కథ, కథనం,నటీనటుల పనితీరు,నేపధ్య సంగీతం,సినిమాటోగ్రఫీ కథ, కథనం,నటీనటుల పనితీరు,నేపధ్య సంగీతం,సినిమాటోగ్రఫీ రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదించడం(అది కూడా కాసేపే),క్లైమాక్స్ లో సరైన జస్టిఫికేషన్ లేకపోవడం

క్రిమినాలజి కోర్స్ పూర్తి చేసిన వేణు(అశోక్ సెల్వన్) హైదరాబాద్లో డిటెక్టివ్ గా ఉద్యోగం వస్తుంది. పలు రకాల కేసు లను తన తెలివి తేటలతో పరిష్కరించి మంచి పేరు సంపాదించుకుంటాడు. కొన్ని కేసులు పరిష్కరించిన తరువాత అతని వద్దకు మధు శ్రీ (జనని అయ్యర్) కేసు వస్తుంది. మధు శ్రీ మీద నిఘా పెట్టిన వేణు మెల్లగా తనతో ప్రేమలో పడిపోతాడు. అదే సమయంలో మధు శ్రీ కూడా వేణుని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇదిలా సాగుతుండగా తను పరిష్కరించిన గత కేసులలో ఒకదానికొకటి సంభందం ఉన్నట్టు వేణుకి అనుమానం వస్తుంది. ఎంక్వైరీ చేస్తే వారంతా చనిపోతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో మధు శ్రీ కి ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది. వేణు తన గత కేసులలో ఉన్న సంభంధం కనుగొన్నాడా? లేదా? మధు శ్రీని కాపాడుకున్నాడా? లేదా? వేణు మరియు మధు శ్రీ ల ప్రేమ కథ ఏమయ్యింది? అన్నదే మిగిలిన కథ....

అశోక్ సెల్వన్ నటనా పరంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డిటెక్టివ్ కి ఉండవలసిన టెన్షన్ అతని పాత్రలో చాలా క్లియర్ గా కనబరచగలిగాడు. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాల వద్ద తడబడినా మొత్తం మీద ఆయన నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది అనే చెప్పాలి. జనని తన లుక్స్ పరంగా ఆకట్టుకోడమే కాకుండా హవాభావలతోను ఆకట్టుకోగలిగింది. అమాయకమయిన మధు పాత్రకి జనని సరిగ్గా సరిపాయింది. జయప్రకాశ్ ఎప్పటిలానే తనదయిన శైలిలో నటించి పాత్రకు కావలసినంత బలాన్ని అందించారు. ఇక అశోక్ సెల్వన్ స్నేహితుడిగా నటించిన కాళి కూడా చాలా బాగా నటించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

దర్శకుడు రమేష్ ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కానీ అసలు విషయంలోకి వెళితే ఈ సినిమా కాన్సెప్ట్ ని హాలీవుడ్ టీవీ సీరీస్ 'సిఎస్ఐ : మియామి - కిల్ క్లాస్' మరియు తెలుగులో వచ్చిన 'కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను' సినిమాల నుండి స్ఫూర్తి తీసుకున్నారు. కథని అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నప్పటికీ కథనాన్ని రాసుకోవడంలో మాత్రం దర్శకుడు విజయం సాదించాడు. చివరి వరకు సస్పెన్స్ ఉంచడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అందించిన దినేష్ చిత్రానికి కావలసిన మూడ్ సృష్టించడంలో విజయం సాదించారు. నిడివి తక్కువగా ఉండటమే కాకుండా ఎడిటింగ్ కూడా చాలా బాగుండటంతో చిత్ర వేగం అక్కడక్కడా తప్ప మిగతా అన్ని చోట్లా వేగంగా ఉంటుంది. డబ్బింగ్ పనులు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి, అలానే డైలాగ్స్ కూడా బాగా సూట్ అయ్యేలా రచించారు. సంగీతం అందించిన నివాస్ కె ప్రసన్న అందించిన పాటలు బాగా ఉన్నాయి, ముఖ్యంగా అయన అందించిన నేపధ్య సంగీతం చిత్ర కథనానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్లో సస్పెన్స్ ని నింపడానికి దోహదపడింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రమేష్ ఒక లఘు చిత్ర దర్శకుడు అంతే కాకుండా ఒక కసి ఉన్న దర్శకుడు కూడా అని ఈ చిత్రం చూసిన వారికి అర్ధం అయిపోతుంది. చాలా మంది దర్శకులు ట్విస్ట్ కి తగ్గ కథనం రాసి విఫలం అవుతుంటారు. ఈ చిత్రంలో కథనం వేగం ఉత్కంఠగా సాగటమే కాకుండా చివరిగా ట్విస్ట్ వచ్చేవరకు సాధారణ ప్రేక్షకుడు ఊహించలేనంత బలంగా కథనాన్ని రాసుకున్నారు దర్శకుడు. ఇటు వేగం తగ్గకుండా అటు పట్టు సడలకుండా కథనం రాసి ప్రేక్షకుడిని థ్రిల్ చెయ్యడంలో సఫలం అయ్యాడు దర్శకుడు. ఇక్కడ మైనస్ ఏమిటంటే సగటు ప్రేక్షకుడికి సినిమా సస్పెన్స్ నచ్చినా హాలీవుడ్ డిటెక్టివ్ సీరీస్ మరియు హిందీ సిఐడి సీరీస్ లు చూసే వారికి ఈ సినిమా కాన్సెప్ట్ అండ్ సీన్స్ ని అక్కడక్కడ నుంచి లేపెసినట్టు అనిపిస్తుంది. ఇక నటులలో అశోక్ సెల్వన్ నిజంగా పాత్రకు తగ్గ న్యాయం చేసాడు. అమాయకమయిన పాత్రలో జనని అయ్యర్ కూడా చాలా బాగా నటించింది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని తెరకెక్కించాలని అనుకోవడమే ధైర్యంతో కూడిన విషయం, లఘు చిత్రాలను తెరకెక్కించే దర్శకులకు ఎంత కసి ఉంటుంది అనేది ఈ చిత్రం నిరూపించింది మన పరిశ్రమలో కూడా చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తే ఇలాంటి చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు రమేష్ వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోలేదు. ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ నిడివి అని చెప్పుకోవచ్చు రెండు గంటలు మాత్రమే ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎటువంటి కష్టం పెట్టకుండా థ్రిల్ రైడ్ లా సాగిపోతుంది.

మొదటి అర్ధ భాగం చాలా వేగంగా సాగుతుంది రెండవ అర్ధ భాగం వచ్చేసరికి దర్శకుడు కావాలనే నెమ్మది చేసినట్టు అనిపించినా చివరికి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే ప్రేక్షకుడికి కచ్చితంగా వస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ కాకుండా కాస్త డిఫరెంట్ మూవీ చూడాలనుకునేవారు వెంటనే దగ్గరలోని థియేటర్ కి వెళ్లి చిత్రంలో తరువాత ఎం జరుగుతుంది అనేది ఊహించడానికి ప్రయత్నించండి...

Ashok Selva,Janani Iyer,Ramesh,Rama Krishna Reddy.భద్రమ్ - భయపెట్టలేదు, చిరాకు పెట్టలేదు..కానీ కాస్త టెన్షన్ పెట్టాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: