Coming Soon......Coming Soon......Coming Soon......

అమృతం(శ్రీనివాస్ అవసరాల) మరియు అతని స్నేహితుడు ఆంజనేయులు (హరీష్) ఒక రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ బూమ్ వలన రాత్రికి రాత్రి కొన్ని వేల కోట్లకు అధిపతులు అయిపోతారు. కాని అమృతం మామయ్య(చంద్రమోహన్) వీరిద్దరి చేత ఒక ఒప్పందం చేయిస్తాడు ఈజిప్ట్ లో పిరమిడ్ లు కూలిపోయే వరకు వీరిరువురు కలవకూడదు అని ఆ ఒప్పందం సారాంశం, ఇదిలా ఉండగా సిన్ లాడెన్ ఈజిప్ట్ లోని పిరమిడ్స్ ను పెల్చేస్తాడు, అప్పటి నుండి అమృతం మరియు అంజి కలిసి బిజినెస్ మొదలు పెడతారు. ఇదిలా ఉండగా వీరికి అప్పాజీ ద్వారా చంద్రమోహన్(రావు రమేష్) పరిచయం అవుతాడు. ఇతను ఆర్టీసీ(రాకెట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్) లో పని చేస్తుంటాడు. అమృతం మరియు అంజి వారి ఆస్తులన్నీ అమ్మేసి ఈ సంస్థ ద్వారా చంద్రుడు మీదకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. దీని కోసం వారు పడిన కష్టాలు ఏంటి? అసలు చంద్రుడు మీదకు వెళ్ళారా లేదా అన్నది మిగిలిన కథ...

అవసరాల శ్రీనివాస్, శివాజీ రాజ , నరేష్ మరియు హర్ష వర్ధన్ పోషించిన పాత్రలో కనిపించిన ఈ నటుడు వారి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కొంతవరకు అమృతం ఇంపాక్ట్ సృష్టించగలిగాడు. ఆంజనేయులు పాత్ర చేసిన హరీష్ , గుండు హనుమంత్ రావు స్థాయిలో పది శాతం కూడా ఆకట్టుకోలేకపోయాడు. సంజు పాత్రలో నటించిన ధన్య బాల కృష్ణన్ అందంగా కనిపించింది కాని సరయిన స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. శాంతం పాత్రలో నటించిన నటి ఆకట్టుకోలేకపోయింది. అప్పాజీ గా కనిపించిన శివనారాయణ తన నటనను అదే స్థాయిలో కొనసాగించారు. సర్వం పాత్రలో నటించిన వాసు ఇంటూరి కూడా ఆకట్టుకున్నారు కాని వీరిద్దరూ నవ్వించడంలో మాత్రం విఫలం అయ్యారు. రావు రమేష్ మరియు ఆహుతి ప్రసాద్ లు వారి స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయారు. మిగిలిన నటులందరు పరవాలేదనిపించారు.

అమృతం నుండి పాత్రలను తీసుకొని వాటి చుట్టూ కథను అల్లుకోవడంలో దర్శకుడు విజయం సాదించాడు కాని కథనం విషయంలో చాలా దారుణంగా విఫలం అయ్యారు. "వీళ్ళకి వెండి తెర ఇచ్చిన బుల్లి తెర బుద్దులు పోలేదు" అని ఇందులోనే ఒక డైలాగ్ ఉంది ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుంది ఈ డైలాగ్, కథనం విషయాలో ఈ చిత్రం లో ఎక్కడా వేగం కనిపించదు అన్ని టైం పాస్ సన్నివేశాలే ఎక్కడా ఒక గమ్యం వైపు వెళ్తున్న ఫీలింగ్ రాదూ పైగా కామెడీ కి ప్రతీక అయిన అమృతం పేరు మీద వస్తున్న చిత్రంలో కామెడి లేకపోవడం నిజంగా బాధపెట్టే అంశం. మాటలు కొన్ని బాగున్నా చాలా వరకు సాదాసీదాగా ఉంటూ బొత్తిగా ఆసక్తిని సృష్టించలేకపోయింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మొదటి అర్ధ భాగం అంతా మరీ నాసిరకంగా ఉంటుంది కాని రెండవ అర్ధ భాగంలో పరవాలేదనిపించింది ముఖ్యంగా చందమామ మీద జరిగే సన్నివేశాల వద్ద సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం విషయానికి వస్తే పాత పాటలను రీమేక్ చెయ్యడంతో ఆ పాటలని చెడగొట్టారు, నేపధ్య సంగీతం కూడా బొత్తిగా ఆకట్టుకోలేదు. చాలా సన్నివేశాలను కత్తిరించే అవకాశం ఉన్నా కూడా ఎడిటర్ ఎందుకు కత్తిరించకుండా ఎందుకు వదిలేసాడో తెలియట్లేదు.. గ్రాఫిక్స్ కూడా అంత గొప్పగా ఎం లేదు. నిర్మాణ విలువలు బాగాలేవు ..

అమృతం అనగానే బుల్లితెర మీద వచ్చిన ఒక అద్భుతమయిన ధారావాహిక అని గుర్తొస్తుంది. అమృతం మరియు ఆంజనేయులు పాత్రలు అప్పట్లో ప్రతి ఇంట్లో నవ్వులు పూయించింది. అదే చిత్రాన్ని చందమామ మీద చేస్తే ఎలా ఉంటుంది.. ఆలోచన చాలా వింతగా ఉంది.. కాని ఆలోచన మాత్రమే బాగుంది చిత్రం ఆసాంతం సాగదీసి అనవసరమయిన సన్నివేశాలతో సిల్లీ గా రాసేసుకున్నారు. సైన్సు ఫిక్షన్ కి కామెడీ టచ్ ఇచ్చారు కాని కామెడీ మాత్రమే గుర్తు పెట్టుకొని సైన్సు మరిచిపోయారు. ఏ సైన్సు ఫిక్షన్ సినిమా అయినా కొంతయినా సైన్సు ను నేర్పించేదిగా ఉండాలి కాని ఈ చిత్రం నేర్పించకపోగా మనకి వచ్చిన భౌతిక శాస్త్రం మీద సందేహం కలిగేలా చేస్తుంది. నిజానికి కామెడీ కోసం బౌతిక శాస్త్రాన్ని మార్చాల్సిన అవసరం లేదు , చంద్రుడి మీద ఆక్సిజన్ ఉండనప్పుడు చెట్లు ఎలా పెరుగుతాయి? ఇలాంటి సందేహాలు చాలానే ఉంటాయి. పైగా అసలు ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా పాటలు చేయించకుండా మంచి పాటలను రీమిక్స్ చేసి చెడగొట్టడం ఎందుకు??

ఈ చిత్రంలో క్రియేటివిటీ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని గుణ్ణం గంగరాజు గారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. మొదటి అర్ధ భాగం ఒక రకమయిన హింస అయితే రెండవ అర్ధ భాగం మరొక రకం.. మారింది హింసించే విధానమే కాని హింసలో ఎటువంటి మార్పు కనపడలేదు. తెలుగు పరిశ్రమలో మొదటి అంతరిక్ష చిత్రం అనగానే అందులోనూ గుణ్ణం గంగరాజు గారు దర్శకత్వం అనగానే చిత్రం విభిన్నంగా ఉంటుంది అనుకోని వెళ్లిన వారికి గురుత్వాకర్షణ లేని చోట మిగిలే శూన్యాన్నే చేతికి ఇచ్చి వెనక్కి పంపేసారు దర్శకుడు. గ్రాఫిక్స్ అయితే మరీ గొప్పగా లేదు. నిజానికి ఇవి కూడా ఆకట్టుకోలేదు. మీరు అమృతం ఫాన్స్ అయితే ఈ చిత్రానికి దూరంగా ఉండండి ఎందుకంటే ఇది చూస్తే అమృతం సీరియల్ మీద ఉన్న అభిమానం కూడా పోయే అవకాశం ఉంది..

Srinivas Avasarala,Dhanya Balakrishna,Gangaraju Gunnam,Shri.అమృతం : చందమామలో , థియేటర్ లో నరకం ..

మరింత సమాచారం తెలుసుకోండి: