ఈ సినిమా రిలీజ్ కావడం,అది మేము చూడాల్సి రావడం..ఈ సినిమా రిలీజ్ కావడం,అది మేము చూడాల్సి రావడం..ఎ టు జెడ్ అన్నీ మైనస్ లే...

హైదరాబాద్ వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది హారిక(షీనా), అప్పటికే ప్రేమ మూలాన కొడుకును కోల్పోయిన సుమన్ కూతురు దగ్గర ఎవరిని ప్రేమించకూడదు ఎవరి ప్రేమలో పడకూడదు అని మాట తీసుకుంటాడు. హైదరాబాద్ లో టివిఎస్ షో రూం లో మెకానిక్ గా పని చేస్తూ చాడుకున్తుంటాడు సూర్య(సాయి కృష్ణ), ఒకే కాలేజీ కావడంతో సూర్య మరియు హారిక మంచి స్నేహితులవుతారు వీరి కథ ఇలా నడుస్తుండగా సూర్య ఫోన్ లో సారు అనే ఒకమ్మాయితో మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు కూడా కాని ఇద్దరు ఒక్కసారి కూడా కలవారు. కొద్దిరోజులకు హరికకు పెళ్లి నిశ్చయం అయ్యి వైజాగ్ కి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు సూర్యను కలవను అంటున్న సారు అప్పుడు కలవాలి అని అంటుంది కాని సూర్య కొన్ని కారణాల మూలాన కలవలేకపోతాడు. సారు వైజాగ్ లో ఉందని తెలిసిన సూర్య సరుని వెతుక్కుంటూ వైజాగ్ వెళ్తాడు అక్కడ సూర్య సరు ని కలిసాడా లేదా? హారిక పెళ్లి ఏమయ్యింది? అన్న డౌట్స్ ఉంటె థియేటర్ కి వెళ్ళిపోవడమే ...

సినిమాకి కెప్టెన్ డైరెక్టర్ అయినా సినిమా తెరపై కనిపించేది మాత్రం హీరోనే కాబట్టి ఆడియన్స్ అందరూ హీరోనే కెప్టెన్ అంటారు. ఆ ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకి హీరో సాయికృష్ణ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.. సాయి కృష్ణ బాడీలో ఈజ్ ఉంది కానీ ఆ ఈజ్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ లో కూడా ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలో అన్ని సీన్స్ కి దాదాపు ఒకే డంబ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ప్రేక్షకులకి చిరాకు తెప్పించాడు. చాలా చోట్ల గాగుల్స్ పెట్టి ట్రై చేసారు కానీ అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక షీనా పాటల్లో గ్లామరస్ కనిపించింది కానీ నటనలో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. సుమన్, తనికెళ్ళ భరణి తమ పాత్రలకి న్యాయం చేసారు. ప్రవీణ్ ఉన్న రెండు మూడు సీన్స్ లో గోదావరి యాసలో బాగానే నవ్వించాడు. ఇక మిగిలిన నటీనటులంతా నటన తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ చేసారు.

ఈ సినిమాకి సాంకేతిక విభాగంలో ఎవరి గురించి అన్నా చెప్పాలా అంటే అది ఒక్క సినిమాటోగ్రాఫర్ గురించే.. ఎందుకంటే తను మాత్రమే తనకి ఇచ్చిన పనిని పక్కాగా చేసాడు. విజువల్స్ చూడటానికి బాగున్నాయి. ఇక ఎవరు తమ పనిని సరిగా చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ హాలీవుడ్ మ్యూజిక్ ని తీసుకొని బ్యాక్ గ్రౌండ్ లో కొట్టేసాడు, అలాగే అతను కంపోజ్ చేసిన ఒక్క పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎడిటర్ మరీ గుడ్డిగా చేసాడో ఏమో కానీ చాలా అవసరం లేని సీన్స్ ని అలానే ఉంచేసాడు. ఫస్ట్ హాఫ్ సినిమాకి పెద్ద మైనస్, సెకండాఫ్ ని ఏదో పరవాలేదనిపించేలా కట్ చేసాడు. ఇక డైలాగ్ రైటర్ చేత రాయించిన భూతు డైలాగ్స్ ని ఆడియన్స్ ఛీ కొట్టారు, ఎమోషనల్ సీన్స్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. రామ్ వెంకీ ఈ సినిమాకి రాసుకున్న కథని చాలా సూపర్ హిట్ సినిమాల్లో నుంచి తీసుకొని రాసుకున్నది. డైరెక్టర్ చెప్పిన పాయింట్ ని అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమలేఖ నుంచి ఈ మధ్య వచ్చిన ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు లాంటి సినిమాలో కూడా చూసాం. ఇక డైరెక్టర్ గా అయితే చాలా పూర్ జాబ్ ని కనబరిచాడు, పైన చెప్పినట్టు సినిమాకి హీరోనే మైనస్, అతని ఏదో మానేజ్ చేసి ఏదో చూపించాలనుకున్నాడు కానీ అది సరిగా కుదరక బొక్క బోర్లా పడ్డాడు. సో డైరెక్టర్ గా ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు.

డైరెక్టర్ పాత సినిమాలని స్ఫూర్తి గా తీసుకొని ఒక సినిమా కథని రాసుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచో లేపింది అని గానీ, అలాగే బోర్ కొట్టడం గానీ జరగకూడదు. అలా జరిగితే ఆ డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే.. అదే ఈ సినిమా విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ ఎక్కడి నుంచి లేపాడు అనేది డైరెక్టర్ క్లియర్ గా చెప్పేస్తుంటే ఇక ప్రేక్షకులు ఎంతవరకూ సినిమాని ఎంజాయ్ చేస్తారు. కనీసం ఆ ఫ్లేవర్ ని పోగొట్ట లేకపోయినా కనీసం ఎంటర్ టైన్మెంట్ అన్నా ఉండేలా చూసుకోవాల్సింది. కానీ అది కూడా లేకపోవడంతో ప్రేక్షకులకి మరింత బోర్.. అసలు ఓవరాల్ గా సినిమాకి ఫస్ట్ హాఫ్ లో ఒక 20 నిమిషాలకంటే మించి అవసరం లేదు, అంటే డైరెక్టర్ ఒక 40 నిమిషాలు సాగదీశాడు, అలాగే 40 నిమిషాలు భుతూ కామెడీ పాటలు పెట్టడానికి ట్రై చేసి సెకండాఫ్ చూడాలి అన్న ఫీలింగ్ ని పోగొట్టేసాడు. ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు సినిమా థియేటర్ కి కాదుకదా టీవీలో వస్తుందని ఎదురు చూడడం కూడా సరైన నిర్ణయం కాదు. సినిమా టైటిల్ లో బంగారం అని పెట్టుకున్న డైరెక్టర్ సినిమా కనీసం ఇత్తడి రేంజ్ లో అన్నా ఉండేలా కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.

Sai Krishna,Sheena Shahabadi,Ram Venky,Krishnam raju.నువ్వే నా బంగారం - సినిమాకి వెళితే ఇత్తడైపోద్ది..

మరింత సమాచారం తెలుసుకోండి: