సెకండ్ హాఫ్, నయనతార నటన, కీరవాణి మ్యూజిక్సెకండ్ హాఫ్, నయనతార నటన, కీరవాణి మ్యూజిక్నెమ్మదిగా సాగే కథనం, లాజిక్ లేకపోవడం, సన్నివేశాల సాగదీత

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా లో జరిగిన బాంబు పేలుడు కి భాద్యత వహిస్తూ హోం మినిస్టర్ రాజీనామా చేస్తాడు. అదే స్థానంలో హోం మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న ఆదికేశవయ్య(నరేష్) , పేలుళ్ళ కి కారణం అయిన మిలింద్ అంజీ మీద విచారణ వద్దని యాంటి టెర్రరిస్ట్ సెల్ అధికారి ఖాన్(పశుపతి) ని ఆదేశిస్తాడు. అదే సమయంలో ఉద్యోగ రిత్య వచ్చి తప్పిపోయిన భర్తను వెతుక్కుంటూ అమెరికా నుండి హైదరాబాద్ వస్తుంది అనామిక(నయనతార). షంషేర్ గంజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా తనకి అక్కడి పోలీస్ ఎవ్వరు సహాయపడరు. కాని ఎస్ ఐ పార్థ సారధి(వైభవ్) మాత్రం అనామికను సీరియస్ గా తీసుకొని ఆమెకు కావలసిన సహాయం చేస్తుంటాడు. అలా భర్త అజయ్ శాస్త్రి కోసం వెతకడం మొదలుపెట్టిన అనామికకు ఎవరు సహాయపడితే వారు అనుకోని రీతిలో చనిపోతుంటారు. వాళ్ళని ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అసలు బాంబు పేలుడుకి అనామికకు సంభంధం ఏంటి? అజయ్ శాస్త్రి దొరికాడా లేదా అన్నద్ది మిగిలిన కథ..

నయనతార , రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోజు నుండి ప్రతి చిత్రంలో ఒక మైలు రాయి లాంటి ప్రదర్శన ఇస్తున్న నయనతార ఈ చిత్రంలో కూడా అటువంటి నటననే కనబరిచింది. అక్కడక్కడా కాస్త్యుమ్స్ సెట్ అవ్వలేదు అనిపించినా ఆమె నటన మాత్రం చిత్రాన్ని కాపాడేలా సాగింది అని చెప్పుకోవాలి. విద్య బాలన్ స్థాయి నటన కనబరచగలదా? అన్న ప్రశ్నకు తన ప్రదర్శనతో సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో ఆమె నటన ప్రశంశనీయం. వైభవ్ తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. ప్రత్యేక అధికారి పాత్రలో నటించిన పశుపతి, నవాజుద్దిన్ సిద్దికి స్థాయి నటన కనబరచలేదు కాని అయన పాత్రకు ఏదైతే కావాలో అది ఇవ్వగలిగారు. హర్ష వర్ధన్ రానే పాత్ర చాలా చిన్నదే అయిపాత్రల పరిధి మేరకు పరవలేధనిపించారు.

ముందుగా ఏదైనా భాషలో సూపర్ హిట్ అయిన కథని తీసుకొని రీమేక్ చేస్తున్నాం అంటే ఆ కథ మన నేటివిటీకి తగ్గట్టు మార్చడం మాత్రమే కాదు ఒరిజినల్ కథ కంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా తయారు చేసుకోవాలి. అలా ఉండకపోతే ఏ ఒరిజినల్ వెర్షన్ హిట్ అయినా, రీమేక్ వెర్షన్ మాత్రం ఫట్ అంటుంది. ఇదే విషయమే 'అనామిక' విషయంలో జరిగింది. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ లో హిట్ అయిన పాయింట్ ప్రెగ్నెన్సీ మరియు కట్టె కొట్టె తెచ్చే అన్నట్టు ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్. ఈ రెండు పాయింట్స్ అనామిక సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఎందుకంటే శేఖర్ కమ్ముల కథలో మార్పులు చేసుకునేప్పుడు నా కథలో లేడీకి ప్రెగ్నెన్సీ పెడితే ఆడియన్స్ కి జాలి కలుగుతుంది కానీ నేను ఉమెన్ స్ట్రెంగ్త్ చూపించాలి అని ప్రెగ్నెన్సీ తీసేసాను అన్నాడు. కానీ దానివల్ల సినిమా మొదటి 10 నిమిషాల్లోనే సినిమాలో నిమగ్నమవ్వాల్సిన ప్రేక్షకుడు సెకండాఫ్ మొదలయిన 10 నిమిషాలకి కానీ కాన్సెప్ట్ కి కనెక్ట్ కాడు. దీన్ని బట్టి శేఖర్ కమ్ముల తీసిన ఫస్ట్ హాఫ్ సినిమాకి పెద్ద మైనస్ అని మీకర్ధ మైందనుకుంటా... ఇక రెండవది క్లైమాక్స్.. సింగల్ సీన్ లో ఫినిష్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యాల్సింది పోయి అక్కడ కూడా సీన్ ని సాగదీయడం వల్ల, ఈ గ్యాప్ లో ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఊహించేసుకుంటారు. దీన్ని బట్టి క్లైమాక్స్ కూడా ఆడియన్స్ మీద పెద్ద ఇంపాక్ట్ కలిగించలేకపోయింది. కథా పరంగా మరో మేజర్ మైనస్ ఏమిటంటే నయనతార తన భర్త కోసం వస్తుంది కానీ క్లైమాక్స్ లో టెర్రరిస్ట్ గురించి అన్నీ ముందే తెలుసుకొని అతన్ని ఫినిష్ చెయ్యడానికే వచ్చింది అని ఫినిష్ చేస్తారు కానీ నయనతారకి టెర్రరిస్ట్ గురించి ఎలా తెలిసింది? అసలు వాడి గురించి ఎందుకు తెలుసుకుంది? అనేది దానికి మాత్రం కారణం చూపించలేదు.

ఇకపోతే శేఖర్ కమ్ముల అన్ని సినిమాలు క్లాస్ అండ్ లవ్ ఎంటర్టైనర్స్ కావడం వల్ల స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా బాక్స్ ఆఫీసు వద్ద వర్కౌట్ అయ్యాయి. కానీ ఇదొక థ్రిల్లర్ సినిమా కాబట్టి స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కానీ మన శేఖర్ కమ్ముల మాత్రం తన పాత పంథానే కొనసాగిస్తూ అదే స్లో స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఫాలో అయ్యారు. దానివల్ల చాలా చోట్ల సినిమా బాగా బోర్ కొడుతుంది. కథలో మార్పుల విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో శేఖర్ దెబ్బతిన్నా డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా పాస్ మార్కులే..

ఈ చిత్రానికి విజయ్ . సి . కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది పాత బస్తీ అందాలను చాలా బాగా చూపెట్టారు. ఎడిటింగ్ విభాగం మరింత కష్టించి ఉండాల్సింది ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో సన్నివేశాలు చాలా పొడవుగా ఉంటూ సాగుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది ఇక్కడ ఎడిటర్ పనితనం చూపించి ఉంటె బాగుండేది. కీరవాణి అందించిన సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది ముఖ్యంగా రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలను అయన సంగీతంతోనే నిలబెట్టారు అనడంలో సంశయం లేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి చిత్రం ఆసాంతం రిచ్ లుక్ ఉంటుంది..

కహాని , ఆ సంవత్సరం లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్, ఇక శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ చిత్రాల తయారీలో సిద్దహస్తుడు. కుదరడంలోనే ఈ కాంబినేషన్ చాలా విచిత్రంగా కుదిరింది. ఇక చిత్ర విషయానికి వస్తే మొదటి అర్ధ భాగం అంతా నెమ్మదిగా నడిపేసి థ్రిల్లర్ అన్న భావం ఎక్కడా రానివ్వకుండా చేసారు. ఇక రెండవ అర్ధ భాగ కాస్త ఊపందుకున్నా కూడా అక్కడక్కడా శేఖర్ కమ్ముల స్లో చేసేసారు. నయనతార నటన , కీరవాణి సంగీతం ఈ చిత్రానికి తోడ్పడగా చేవలేని కథనం సాగిదీసిన సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్... హింది కహనిలా లేకపోవడం ఒక్కటే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ హైలెట్, ఈ చిత్రం కచ్చితంగా బి మరియు సి సెంటర్ ప్రేక్షకుల కోసం అయితే కాదు ఇక ఏ సెంటర్ ప్రేక్షకులు ఇదివరకే కహాని చిత్రాన్ని చూసుంటారు కాబట్టి ఎంతవరకు ఈ చిత్రాన్ని ఆదరిస్తారు అనేది వేచి చూడవలసిన విషయం , ఇక మా సలహా అయితే ఇది ఒక్క సారి చూడదగ్గ చిత్రం..

Nayantara,Vaibhav Reddy,Sekhar Kammula,Harsh Vardhan Rane.అనామిక : "కమ్ముల" స్టైల్ థ్రిల్లర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: