేకపోయింది. ఒక నాటి అందాల నటి సిమ్రన్ నటన మనని పెద్ద గా ఆకట్టుకోదు. ఇతర పాత్రల్లో చేసిన వారు బానే చేసారు. హిందీ మాతృక బాగా నచ్చిన వారు ఈ తమిళ తెలుగు సినిమా ని ఆ సినిమా తో పోల్చకుండా ఉండలేరు. ఆ పోలిక లేకుండా చుసిన వారికి వీరి నటన బాగా నచ్చుతుంది.

హిందీ సినిమా బ్యాండ్ బాజా బారత్ ని తమిళం లో అహ కళ్యాణం అని యష్ రాజ్ సంస్థ సోంతం గా నిర్మించింది. తమిళం లో ఏంటి అంటే మరి తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. డైరెక్టర్ చాల తడబడ్డాడు. మక్కి కి మక్కి దించడం లో కూడా బాగా తడబడ్డాడు. స్టోరీ చాలా చిన్నది అయిన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేద్దాం అనుకున్నారు అది అంత గా కుదరలేదు. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఇచ్చాడు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు . సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు పేరు కు తగట్టు చాలా హుందా గా ఉన్నాయి.

ఒక బాష లో బాగా పేరు తెచ్చుకున్న సినిమా ని మరో బాష లో తియ్యడం అదే రీమేక్ చెయ్యడం చాల కష్టం. అందులోనూ పాత కథ నే కొత్త గా చెప్పిన బ్యాండ్ బాజా బారత్ ని ఇంకా కష్టం. ఆ సినిమా లో ముఖ్య పాత్రల్లో నటించిన వారి మధ్య కేమిస్త్రి వల్లే ఆ సినిమా లో తాజాదనం కనపడుతుంది. ఆ తాజాదనం మనని బాగా ఆకట్టుకుని ఒక మంచి సినిమా చూసాం అన్న ఆనందాన్ని మిగులుస్తుంది. ఇక్కడ అదే లోపించింది.

ముఖ్యం గా కావలసిన అంశం కట్టిపడేసే కథనం అది లేకపోవడమే పెద్ద లోపం. ఒక తెలుగు హీరో తో తమిళం లో తీసి ఆ తరువత తెలుగు లో డబ్బింగ్ చెయ్యమన్న ఆలోచన ఎవరిదో కాని వారికి వేల కోటి నమస్కారాలు . తెలుగు వారి సంప్రదాయాలు వేరు వారి పద్దతులు వేరు. తమిళ తంబి ల పద్దతులు వేరు . దర్శకుడు కూడ ఎక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. మొత్తానికి ఎంతో బాగుంటుంది అనుకున్న సినిమా ఇంకా ఇంకా బాగుండొచ్చు అనిపించేసి వొదిలెసారు. నాని వాణి జోడి వల్ల పెద్ద గా ఒరిగింది ఏమి లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం నాని.

Nani,Vaani Kapoor,Gokul Krishna,Aditya Chopra.ఆహా కళ్యాణం: ఈ కళ్యాణం లో లేదు మజా

మరింత సమాచారం తెలుసుకోండి: