నాని నటన,సంగీతం నాని నటన,సంగీతం పైన చెప్పినవి కాకుండా మిగిలినవి అన్నీ

పైసాయే పరమాత్మ అనుకునే రకం ప్రకాష్ (నాని) శెర్వని మోడల్ గా చేస్తుంటాడు , ప్రకాష్ ని నూర్ (కేథరిన్ త్రెస) ప్రేమిస్తుంది. కాని ప్రకాష్ కి నూర్ అంటే ఆసక్తి ఉండదు ఇదిలా ఉండగా రాయలపాట్నం నుండి బై ఎలెక్షన్ లో పోటీ చేస్తుంటారు సన్నాసి నాయుడు మరియు సారధి. సన్నాసి నాయుడు కూతురు అయిన స్వీటీ(లక్కీ శర్మ) మరియు ప్రకాష్ దగ్గరవుతారు వీళ్ళని చూసిన నూర్ వారి దగ్గరితనాన్ని ఆహ్వానించి యాదవ్ తో ముజ్ర డాన్సు చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. సన్నాసి నాయుడు ని ఎలెక్షన్ లో ఓడిపోయేలా చెయ్యడానికి సారది హవలాలొ వచ్చిన యాభై కోట్లను దొంగతనం చెయ్యాలని అనుకుంటాడు కాని యాదవ్ నుండి నూర్ ని కాపాడే ప్రయత్నంలో ప్రకాష్ సన్యాసి నాయుడు మరియు సారధి మధ్యలో ఇరుక్కుపోతాడు.. ఇక్కడ నుండి ప్రకాష్ ఎలా బయటపడ్డాడు? నూర్ ని పెళ్లి చేసుకున్నాడా లేదా? స్వీటీ ఏమయింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం ..

నాని కి సరిగ్గా సరిపోయే పాత్ర ప్రకాష్ అయన స్థాయికి మించి ఈ చిత్రంలో నటించారు రియాల్టీ కి దగ్గరగా ఉండే ఈ పాత్రా నానికి వంద శాతం నప్పింది. కేథరిన్ త్రెస నటన లో రెండు హావభావాలను మాత్రమే చూపెట్టి చిత్రం మొత్తం కానిచ్చేసింది. లక్కీ శర్మ అందాలను ఆరబోసింది , ఈ చిత్రంలో ఈ పాత్రను ఇందుకోసమే రాసుకున్నారు కాబట్టి ఈ లక్కీ శర్మ ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేసింది. చరణ్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో బాగా నటించారు. బ్రహ్మానందం కి సరితూగే నటుడు అనే లేబుల్ తో తెర మీదకు వచ్చిన తాబర్ బొత్తిగా ఆకట్టుకోలేకపోయాడు. దువ్వాసి మోహన్ , రాజ రావిద్ర , భరత్ లాంటి వాళ్ళకి చిన్న చిన్న పత్రాలను ఇచ్చి సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.

కథ బలంగా లేదు ఇప్పటికే చుసిన రెండు మూడు చిత్రాలను పోలి ఉంటుంది, ఇక కథనం విషయానికి వస్తే ఇలాంటి చిత్రాలకు ప్రాణం అయిన కథనం విషయంలో బొత్తిగా జాగ్రత్త వహించలేదు చిత్రంలో ఎక్కడ కూడా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కాలేకపోయాడు. మొదటి అర్ధ భాగం కాస్త నెమ్మదిగా సాగుతుంది దీంతో పోలిస్తే రెండవ అర్ధ భాగం పరవాలేదనిపిస్తుంది. ఈ చిత్రం డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సాయి కార్తీక్ అందించిన పాటలు అసలు ఆకట్టుకోలేదు కాని అయన అందించిన నేపధ్య సంగీతం పరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ అందించిన సంతోష్ రాయ్ జస్ట్ ఒకే అనిపించారు.

మొగుడు చిత్రంతో తన అభిమానులను నిరాశ పరిచిన కృష్ణ వంశీ తన పంథాను అసలు మార్చినట్టు కనిపించదు కొత్తరకం ప్లాట్ తో జనం ముందుకు వచ్చిన తనదయిన మార్క్ సన్నివేశాలలో కూడా ఆకట్టుకోలేకపోయాడు. సరిగ్గా చెప్పాలంటే క్రియేటివ్ దర్శకుడు అని పేరున్న కృష్ణ వంశి తన ఈ చిత్రం కోసం తన క్రియేటివిటీ ని ఏ మాత్రం ఉపయోగించకుండా తెరకెక్కించారు ఇప్పటి వరకు కృష్ణ వంశీ చిత్రమో పాతాళ చిత్రీకరణ బాగాలేదు అని ఎప్పుడు అనిపించలేదు మొదటి సారి ఈ చిత్రంతో ఆ ఫీల్ వస్తుంది. ఎంతో మంచి ఎంటర్ టైనర్ గా థెరకెక్కించగల ఈ చిత్రాన్ని అంత ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. నాని నటన మరియు రెండవ అర్ధ భాగంలో రెండు మూడు సన్నివేశాల కోసం మహ్రమె ఈ చిత్రాన్ని చూడవచ్చు ,మీరు కృష్ణ వంశీ కి మరియు నాని కి ఫ్యాన్ అయితే ఆ కారణంతో ఈ చిత్రాన్ని చూడటానికి మీ ఓపిక మీకు సహకరిస్తుంది లేదంటే ఈ చిత్రం మీకోసం కాదు...

Nani,Catherine Tresa,Krishna Vamshi,Ramesh Puppala,Sai Karthik.పైసా : పైసాకి కూడా .....

మరింత సమాచారం తెలుసుకోండి: