మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం,అక్కడక్కడ వచ్చే కొన్ని మంచి సన్నివేశాలు,సినిమాటోగ్రఫీమణిశర్మ అందించిన నేపధ్య సంగీతం,అక్కడక్కడ వచ్చే కొన్ని మంచి సన్నివేశాలు,సినిమాటోగ్రఫీకథనం,లాజిక్ లెస్ సన్నివేశాలు,ఎమోషన్ లెస్ నేరేషన్

అర్జున్ (గౌతం), అబ్బాస్ (రణధీర్) మరియు మల్లి (ధనరాజ్) బసంతి కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు. మనసు ఎలా చెబితే అలా వినే అర్జున్ ఒకరోజు రోషిని(ఆలీషా )ని చూసి ప్రేమలో పడతాడు. అప్పటి నుండి రోషిని వెంట పడుతూ ఉంటాడు అర్జున్. అర్జున్ చేసిన మంచి పనులను చూసి రోషిని అర్జున్ తో స్నేహం చేస్తుంది. ఈలోగా రోషిని కి లండన్ విశ్వవిద్యాలయం లో సీట్ వచ్చి లండన్ పయనం అవడానికి సన్నాహాలు మొదలు పెడుతుంది ఈ విషయం తెలుసుకున్న అర్జున్ ముందు బాధ పడినా ఎలాగయినా తన ప్రేమను చెప్పేయాలని ఎయిర్ పోర్ట్ కి వెళ్తాడు ఇదిలా సాగుతుండగా కరుడుగట్టిన ఉగ్రవాది అయిన బాబర్ ఖాన్ ను ఎలాగయినా విడుదల చేయించాలని పాకిస్తాన్ నుండి వస్తాడు ఘాజి ఖాన్ . ఘాజి ఖాన్ సహచరుడు అయిన రజాక్ పట్టుబడటంతో ఈ విషయం తెలుసుకున్న అలీ ఖాన్ (షాయాజీ షిండే) ఘాజి ఖాన్ మీద ఆకస్మిక దాడి చేస్తాడు. అక్కడ నుండి తప్పించుకోడానికి ఘాజి ఖాన్ బసంతి కాలేజీ ని ఆక్రమించి అక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకొని బాబర్ ఖాన్ ని విడుదల చెయ్యమని అడుగుతాడు. పోలీస్ లు బాబర్ ఖాన్ ని విడుదల చేసారా? అర్జున్ స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు? రోషిని అర్జున్ ప్రేమను అంగీకరించిందా? అనేవి మిగిలిన కథను కదిలించే విషయాలు ...

గౌతం చాలా బాగా చేసారు ముఖ్యంగా పాత్రకు కావలసినంత ఎనేర్జి ఇవ్వడంలో విజయం సాదించాడు కాని ఎమోషనల్ సన్నివేశాల దగ్గర బాగా తేలిపోయాడు ఈ విషయంలో అతను చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆలీషా పాత్ర చాలా చిన్నది కాని ఆ పాత్రలోని సున్నితత్వాన్ని బయటకు తీసుకురావడంలో ఆలీషా ఘోరంగా విఫలం అయ్యింది ఒక్కోసారి ఆమె నవ్వుతుందా బాధ పడుతుందా అని అర్ధం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. రణధీర్ ఉన్నంతలో బానే చేసాడు కాని ఉన్నదే కాసేపు. తనికెళ్ళ భరణి ఆయన అనుభవాన్నంతా రంగరించి పాత్రని హైలెట్ చేసారు. వీళ్ళు టెర్రరిస్ట్ లు అని చెబితే తప్ప గుర్తు పట్టలేని కాస్టింగ్ ఉంది టెర్రరిస్ట్ లకి ...మిగిలిన పాత్రధారులందరు ఏదో అలా కనిపించి వెళ్ళిపోయిన వారే ..

దర్శకుడిగా చైతన్య దంతులూరి మరోసారి అదే తప్పును చేసారు, మంచి ప్లాట్ ని అయితే ఎంచుకున్నారు కాని దాన్ని చెప్పడానికి అయన ఎంచుకున్న మార్గం అసలు బాగోలేదు. కథనం విషయంలో ఎద్దుల బండి కూడా జెట్ విమానం అంత వేగం అనిపిస్తుంది ఈ కథనం నడిచే వేగాన్ని చూస్తే ఇది సరిపోదని కీలకమయిన ఎమోషనల్ సన్నివేశాలు ఉండవలసిన చోట పేలవం అయిన సన్నివేశాలను ఉంచి కథని నీరు గార్చేస్తే ప్రేక్షకుడిని నిరుత్సహపరిచాడు. అక్కడక్కడ వచ్చే శ్రీకాంత్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నా దానికి సరిపడా సన్నివేశాలు లేక అవి గాల్లో కలిసిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది . మణిశర్మ అందించిన సంగీతం పాటల పరంగా పరవాలేదు అనిపించింది. అయన అందించిన నేపధ్య సంగీతం నీరు గారిపోయిన సన్నివేశాలను ఎంత కాపాడాలని ప్రయత్నించిన పాపం కుదరకపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది రెండవ అర్ధ భాగం ఇంకాస్త పదునుగా ఉండవలసిన అవసరం ఉంది. చాలా సన్నివేశాలు పొడవుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పరవాలేదు.

"పది మంది గూండాలలో ఒక్కడిని కాలిస్తే మిగిలిన గూండాలకు భయం వేస్తుంది అదే ఇద్దరు సైనికుల్లో ఒకరిని కాల్చినా రెండో వాడికి తెగింపు వస్తుంది" ఈ చిత్రం మొత్తం ఈ ఒక్క డైలాగ్ లో కనిపిస్తుంది కాని ఈ డైలాగ్ లో ఉన్న పవర్ చిత్రం లో లేకుండా పోయింది ఏదో చెప్పాలని మొదలు పెట్టిన దర్శకుడు ఎం చెబుతున్నదడో అర్ధం కాకుండా పోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్రెష్ ఫీల్ కలిగే లవ్ స్టొరీ ఉన్నా దాన్ని సాగదీసిన విధానం దారుణం విశ్రాంతి సమయానికి ప్రేక్షకుడు ఆలసిపోతాడు కథనం అంత నెమ్మదిగా సాగుతుంది ఒక్కసారిగా విశ్రాంతి సమయంలో వచ్చిన మలుపు చిత్రానికి ఊపు తెచ్చినా ఆ ఊపు పది నిమిషాలే ఉంటుంది.

రెండవ అర్ధ భాగంలో వెళ్లకురా అనే పాట అప్పటి వరకు నడుస్తున్న కథనం వేగాన్ని అమాంతం పెంచినా తరువాత సన్నివేశాలలో ఆ వేగం అలా అమాంతం పడిపోయేలా జాగ్రత్త వహించాడు దర్శకుడు. అక్కడక్కడా వస్తున్న డైలాగ్స్ వెనుక వస్తున్న నేపధ్య సంగీతం బాగున్నా కూడా సన్నివేశంలో బలం లేకపోవడంతో హైలెట్ అవ్వాల్సిన సన్నివేశం కాస్త సైడ్ అయిపోతుంది. ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి .. కీలకమయిన సన్నివేశాలలో కావలసినంత ఎమోషన్ పండించడంలో దర్శకుడు ఒక్క మార్క్ కూడా దక్కించుకోలేకపోయాడు ఇక నటీనటుల సంగతి సరే సరి స్నేహితుడు చనిపోయి కింద పడి ఉంటె ఇప్పుడు నేనెలాంటి హవాభావం ప్రదర్శించాలి అన్న ప్రశ్న గౌతం మోహంలో స్పష్టంగా కనిపిస్తుంది.. మొత్తంగా చెప్పాలంటే "పునాదులు గట్టిగా వేసి పేక ముక్కల బిల్డింగ్ కట్టినట్టు ఉంది" ఈ చిత్రం ... పునాదులు ఎవరికీ కనపడవు బిల్డింగ్ ఎలా ఉందో అదే చూస్తారు అందరు ఈ విషయాన్నీ ఇకనయిన దర్శకుడు గుర్తిస్తే బాగుంటుంది.. కంటెంట్ బాగుంది వృధా అయిపోయిన ఎన్నో చిత్రాల సరసన చేరిపోతుంది ఈ బసంతి చిత్రం... ఓపిక పట్టుకొని చూడగలం అని నమ్మకం ఉంటె ఒక్కసారి చూడచ్చు అది కూడా అక్కడక్కడ వచ్చే కొన్ని మంచి సన్నివేశాల కోసం మాత్రమే ....

Gowtam,Alisha Begh,Chaitanya Dantuluri,Uma.బసంతి - బస్ - అంతే ...

మరింత సమాచారం తెలుసుకోండి: