డా. మోహన్ బాబు పెర్ఫార్మన్స్ & పంచ్ డైలాగ్స్, మంచు విష్ణు పెర్ఫార్మన్స్, స్టొరీ లైన్ డా. మోహన్ బాబు పెర్ఫార్మన్స్ & పంచ్ డైలాగ్స్, మంచు విష్ణు పెర్ఫార్మన్స్, స్టొరీ లైన్ బాగా సాగదీసిన ఫస్ట్ హాఫ్, సర్కార్ కి పక్కా కాపీ అనిపించే కథ, నో ఎంటర్టైన్మెంట్ , బాగా నిడివి ఎక్కువ ఉన్న ఫైట్స్

రాయలసీమ.. అక్కడ అన్నగారు(డా. మోహన్ బాబు) అంటే ప్రజలందరికీ చాలా గౌరవం అయితే అయన భావాలు నచ్చని వారు మాత్రం అతనికి శత్రువులు. ప్రజల మంచి కోసం ఏమన్నా చేసే తత్త్వం అన్నగారిది. అతని పెద్ద కుమారుడు భూషణ్(కిషోర్) మాత్రం ఆయనకు విరుద్దంగా ప్రవర్తిస్తుంటాడు. చిన్న కొడుకు కృష్ణ(మంచు విష్ణు) మాత్రం నాన్న మార్గంలో నడిచే వ్యక్తి. ఆర్.కె అనే బిజినెస్ మేన్ రాయలసీమలో నందవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటాడు. కానీ దానివల్ల ప్రజలకి నష్టం వస్తుందనే ఉద్దేశంతో అన్నగారు అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడుతున్న అన్నగారిని ఆర్.కె చంపాలనుకుంటాడు. ఆ ప్లాన్ తెలుసుకున్న కృష్ణ తన తండ్రిని, ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? దానికోసం కృష్ణ ఏమేమి చేసాడు? అనేది మీరు రౌడీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

మోహన్ బాబు గారి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు ఎప్పటిలానే అయన తన అనుభవం తో ఈ పాత్రకు ప్రాణం పోశారు నిజానికి ఈ పాత్ర సరిగ్గా ఎలివేట్ కాకపోయినా కూడా తన డైలాగ్ డెలివరీ తో పాత్రను హైలెట్ అయ్యేలా చెయ్యగలిగారు మోహన్ బాబు గారు , ఇక మరో కీలక పాత్ర అయిన మంచు విష్ణు బాబు కూడా ఈ చిత్రంలో చాలా బాగా నటించారు నిజానికి ఆయనకీ అయన డైలాగ్ డెలివరీ కి తగ్గ పాత్ర ఇది. శాన్వి పాత్ర చాలా తక్కు సన్నివేశాలకే పరిమితం అయినా ఉన్నంతలో కూడా ఆకట్టుకోలేకపోయింది ఈ నటి. జయసుధ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది, రవి బాబు పాత్ర ఆకట్టుకోలేకపోయింది.. ఇక తనికెళ్ళ భరణి , కిశోర్ మరియు మిగిలిన వారు ఏదో పర్లేదు అనిపించారు.

రామ్ గోపాల్ వర్మ అంటే టాలీవుడ్ సంచలనం కాని ఈ మధ్య కాలంలో అయన తెరకెక్కిస్తున్న చిత్రాలు అసలు బాగుండటం లేదు "రౌడీ" చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది నిజానికి ఈ చిత్రం సర్కార్ మరియు సర్కార్ రాజ్ ని కలిపి గాడ్ ఫాదర్ లా తీస్తే ఎలా ఉంటుంది అన్న ప్రయోగానికి ఫలితంలా అనిపిస్తుంది. ఇక కథనం అయితే చాలా నెమ్మదిగా సాగుతూ విసుగు పెడుతుంది. డైలాగ్స్ బాగుండటం తో కొన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఈ మధ్య కాలంలో రాం గోపాల్ వర్మ ఫాలో అవుతున్న "రోగ్" పద్ధతినే ఈ చిత్రం సినిమాటోగ్రఫీలో కూడా ఉపయోగించారు, ఇది కొన్ని సన్నివేశాలకు బాగానే నప్పినా కొన్ని సన్నివేశాల్లో చిరాకు పెట్టింది. సాయి కార్తీక్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్ మరింత బాగుందల్సింది చాలా సన్నివేశాలను మరింత పదునుగా కత్తిరించి ఉంటె చిత్ర వేగం పెరిగి ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ సినిమా మన ముందుకు రావడానికి ప్రధాన కారణం రామ్ గోపాల్ వర్మ కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా.. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం తను పోస్ట్ చేసే కామెంట్స్ మీద కాసింత శ్రద్ధ తనుతీసే సినిమాలపై పెడితే సినిమాలన్నీ పెద్ద హిట్లు అయ్యేవి. కానీ తను ఆ పని మాత్రం చేయడం లేదు. ఈ సినిమా విషయంలో కూడా అదే చేసాడు. బాలీవుడ్ లో హిట్ అయిన సర్కార్ సినిమా బ్యాక్ డ్రాప్ ని మార్చి దానికి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ పెట్టేస్తే అదే 'రౌడీ' సినిమా. పైకేమో ఇది ఆ సినిమాకి రీమేక్ కాదు, కాపీ కాదు అంటూ బయట ప్రచారం చేసుకున్నా సినిమా రిలీజ్ అవ్వగానే వారి బాగోతం తెలిసిపోయింది. సరే కాపీ కొడితే కొట్టాడు పర్ఫెక్ట్ గా కథ, కథనం కూడా రాసుకోకుండా సినిమా తీయడం, మినిమం లాజిక్స్ కూడా ఫాలో అవ్వకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ఎప్పటిలానే కాళ్ళ కింద, చేతుల కింద, టేబుళ్ళ కింద ఇలా పలు చోట్ల కెమెరాలు పెట్టడంలో చూపించిన శ్రద్ధలో ఒక 30% సినిమాపై పెట్టి ఉంటె సినిమా పెద్ద హిట్ అయ్యేది.

సినిమాలో లాజిక్స్ అంటే .. అన్నగారేమో ఊళ్ళో ఎవరు ఏ ఆడ కూతురికి అన్యాయం చేసినా దారుణంగా శిక్షిస్తారు, లేదా చంపేస్తారు. కానీ తన కొడుకు ఊరిమీద పది రేప్ లు చేస్తే మాత్రం సింపుల్ గా నాలు దెబ్బలు కొట్టి, రేప్ చేసిన అమ్మాయికి క్షమాపణ చెప్పి పంపించేస్తారు. ఇందులో ఎంత వరకూ న్యాయం అనేది రామ్ గోపాల్ వర్మకే తెలియాలి. ఏరుకుంటే ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టు వర్మ గత రాడ్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాస్త బెటర్ అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమాని కాపాడింది మాత్రం ఒక్క మోహన్ బాబు పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఇలాంటి పెర్ఫార్మన్స్ ఎవరు రాబట్టు కోలేదు. అలాగే మంచు విష్ణు కూడా ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో షాక్ చేస్తాడు. ఎందుకంటే తను ఇలాంటి పాత్ర మునుపెన్నడూ చేయలేదు. మీరు మంచు ఫ్యామిలీ హీరోస్ కి అభిమానులైతే ఈ సినిమా కచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది. మిగతా వారైతే ఆలోచించి వెళ్ళండి.

Mohan Babu,Vishnu Vardhan Babu,Ram Gopal Varma,Shanvi.రౌడీ - 'వర్మ హోగయా డమ్మీ, మోహన్ బాబు హోగయా రౌడీ'

మరింత సమాచారం తెలుసుకోండి: